ఆయన చేసిన తప్పు వల్ల.. నేను ఎంట్రీ ఇచ్చాను: శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తోన్న పెదకాపు ట్రైలర్ తాజాగా రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రస్టిక్గాకంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ సాగింది. కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,నారప్ప లాంటి చిత్రాలతో మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. చాలా రోజుల తర్వాత పెదకాపు 1 సినిమాతో వస్తున్నాడు. కొత్త హీరో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
పెదకాపు సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎంతో ఆసక్తిని పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రాజకీయాలు, పార్టీగొడవల్ని ట్రైలర్లో చూపించారు. ఊరి పెద్దల్ని ఎదురించి హీరో విరాట్ కర్ణ పోరాడే సీన్స్ మెప్పిస్తాయి. ఇందులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా నటుడిగా విలన్ పాత్రలో కనిపించి తెలుగు ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్న శ్రీకాంత్ మరో వైపు నటుడిగా కూడా ఓ టర్నింగ్ తీసుకోబోతున్నాడు. ఈ సినిమాకు నటుడుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఇలా చెప్పాడు.
నేను ఆ పాత్ర కోసం ముందుగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ను ఫైనల్ చేశాను. ఆయన కూడా ఆ రోల్లో నటించేందుకు అంగీకరించారు. తీరా షూటింగ్ స్పాట్‌కు వచ్చి చూస్తే ఏమైందో తెలియదు కానీ ఆయన షూట్‌కు రాలేదు. అప్పటికప్పుడు ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏర్పాటు చేయడం కష్టం. మరోవైపు చాలా మంది ఆర్టిస్టులతో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. అప్పుడు నా అసోసియేట్ కిషోరే ఆ కేరెక్టర్చేయమని నన్ను ఒప్పించాడు.' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఆ టైమ్‌లో ఆర్టిస్ట్ లేకపోవడంతో బలవంతంగా చేసినవే.. అందులో తన ప్రమేయం లేదని ఆయన వివరణ ఇచ్చాడు.