The boys hostel
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి దీపావళి స్పెషల్ కానుకగా 'జపాన్', 'జిగర్ తాండ', 'టైగర్ 3' లాంటి డబ్బింగ్ మూవీస్ మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కావడం లేదు. దీంతో ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం బోలెడన్ని కొత్తకొత్త సినిమాలు-సిరీసులు రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: హగ్గులు-కిస్సులతో ఊపిరాడనివ్వలేదు.. ఆ ఇద్దరి గురించి ప్రియాంకకు వార్నింగ్!) ఈ సోమవారం ఓటీటీ మూవీస్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పటికీ 20కి పైగా సినిమాలు వచ్చాయి. కానీ వీటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయిపోతుండగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. అలా ఈ శుక్రవారమే దాదాపు 18 మూవీస్-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూరు స్క్వాడ్, ఘూమర్, ద బాయ్స్ హాస్టల్ సినిమాలతో పాటు లేబుల్ అనే వెబ్ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. వీటిలో మీ ఛాయిస్ ఏంటి? ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (నవంబరు 10) నెట్‌ఫ్లిక్స్ ఎట్ ద మూమెంట్ - మాండరిన్ సిరీస్ ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ - స్పానిష్ సిరీస్ ద కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా అకుమా కున్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ 007: రోడ్ టూ ఏ మిలియన్ - ఇంగ్లీష్ సిరీస్ దిన్ హసీమ్ - ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో పిప్పా - హిందీ చిత్రం పులిక్కుత్తు పండి - తమిళ మూవీ హ్యాక్ క్రైమ్స్ ఆన్లైన్ - హిందీ సిరీస్ క్రష్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్ (నవంబరు 11) BTS ఎట్ టూ కమ్ - కొరియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కన్నూరు స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ మూవీ లేబుల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ జీ5 ఘూమర్ - హిందీ సినిమా ఆహా ద రోడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం బుక్ మై షో ద అడల్ట్స్ - ఇంగ్లీష్ మూవీ లయన్స్ గేట్ ప్లే వాట్స్ లవ్ గాట్ టుడూ విత్ ఇట్ - ఇంగ్లీష్ సినిమా ఈ - విన్ ద బాయ్స్ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?) -
బాలుర వసతి భవనానికి రైల్వేలైన్ గండం
రూ.3కోట్లతో నిర్మాణం ప్రారంభానికి నోచుకోని వైనం రైల్వేలైన్ నిర్మాణంలో తొలగనున్న భవనం వృథాకానున్న కోట్ల రూపాయల ధనం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని బాలుర వసతిగృహాలను ఒకే భవనంలోకి తీసుకువచ్చేందుకు ఆ భవనాన్ని నిర్మించారు. కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఈ భవనాన్ని ఇంకా ప్రారంభించలేదు. నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలగించనున్న భవనంపైప్రత్యేక కథనం. ఆత్మకూరురూరల్: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఒకే నీడకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 2013లో రూ.3కోట్లతో సమీకృత బాలుర వసతిగృహ భవనాన్ని మంజూరు చేసింది. అప్పట్లో మంత్రి రామనారాయణరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకొన్న ఈ భవన నిర్మాణం ఏడాది క్రితం పూర్తయింది. ప్రభుత్వం మారడం..సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మరిచిపోవడంతో వసతి భవనం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. వసతి భవనానికి రైల్వేలైన్ గండం కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి భవనానికి నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ గండం నెలకొంది. ఆత్మకూరులోని బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే రైల్వేలైన్ వసతి భవనాన్ని తాకనుంది. రైల్వేలైన్ నిర్మాణానికి భవనాన్ని తొలగించక తప్పదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ వసతి భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. అప్పట్లో ఆత్మకూరు తహశీల్దార్ రైల్వేలైన్ నిర్మాణంలో నూతన భవనాన్ని తొలగించక తప్పదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు తహశీల్దార్ సమాచారాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రైల్వేలైన్ రూట్ మ్యాప్ పూర్తయిందని, వసతి భవనం మీదుగా కాకుండా రైల్వేలైన్‌ను మారిస్తే రైల్వేస్టేషన్ ఆత్మకూరు పట్టణానికి దూరమవుతుందని తెలిపారు. ఈ రైల్వేలైన్‌ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్రం రైల్వేలైన్ నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు చూపిన మార్గంలోనే రైల్వేలైన్ నిర్మాణం చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు వసతి భవనాన్ని విస్మరించి స్థలం కేటాయించడంతో రైల్వేలైన్ నిర్మాణానికి కోట్లతో నిర్మించిన భవనాన్ని తొలగించక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయమై తహశీల్దార్ బీకే వెంకటేశులును సంప్రదించగా ప్రస్తుత రైల్వేలైన్ నిర్మాణం డిజైన్ ప్రకారం హాస్టల్ భవనం తొలగించక తప్పదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కలెక్టర్‌తో పాటు రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.