Boxer Vijender
-
భారత్‌లోనూ ఇదే జోరు చూపిస్తా: విజేందర్
లండన్: వరుసగా ఐదో నాకౌట్ విజయంతో జోష్‌లో ఉన్న ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ త్వరలో భారత గడ్డపై జరిగే బౌట్లోనూ తడాఖా చూపిస్తానంటున్నాడు. వచ్చే నెల 11న డబ్ల్యూబీవో ఆసియా బెల్ట్‌లో విజేందర్ తలపడనున్నాడు. అంతకన్నా ముందు ఈనెల 13న బోల్టన్‌లో అతడు ఆరో ఫైట్‌లో బరిలోకి దిగనున్నాడు. ‘రోయర్‌తో మ్యాచ్‌లో మేం రూపొందించిన గేమ్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేశాను. భారత్‌లో జరిగే ఆసియా బెల్ట్ పోటీలోనూ రాణిస్తా’ అని విజేందర్ అన్నాడు. -
'ప్రధాని నన్ను ఉత్తేజపరిచారు'
న్యూఢిల్లీ: ఇప్పటివరకు పోటీపడిన నాలుగు బౌట్లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్. చివరగా అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో జరిగిన బౌట్ లో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన ఈ బాక్సర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మోదీని కలవడానికి వెళ్తున్నానంటూ తొలుత ట్వీట్ చేసిన విజేందర్, ప్రధానిని కలిసి బాక్సింగ్ గురించి చర్చించినట్లు ట్వీట్ లో రాసుకొచ్చాడు. ప్రధానిని కలిసిన తర్వాత చాలా ప్రేరణ పొందినట్లు, ఆయన తనను ఉత్తేజాన్ని కలిగించారని, భారత్ లో ఇక ముందు బాక్సింగ్ ఆట ఎలా ఉండబోతుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు విజేందర్ తెలిపాడు. ప్రధానిని కలిసినందకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తన తదుపరి బౌట్ ఏప్రిల్ 2న ఉండగా, ఆ బౌట్ ను 30వ తేదీకి మార్చుకున్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. లండన్ లోని కాపర్ బాక్స్ ఎరినాలో తన ఐదో బౌట్ జరగుతుందని అక్కడ కూడా మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నానని రెండు రోజుల కిందట ట్వీట్ లో వెల్లడించాడు. Plzr meeting u sir @narendramodi Feeling motivated having a long discussion on future of boxing in our country -
జయహో... విజేందర్
వరుసగా నాలుగో బౌట్లోనూ విజయం లివర్‌పూల్: గతేడాది పోటీపడిన మూడు బౌట్లలోనూ నాకౌట్ విజయాలు నమోదు చేసిన భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్... కొత్త ఏడాదిలోనూ శుభారంభం చేశాడు. ఈ సంవత్సరం తాను బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలెగ్జాండర్ హోర్వత్ (హంగేరి)తో శనివారం జరిగిన బౌట్లో విజేందర్ మూడో రౌండ్లో ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో గెలుపొందాడు. 30 ఏళ్ల విజేందర్ సంధించిన పంచ్‌ల ధాటికి 20 ఏళ్ల హోర్వత్ ఎదురునిలువలేకపోయాడు. మూడు నిమిషాల నిడివిగల ఆరు రౌండ్లపాటు ఈ బౌట్ జరగాల్సింది. తొలి రౌండ్ నుంచే విజేందర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అవకాశం దొరికినపుడల్లా పంచ్‌లు కురిపించాడు. దాంతో మూడో రౌండ్లో నిమిషం ముగిసిన వెంటనే హోర్వత్ ఓటమిని అంగీకరిస్తూ బౌట్‌ను కొనసాగించలేనని చేతులెత్తేశాడు. విజేందర్‌తో పోరుకు సన్నాహాల్లో భాగంగా హోర్వత్ తన ఆహార జాబితాలో పాము రక్తం కూడా చేర్చుకున్నాడు. అయితే విజేందర్ దూకుడు ముందు ఇవేవీ పనిచేయలేదు. విజేందర్ కెరీర్లో వరుసగా ఇది నాలుగో విజయం కావడం విశేషం.