Manny Pacquiao
-
బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్యక్ష పదవిపై టార్గెట్
మనీలా: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ లెజెండ్ మ్యానీ పకియావో తన బాక్సింగ్ కెరీర్‌కు వీడ్కొలు పలికాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ట్విట్టర్లో వీడియో సందేశం ద్వారా తెలిపాడు. తనను పేదరికం నుంచి ఈ స్ధాయికు తీసుకువచ్చిన బాక్సింగ్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా ఉంది అని పకియావో తెలిపాడు. తన రాజకీయ భవిష్యత్తు పై దృష్టి సారించేందుకుఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. 2022లో ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు గతంలో మ్యానీ పకియావో ప్రకటించాడు. కాగా అతడు ఫిలిప్పీన్‌లో సెనేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడు చివరిగా క్యూబాకు చెందిన యోర్డెనిస్ ఉగాస్ ప్రొఫెషనల్ ఫైట్‌లో తలపడ్డాడు. ఈ ఫైట్‌లో పకియావో ఓటమి చెందాడు. కాగా తన 26 ఏళ్ల బాక్సింగ్ కెరియర్లో 8 డివిజన్ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా పకియావో నిలిచాడు. చదవండి: Team India Head Coach: కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్! -
పాకియాతో పోరుకు అమిర్ ఖాన్ సిద్ధం
దుబాయ్: బాక్సింగ్ దిగ్గజం, డబ్యూబీఓ వెల్టర్ వెయిట్ చాంపియన్ మానీ పాకియాతో పోరుకు బ్రిటీష్ బాక్సర్, ఒలింపిక్ మాజీ లైట్ వెయిట్ చాంపియన్ అమిర్ ఖాన్ సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 23వ తేదీన వీరి మధ్య 'సూపర్ ఫైట్' జరుగనుంది. ఈ విషయాన్ని పాకియా తన ట్విట్టర్ అకౌంట్ లో తాజాగా వెల్లడించాడు. తమ మధ్య పోరు కోసం ఎప్పట్నుంచో నిరీక్షిస్తున్న అభిమానుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఈ సందర్భంగా పాకియా పేర్కొన్నాడు. ఈ మేరకు తనతో పోరుకు అమిర్ ఒప్పుకున్న విషయాన్ని పాకియా స్పష్టం చేశాడు. ఈ పోరు యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో జరుగనుంది. అయితే ఆ పోరు జరిగే వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీనిపై అమిర్ ఖాన్ స్పందిస్తూ.. పాకియాతో సూపర్ ఫైట్ కు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ పోరులో ఏమి జరుగుతుందో ప్రేక్షకులే చూస్తారని తన గెలుపుపై ముందుగానే అమిర్ ధీమా వ్యక్తం చేశాడు. 2016 మేలో అమిర్ చివరిసారి బాక్సింగ్ రింగ్ లో కనిపించాడు. ఆ పోరులో మెక్సికన్ బాక్సర్ అల్వరెజ్ చేతిలో అమిర్ నాకౌట్ అయ్యాడు. మరొకవైపు ఆరుసార్లు వెల్డర్ వెయిట్ లో ఆరు వెయిట్ కేటగిరీల్లో ప్రపంచ చాంపియన్ గా నిలిచిన పాకియా.. గతేడాది బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ తరువాత అదే ఏడాది నవంబర్ లో మళ్లీ బరిలోకి దిగి వెల్టర్ వెయిట్ టైటిల్ ను నిలుపుకున్నాడు. -
సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన దిగ్గజం!
మనీలా: బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను గడగడలాడించడంలోనే కాదు.. వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ తాను మేటి అనిపించుకున్నాడు బాక్సింగ్ మాజీ దిగ్గజం. ఎనిమిది సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన దిగ్గజం మానీ పాక్వియావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా హీనమైన వారని వ్యాఖ్యానించాడు. ఫిలిప్పీన్స్ సెనేట్ లో స్థానం కోసం పోటీపడుతున్న తరుణంలో ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెను దుమారం రేపాయి. ఈ మే నెలలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. భార్యతో పాటు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. తాను ఎవరిని విమర్శించడం లేదని, బైబిల్ లో పేర్కొన్న విషయాలనే తాను ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు తాను చేసిన పనిని తప్పు అని గ్రహించాడు. హోమో సెక్సువల్స్ ను దూషించినందుకు తనను క్షమించాలని కోరాడు. 'జంతువులు కూడా స్వలింగ సంపర్కం చేస్తాయి. అయినా అవే నయం. వాటికి ఆడా, మగా అనే తేడా అయినా ఉంది. పురుషులు- పురుషులతో, మహిళలు - మహిళలతో సెక్స్ లో పాల్గొనడం జంతువుల కంటే దారుణం' అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వైస్ గండా అనే ఓ గే ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. ట్విట్టర్లో ఆ బాక్సర్ పై విమర్శల వర్షం కురిపించాడు. పాక్వియావో తనకు తానుగా దేవుడు అని ఫీలవుతున్నాడు. కానీ, రాజకీయాలకు కావాలసింది నైపుణ్యం ఉన్నవాళ్లంటూ గండా మండిపడ్డాడు. ఇప్పటికీ తాను తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని.. ఎందుకంటే పవిత్ర బైబిల్ లో స్వలింగ సంపర్కం తప్పు అని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించాడు. దేవుడు మిమ్మల్ని అందర్నీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అని బాక్సర్ పాక్వియావో చెప్పుకొచ్చాడు. -
సూపర్... మేవెదర్
అద్భుతమేమీ జరగలేదు. అనుభవమే గెలిచింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ ‘మెగా ఫైట్’లో పైచేయి సాధించాడు. ఫిలిప్పీన్స్ మేటి బాక్సర్ మ్యానీ పాకియోపై హోరాహోరీ పోరులో నెగ్గిన మేవెదర్ కెరీర్లో వరుసగా 48వ విజయంతో తన అజేయ రికార్డును కొనసాగించాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్‌గా నిలిచిన ఈ పోటీలో గెలవడం ద్వారా మేవెదర్ 18 కోట్ల డాలర్లు (రూ. 1147 కోట్లు), పాకియో 12 కోట్ల డాలర్లు (రూ. 764 కోట్లు) తమ ఖాతాలో వేసుకున్నారు. ‘మెగా ఫైట్’లో అమెరికా బాక్సర్దే గెలుపు ► కెరీర్లో వరుసగా 48వ విజయం ► పోరాడి ఓడిన పాకియో లాస్‌వేగాస్ : ఇద్దరు బాక్సింగ్ దిగ్గజాల మధ్య జరిగిన పసందైన పోరులో అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫిలిప్పీన్స్ మేటి బాక్సర్ మ్యానీ పాకియోతో ఆదివారం జరిగిన వెల్టర్ వెయిట్ కేటగిరీ బౌట్లో మేవెదర్ పాయింట్ల పద్ధతిలో విజయాన్ని సాధించాడు. నిర్ణీత 12 రౌండ్ల అనంతరం బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు జడ్జిలు మేవెదర్కే (118-110, 116-112, 116-112 పాయింట్లు) అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించారు. ఈ గెలుపుతో 38 ఏళ్ల మేవెదర్ తన విజయాల రికార్డును 48-0తో మెరుగుపర్చుకున్నాడు. మరోవైపు 36 ఏళ్ల పాకియో కెరీర్లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. బౌట్ మొత్తంలో మేవెదర్ 435 పంచ్‌లు విసరగా అందులో 148 పంచ్‌లు ప్రత్యర్థికి తగిలాయి. మరోవైపు పాకియో 429 పంచ్‌లు విసరగా అందులో 81 పంచ్‌లు మేవెదర్‌కు తగిలాయి. వీటి ఆధారంగానే మేవెదర్ విజయం ఖాయమైంది. శతాబ్దపు పోరు’ గా ప్రచారం కల్పించిన ఈ బౌట్లో పాకియో నుంచి మేవెదర్‌కు ఆద్యంతం గట్టిపోటీనే ఎదురైంది. ఎడంచేతి వాటం బాక్సరైన పాకియో ఆరంభ రౌండ్లలో దూకుడుగా వ్యవహరించాడు. పలుమార్లు మేవెదర్పై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. కొన్నిసార్లయితే మేవెదర్ వీటి నుంచి తప్పించుకోవడానికి రింగ్‌లో ఓ మూలకు వెళ్లిపోయాడు. అయితే మేవెదర్ మాత్రం ఆచితూచిగా కదులుతూ అవకాశం దొరికినపుడల్లా పంచ్‌లు సంధించాడు. మొత్తానికి బౌట్ చూసిన వారికి పాకియో ఆధిపత్యం చలాయించినట్లు కనిపించినా... పరిగణనలోకి తీసుకున్న పంచ్‌ల విషయంలో మా త్రం మేవెదర్ పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బౌట్‌ను టీవీ ల్లో 40 కోట్ల మంది తిలకిం చారని అంచనా. ఈ ఫైట్‌ను చూసేందుకు చాలా మంది సెలబ్రిటీలు రావడంతో లాస్‌వేగాస్‌లోని విమానాశ్రయం ప్రైవేట్ జెట్ విమానాలతో నిండి పోయింది. ఫిలిప్పీన్స్‌లో పాకియో అభిమానుల కోసం పలు స్టేడియాల్లో, వీధుల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బౌట్ జరుగుతున్నంతసేపు మనీలా వీధులు అభిమానులతో నిండిపోయాయి. పాకియో బాక్సింగ్ శైలి విభిన్నంగా ఉంటుంది. అందుకే కొంత సమయం తీసుకొని అతణ్ని పరిశీలించాను. ఆ తర్వాత దూకుడు పెంచాను. అతని పోరాటపటిమ అమోఘం. పాకియో చాలా పంచ్‌లు విసిరినా అందులో చాలావరకు నాకు తగల్లేదు. సెప్టెంబరులో నా కెరీర్లో చివరి బౌట్లో తలపడతాను. -మేవెదర్ నిజానికి నేనే గెలిచానని అనుకున్నాను. అయితే రింగ్‌లో మేవెదర్ కదులుతున్నపుడు అతనిపై పంచ్‌లు సంధించడం కష్టం. ఒకేచోట ఉన్నపుడు అతనిపై పంచ్‌ల వర్షం కురిపించాను. భుజం నొప్పితోనే ఈ బౌట్ బరిలోకి దిగాను. నొప్పి నివారణకు ఇంజెక్షన్ తీసుకుంటానని కోరినా నిర్వాహకులు అంగీకరించలేదు. -పాకియో