పాకియాతో పోరుకు అమిర్ ఖాన్ సిద్ధం | WBO world welterweight champion Manny Pacquiao will fight Great Britain's Amir Khan on 23 April. | Sakshi
Sakshi News home page

పాకియాతో పోరుకు అమిర్ ఖాన్ సిద్ధం

Published Mon, Feb 27 2017 11:27 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

పాకియాతో పోరుకు అమిర్ ఖాన్ సిద్ధం

పాకియాతో పోరుకు అమిర్ ఖాన్ సిద్ధం

దుబాయ్: బాక్సింగ్ దిగ్గజం, డబ్యూబీఓ వెల్టర్ వెయిట్ చాంపియన్  మానీ పాకియాతో పోరుకు బ్రిటీష్ బాక్సర్, ఒలింపిక్ మాజీ లైట్ వెయిట్ చాంపియన్ అమిర్ ఖాన్ సిద్ధమయ్యాడు.  ఏప్రిల్ 23వ తేదీన వీరి మధ్య 'సూపర్ ఫైట్' జరుగనుంది. ఈ విషయాన్ని పాకియా తన ట్విట్టర్ అకౌంట్ లో తాజాగా వెల్లడించాడు. తమ మధ్య పోరు కోసం ఎప్పట్నుంచో నిరీక్షిస్తున్న అభిమానుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఈ సందర్భంగా పాకియా పేర్కొన్నాడు. ఈ మేరకు తనతో పోరుకు అమిర్ ఒప్పుకున్న విషయాన్ని పాకియా స్పష్టం చేశాడు. ఈ పోరు యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో జరుగనుంది. అయితే ఆ పోరు జరిగే వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు.


దీనిపై అమిర్ ఖాన్ స్పందిస్తూ.. పాకియాతో సూపర్ ఫైట్ కు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ పోరులో ఏమి జరుగుతుందో ప్రేక్షకులే చూస్తారని తన గెలుపుపై ముందుగానే అమిర్ ధీమా వ్యక్తం చేశాడు. 2016 మేలో అమిర్ చివరిసారి బాక్సింగ్ రింగ్ లో కనిపించాడు. ఆ పోరులో మెక్సికన్ బాక్సర్ అల్వరెజ్ చేతిలో అమిర్ నాకౌట్ అయ్యాడు. మరొకవైపు ఆరుసార్లు వెల్డర్ వెయిట్ లో ఆరు వెయిట్ కేటగిరీల్లో  ప్రపంచ చాంపియన్ గా నిలిచిన పాకియా.. గతేడాది బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.  ఆ తరువాత అదే ఏడాది నవంబర్ లో మళ్లీ బరిలోకి దిగి వెల్టర్ వెయిట్ టైటిల్ ను నిలుపుకున్నాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement