bpo jobs
-
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా కొలువులు!
ముంబై: బిజినెస్ ప్రాసెస్ అవుట్సౌర్సింగ్ (బీపీవో) సేవల సంస్థ ఐసీసీఎస్ వివిధ విభాగాల్లో దాదాపు 7,000 మందిని రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. వచ్చే 12 నెలల కాలంలో ఈ మేరకు నియామకాలు జరపనున్నట్లు సంస్థ సీఈవో దివిజ్ సింఘాల్ తెలిపారు. కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, మార్కెట్ రీసెర్చ్, మానవ వనరులు, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో హైరింగ్ ఉంటుందని వివరించారు. ఐసీసీఎస్కి ప్రస్తుతం ఎనిమిది ప్రాంతాల్లో డెలివరీ సెంటర్లు ఉన్నాయి. దాదాపు 6,600 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. చదవండి: పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్! -
బీపీవో ఉద్యోగాలు..ఏపీ నుంచే అత్యధికం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ ప్రోత్సాహక పథకం కింద దేశవ్యాప్తంగా 247 బీపీవో/ఐటీఈఎస్ యూనిట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) తెలిపింది. 102 నగరాల్లో ఇవి విస్తరించాయని వివరించింది. ప్రత్యక్షంగా ఈ యూనిట్ల ద్వారా 41,628 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 10,673 మంది ఉన్నారని తెలిపారు. ఏపీ నుంచి ఐటీ, అనుబంధ సేవల ఎగుమతులు 2016–17లో రూ.526.69 కోట్లు నమోదైతే.. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.836.42 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఎస్టీపీఐ కొత్తగా 12 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు. వీటిలో ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ పేరుతో ఒక కేంద్రం వైజాగ్‌లో ఏర్పాటవు తుందని చెప్పారు. బీపీవో ప్రమోషన్ స్కీమ్ కింద చిన్న పట్టణాల్లో ఐటీ పరిశ్రమను బలోపేతం చేయడంలో భాగంగా బీపీవో యూనిట్ల ఏర్పాటుకు కంపెనీలకు ఎస్టీపీఐ ప్రోత్సాహకాలను అందిస్తోంది. చదవండి : నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్ stockmarket: సెన్సెక్స్,నిఫ్టీ కన్సాలిడేషన్ -
న్యూ బీపీఓ పాలసీ : ఇక ఇంటి నుంచే కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : యువతులు, గృహిణులకు అనుకూలంగా ఐటీ, బీపీఓ కొలువులను ఎంచక్కా ఇంటి నుంచే చక్కబెట్టుకునే అవకాశం తలుపుతట్టనుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద బీపీఓ ప్రోత్సాహక పధకంలో ఈ వెసులుబాటును చేర్చాలని ఐటీ, ఎలక్ర్టానిక్స్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నూతన యూనిట్లు నెలకొల్పాలనుకునే సంస్థలకు ఇచ్చే రాయితీలకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్లనూ వర్తింపచేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ పధకం కింద 4034 సీట్లతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో బీపీఓ, ఐటీ అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు గత నెలలో ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. తొమ్మిదో విడత బిడ్డింగ్ అనంతరం మరో 24 నూతన యూనిట్లు వివిద నగరాల్లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. 1.5 లక్షల మందికి ఉపాధి సమకూర్చాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం బీపీఓ ప్రోత్సాహక పధకాన్ని డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పధకంలో యూనిట్లను నెలకొల్పే సంస్ధలకు నష్టం వాటిల్లకుండా ఒక్కో ఉద్యోగానికి రూ లక్ష వరకూ వయబిలిటీ గాయప్ ఫండింగ్ రూపంలో ప్రభుత్వం అందచేస్తోంది. దీనికోసం రూ 493 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు మరో 300 కోట్లతో ఈ పధకాన్ని మూడేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కుటుంబ బాధ్యతల దృష్ట్యా పూర్తిస్ధాయి ఉద్యోగాలు చేయడం కుదరని మహిళలకు చక్కని అవకాశమని, ఈ వెసులుబాటు ద్వారా మరో లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
బీపీవో ఉద్యోగాలకు ఓయూలో ఉచిత శిక్షణ
హైదరాబాద్ : నిరుద్యోగ అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ, లిటరసీ హౌస్‌లో బీపీవో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు హౌస్ కార్యదర్శి బి. నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులకు బీపీవో వాయిస్, నాన్ వాయిస్ కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు ఎన్సీవీటీ సర్టిఫికెట్‌ను అందజేస్తామని చెప్పారు. పూర్తి వివరాలు 93978 24542 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.