అంద‘చందం’
ప్రకృతి సోయగాల కోట.. చందంపేట
అరకును తలపించే మనోహర దృశ్యాలు
బొర్రాగుహలను మరిపిస్తున్న గాజుబిడం గుహలు
తొలిసారిగా మండలంలో రెండు ఘాట్ల ఏర్పాటు
సందడి చేయనున్న పుష్కర భక్తులు
చుట్టూ నల్లని కొండలు.. జాలువారే జలపాతాలు.. పరిచిన పచ్చని తివాచీలా పంట పొలాలు.. కృష్ణమ్మ పరవళ్లు.. అరకును తలపించే దేవరచర్ల అందాలు.. బొర్రా గుహలను మైమరపించే గాజుబిడం గుహలు.. ఆధ్యాత్మికతను పెంచే ఆలయాలు.. 300 ఏళ్లనాటి బృహత్‌కాల సమాధులు.. ఎటు చూసినా మనసును పరవశించే ప్రకృతి సోయగాలు.. మరో వైపు గిరిజనుల సంస్కృతి.. విభిన్న వంటకాలు.. వీటిని చూడాలంటే ‘చందంపేట’కు వెళ్లాల్సిందే.. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడి అందచందాలపై ఈ వారం సండేస్పెషల్‌లో మీకోసం..
– చందంపేట