boxing fight
-
కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్
బాక్సింగ్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కాల్పుల శబ్దం వినిపించడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో స్టేడియం బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బ్రూక్లిన్ వేదికగా బార్క్లేస్ సెంటర్లో గెర్వొంటా డేవిస్, రొనాల్డో రొమేరో మధ్య బాక్సింగ్ ఫైట్ జరిగింది. పోరు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఎరీనాలోకి అగంతకుడు తుపాకీతో చంపడానికి వచ్చాడేమోనని భయపడిన ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటూ బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కాల్పులు జరిగింది బార్క్లే సెంటర్లో కాదని.. బయట జరిగాయని తేలింది. విషయం తెలుసుకున్న ప్రేక్షకులు శాంతించడంతో కాసేపట్లోనే పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చింది. కాగా అదే బార్క్లే సెంటర్‌కు జపాన్ టెన్నిస్ స్టార్ నయామి ఒసాకా కూడా వచ్చింది. అక్కడ జరిగిన అనుభవాన్ని ఒసాకా తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ''నేనప్పుడే బార్క్లే సెంటర్‌లోనికి వచ్చాను. అప్పుడే సడెన్‌గా నాకు కాల్పుల శబ్దం వినిపించడం.. ప్రాణభయంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడంతో నాకు భయమేసింది. వెంటనే పక్కనే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్లిపోయి డోర్స్ క్లోజ్ చేసుకున్నాం. ఆ క్షణంలో మాకు ప్రాణం మీద ఆశ కలిగింది. నా జీవితంలో ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి అనుకుంటా'' అంటూ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గెర్వొంటో డేవిస్.. రొనాల్డో రెమోరోపై నాకౌట్ విజయం సాధించాడు. చదవండి: Viral Video: అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే! Scary moment as crowds pour back into Barclays Center, my fear was a shooting but those fears proved unfounded. pic.twitter.com/pcBdfwWplt — Ryan Songalia (@ryansongalia) May 29, 2022 DOWN GOES ROMERO 😱 #DavisRomero pic.twitter.com/nKDMPhD89h — CBS Sports (@CBSSports) May 29, 2022 -
బ్లాక్‌బస్టర్ గ్యారంటీ
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రణం రుధిరం రౌద్రం). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చరణ్ పుట్టినరోజుకి ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబందం. ఈ టీజర్లో రామ్ చరణ్ యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధానికి తయారవుతున్నట్టు కనిపించారు. ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు యాక్షన్ కొరియోగ్రాఫర్ కుల్దీప్. ‘‘రాజమౌళితో సినిమా చేయడం సంతోషంగా, గర్వంగా ఉంది. ఇందులో బాక్సింగ్ కి సంబంధించిన పలు సన్నివేశాలు ఉన్నాయి. ఆ ఫైట్స్ ని నేనే డిజైన్ చేసాను. స్క్రీన్ మీద సూపర్ గా ఉంటాయి. ‘బాహుబలి’లా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని పేర్కొన్నారు కుల్దీప్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. రాజమౌళి, కుల్దీప్ రామ్ చరణ్, కుల్దీప్ -
పాకియాతో పోరుకు అమిర్ ఖాన్ సిద్ధం
దుబాయ్: బాక్సింగ్ దిగ్గజం, డబ్యూబీఓ వెల్టర్ వెయిట్ చాంపియన్ మానీ పాకియాతో పోరుకు బ్రిటీష్ బాక్సర్, ఒలింపిక్ మాజీ లైట్ వెయిట్ చాంపియన్ అమిర్ ఖాన్ సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 23వ తేదీన వీరి మధ్య 'సూపర్ ఫైట్' జరుగనుంది. ఈ విషయాన్ని పాకియా తన ట్విట్టర్ అకౌంట్ లో తాజాగా వెల్లడించాడు. తమ మధ్య పోరు కోసం ఎప్పట్నుంచో నిరీక్షిస్తున్న అభిమానుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఈ సందర్భంగా పాకియా పేర్కొన్నాడు. ఈ మేరకు తనతో పోరుకు అమిర్ ఒప్పుకున్న విషయాన్ని పాకియా స్పష్టం చేశాడు. ఈ పోరు యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో జరుగనుంది. అయితే ఆ పోరు జరిగే వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీనిపై అమిర్ ఖాన్ స్పందిస్తూ.. పాకియాతో సూపర్ ఫైట్ కు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ పోరులో ఏమి జరుగుతుందో ప్రేక్షకులే చూస్తారని తన గెలుపుపై ముందుగానే అమిర్ ధీమా వ్యక్తం చేశాడు. 2016 మేలో అమిర్ చివరిసారి బాక్సింగ్ రింగ్ లో కనిపించాడు. ఆ పోరులో మెక్సికన్ బాక్సర్ అల్వరెజ్ చేతిలో అమిర్ నాకౌట్ అయ్యాడు. మరొకవైపు ఆరుసార్లు వెల్డర్ వెయిట్ లో ఆరు వెయిట్ కేటగిరీల్లో ప్రపంచ చాంపియన్ గా నిలిచిన పాకియా.. గతేడాది బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ తరువాత అదే ఏడాది నవంబర్ లో మళ్లీ బరిలోకి దిగి వెల్టర్ వెయిట్ టైటిల్ ను నిలుపుకున్నాడు.