బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ | Ram Charan Tej Gets Involved with Kick Boxers | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ

Published Mon, May 4 2020 12:04 AM | Last Updated on Mon, May 4 2020 4:03 AM

 Ram Charan Tej Gets Involved with Kick Boxers - Sakshi

రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌

ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రణం రుధిరం రౌద్రం). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్‌ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. చరణ్‌ పుట్టినరోజుకి ఓ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబందం. ఈ టీజర్‌లో రామ్‌ చరణ్‌ యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధానికి తయారవుతున్నట్టు కనిపించారు.

ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కుల్దీప్‌. ‘‘రాజమౌళితో సినిమా చేయడం  సంతోషంగా, గర్వంగా ఉంది. ఇందులో బాక్సింగ్‌ కి సంబంధించిన పలు సన్నివేశాలు ఉన్నాయి. ఆ ఫైట్స్‌ ని  నేనే డిజైన్‌ చేసాను. స్క్రీన్‌ మీద సూపర్‌ గా ఉంటాయి. ‘బాహుబలి’లా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అని పేర్కొన్నారు కుల్దీప్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

రాజమౌళి, కుల్దీప్‌


రామ్‌ చరణ్, కుల్దీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement