brain dead person
-
చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. తొలి అవయవదానం ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్ని సక్సెక్స్ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు. ప్రమాదం లేదు హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది. జీవన్‌దాన్ ట్రస్ట్ అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్‌దాన్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్‌డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్‌కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్‌దాన్ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. సర్కారు దవాఖానాలు భేష్ కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. బ్రెయిన్ డెడ్ మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్ డెడ్‌గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్డెడ్గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. - సాక్షి, వెబ్‌డెస్క్ -
పదమూడేళ్ల బాలుడు.. 7 గురికి కొత్త జీవితం ఇచ్చాడు..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని బాలుడు తన మరణంలోనూ మరో ఏడుగురికి జీవితాన్ని ఇచ్చాడు. చిన్నతనంలోనే అవయవ దానంపై ఆలోచనలు కలిగిన ఆయన మరణంలోనూ తన లక్ష్యాన్ని వదలలేదు. వివరాల్లోకి వెళ్లే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన డాక్టర్ భానుప్రసాద్ – సీత దంపతులు సామాజిక, అన్యాయాలకు గురైన బిడ్డలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తూ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ఇలా పది మంది పిల్లలు ఉండగా, వీరిలో నాలుగో బాలుడు సిద్దూ. ఆరో తరగతి చదివే ఆయన ఈనెల 14న తీవ్ర జ్వరం రావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 19వ తేదీన హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సిద్ధూ కోరిక మేరకు గురువారం ఆయన శరీరంలో పనికొచ్చే అవయవాలను భానుప్రసాద్ దంపతులు అందజేసి ఉదారత చాటుకున్నారు. కాగా, ఆస్పత్రి వైద్యులు సిద్దూ నేత్రాలు, కిడ్నీలు, లివర్, ప్రాంకియాస్ అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమర్చనుండడంతో ఏడుగురికి ప్రాణభిక్ష పెట్టినట్లయింది. -
మరణించి.. నలుగురిలో జీవించి..
అచ్యుతాపురం/అక్కిరెడ్డిపాలెం : మృత్యువు ఒడి చేరుతూ ఆ యువకుడు మరికొందరికి జీవం పోశాడు. కన్నకొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడు గ్రామానికి చెందిన కట్టమూరి సన్యాసినాయుడు అలియాస్ వాసు (21) అవయవాలు గుండె, ఊపిరితిత్తులను గురువారం సికింద్రాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి విమానంలో తరలించారు. వీటిని 67 ఏళ్ల వ్యక్తికి అవయవ మార్పిడి చేయనున్నట్లు విశాఖలోని ఐకాన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వాసు ఈనెల 5న నల్లమారమ్మ గుడి వద్ద ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విశాఖలోని ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బతికే అవకాశం లేనందువల్ల అవయవాలను దానంచేస్తే మరికొందరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని అక్కడి వైద్యులు వాసు తల్లిదండ్రులు సత్యవతి, సత్యారావులకు తెలిపారు. కుమారుడు చనిపోయాడన్న బాధను దిగమింగుకుని అవయవ దానానికి వారు ముందుకొచ్చారు. గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు, తదితర భాగాలను తొలగించి వాసు భౌతికదేహాన్ని వైద్యులు గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వాసు ఎస్ఈజెడ్లోని పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తన చెల్లికి ఇటీవలే పెళ్లి చేశాడు. అవయవాలు దానం చేసి ఔదార్యం చాటుకున్న వాసు తల్లిదండ్రులను గ్రామస్తులు కొనియాడారు. -
బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు మాయం!
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఓ ప్రముఖ ఆస్పత్రి అవయవాలను సేకరించిన వ్యవహారం విశాఖలో వివాదాస్పదంగా మారుతోంది. ఒడిశాకు చెందిన మృతుడి తల్లిదండ్రులు, బంధువులను మభ్యపెట్టి అవయవాలను తీసుకున్నట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. డబ్బులు లేవనడంతో.. 2016 డిసెంబరు 13న ఒడిశాలోని గంజాం జిల్లా జాగాపూర్ గ్రామానికి చెందిన కడియాల సహదేవ్ (32) ఇచ్ఛాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం బాధితుడిని విశాఖలోని ఓ ఆసుపత్రికి బంధువులు తెచ్చారు. ఐదు రోజుల పాటు వైద్యం అందించిన అనంతరం బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. నిరుపేదలమైన తాము వైద్య చికిత్స వ్యయాన్ని చెల్లించలేమని బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు పేర్కొనడంతో అవయవాలు దానం చేస్తే డబ్బులు కట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అనంతరం వారి నుంచి సంతకాలు తీసుకుని బ్రెయిన్ డెడ్ అయిన సహదేవ్ నుంచి కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలను సేకరించారు. అనుమతి తీసుకున్నాకే సర్జరీ చేశాం.. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యం ప్రతినిధి మోహన్ మహరాజ్‌ను వివరణ కోరగా ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉందని, నోటో(నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్) యాక్ట్ ప్రకారం, జీవన్‌దాన్ అనుమతితో అన్ని నియమాలు అనుసరించి ఈ సర్జరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘అన్నిటికీ మృతుడి తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాం. గర్భిణి కావడంతో మృతుడి భార్య రాలేదని చెప్పారు. మృతుడి అవయవాలను జీవన్‌దాన్ అలాట్మెంట్ ప్రకారం వేరే ఆసుపత్రికి తరలించాం. కార్నియాని మోసిన్ ఐ బ్యాంక్ మృతుడి తల్లిదండ్రుల అంగీకారంతో తీసుకుంది. పోలీస్ అనుమతి, ఫోరెన్సిక్ ఇంటిమేషన్, పంచనామా, పోస్టుమార్టం అన్నీ జరిగాయి’ అని చెప్పారు. బీమాకు దరఖాస్తుతో షాక్.. ప్రమాదం జరిగిన సమయంలో గర్భిణిగా ఉన్న బాధితుడి భార్య లక్ష్మీయమ్మ ఆసుపత్రికి రాలేదు. భర్త అంత్యక్రియల అనంతరం బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సహదేవ్ మృతదేహంలో అవయవాలు లేవని బీమా సంస్థ పేర్కొనడంతో నివ్వెరపోయిన ఆమె జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్ ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యంపై ఏపీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోరాడ రామారావు తెలిపారు. -
అమ్మను మించి దైవమున్నదా..
-
ఆమె మరణం... ఐదుగురికి పునర్జననం..!
మరణించిన మనిషికి ‘పునర్జన్మ’ ఉంటుందా...? మరణానంతర ‘జీవితం’ సాధ్యమేనా..? ‘ఉంటుంది... సాధ్యమే..’నని సమాధానమిచ్చింది 14 ఏళ్ల ఓ అమ్మాయి...! తాను చనిపోయింది...!! కాద్కాదు... మరో ఐదుగురి రూపంలో ‘జీవిస్తోంది’...!!! కొత్తగూడెంరూరల్: చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలోని ఆ అమ్మాయి పేరు అవులూరి అభినయ. ఆమె తండ్రి అవులూరి శ్రీనివాస్. కొత్తగూడెంలో సీనియర్ జర్నలిస్ట్. ఆయన గత ఏడాది మార్చి 1న, తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. ఆ విషాదం నుంచి ఆయన కుటుంబం ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే, ఆయన ముద్దుల కూతురైన అభినయ(14)కు అనారోగ్యం. కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న ఈమెకు వారం కిందట అనారోగ్యం సోకింది. హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్పించారు. వారి నెత్తిపై ‘పిడుగు’ పడింది... పిడుగులాంటి వార్తను వినాల్సొచ్చింది. అభినయ ‘లేదు’... ఇక ‘లేవదు’. ఆమె ‘బ్రెయిన్ డెడ్’ అయినట్టుగా వైద్యులు బుధవారం నిర్థారించారు. ఆమె కళ్లు బాగానే ఉంటాయి... కానీ, తెరుచుకోవు. మూత్ర పిండాలు బాగానే ఉంటాయి... కానీ, ‘పని’ చేయవు. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ, ‘పరిమితు’లుంటాయి. ఆమె శరీరంలోని ప్రధాన అవయవాలను పని చేయించే కీలకమైన మెదడు (బ్రెయిన్) మాత్రం పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది... ‘చనిపోయింది’. ఈ స్థితిలో, ఆమెలోని కొన్ని అవయవాలు (కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం) కొన్ని రోజులపాటు మాత్రమే పనిచేస్తాయి. ఇదే విషయాన్ని ఆమె కుటుంబీకులకు అక్కడి వైద్యులు తెలిపారు. ‘‘ఈ స్థితిలోనే ఆమెకు ‘పునర్జన్మ’ ఇవ్వగలం. ఆమెను మరొకరి రూపంలో ‘బతికించగలం’. ఇందుకు చేయాల్సిందల్లా... ఆమె అవయవాలను దానం చేయడమే’’నని ఆ వైద్యులు సావధానంగా వివరించారు. దీనికి, అభినయ తల్లి కవిత, సోదరుడు వెంకట్ వరుణ్ అంగీకరించారు. ఆ తరువాత, అభినయ శరీరం నుంచి కళ్లు.. గుండె.. కాలేయం.. మూత్రపిండాలను వైద్యులు వేరు చేశారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న, ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఐదుగురికి అమర్చేందుకుగాను వాటిని తరలించారు. ఆ ఐదుగురి రూపంలో అభినయ మళ్లీ బతికింది...! ఇకపై, ఆమె కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆమె గుండె కొట్టుకుంటుంది... ఇంకొకరి శరీరంలో. ఆమె కాలేయం పనిచేస్తుంది... మరొకరి శరీరంలో. ఆమె మూత్రపిండాలు పనిచేస్తాయి... వేరొకరి శరీరంలో. మరణం... జననం... ఆమె చనిపోయింది. కానీ, కొన్ని గంటల వ్యవధిలోనే... ఆ ఐదుగురి రూపంలో ‘పునర్జన్మ’ అందుకుంది. ఆమెకు, ఆమె తల్లి కవితకు, సోదరుడు వెంకట్ వరుణ్‌కు ఆ ఐదుగురు... చేతులెత్తి నమస్కరిస్తారు...! నిరంతరం స్మరిస్తారు...!! తుది శ్వాస వరకు...!!! -
మృత్యుంజయుడు!
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన నందిగామ పట్టణానికి చెందిన జగదీష్ అనే యువకుడు అవయవ దానం ద్వారా పలువురికి ప్రాణ దాత అయ్యాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారిన కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదిస్తూనే... తనలా మరి కొంత మంది కడుపు కోతతో బాధపడకూడదనే లక్ష్యంతో జగదీష్ అవయవాలు దానం చేసేందుకు తల్లి ఒప్పుకుంది. కృష్ణాజిల్లా, నందిగామ : పది మంది మేలు కోరేవాడు... పది మందికి మంచి చేసేవాడు మహాత్ముడైతే... తను చనిపోతూ.. పదిమందికి ప్రాణ దానం చేసేవాడు దేవుడే. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన నందిగామ పట్టణానికి చెందిన ఓ యువకుడు అవయవ దానంతో పలువురికి ప్రాణ దాత అయ్యాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడాన్ని చూసి గుండెలవిసేలా రోది స్తూనే... తనలా మరి కొంత మంది కడుపు కోతతో బాధపడకూడదన్న లక్ష్యంతో దుఃఖాన్ని దిగమింగుకొని తన బిడ్డ అవయ దానానికి అంగీకరించిన ఆ మాతృమూర్తి త్యాగం వేనోళ్ల కీర్తించదగిం ది. మూడేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన ఆమెకు తానున్నానంటూ ధైర్యం చెప్పి, కుటుంబ భారా న్ని తన భుజ స్కంథాలపై మోస్తూ, కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కుమారుడిపై విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో విగత జీవిని చేసింది. తనవృత్తి, తన ఇల్లు తప్ప బయటి ప్రపంచం గురిం చి ఏమీ తెలియని ఆ యువకుడు ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు... ఒక్క ముక్కలో చెప్పాలంటే, అతని అవయవాల ద్వారా పునర్జన్మ పొందిన వారికి దేవుడయ్యాడు. ఈ అమ్మకు శోకం...ఆ తల్లులకు ఆనందం! నందిగామ పట్టణానికి చెందిన పింగళి జగదీష్ (22) నందిగామ పట్టణంలోని ఓ ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసేవాడు. నిరుపేద కుటుంబం కావడంతో అతి తక్కువ వయస్సు నుంచే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేసే జగదీష్ తండ్రి నాగశేషు మూడేళ్ల క్రితం గుండెపోటుతో కన్ను మూశాడు. దీంతో జగదీష్ బాధ్యతలు మరింత పెరిగాయి. ఉన్నంతలో తల్లిని సంతో షంగా చూసుకునేవాడు. అంతా సవ్యంగా సాగి పోతుందనుకున్న సమయంలో విధి వారిపై పగబట్టింది. విధి నిర్వహణలో భాగంగా ఇబ్రహీంపట్నం వెళ్లి వస్తూ, ఈ నెల 1న కంచికచర్ల మం డల పరిధిలోని పరిటాల వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయవాడ మణిపాల్ హాస్పటల్లో చేర్పించగా, బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో ఆ తల్లి గుండె ఒక్కసారిగా తల్లడిల్లిపోయిం ది. అయితే, అంత దుఃఖం, బాధలోనూ, సన్ని హితులు ఇచ్చిన సలహాతో తన బాధను దిగమింగుకుంటూ, తన బిడ్డ మరి కొందరు రూపంలో జీవించే ఉంటాడన్న ఆలోచనతోపాటు తన లాంటి కొందరు మాతృమూర్తుల గర్భశోకాన్ని తీర్చగలుగుతానన్న సంతృప్తితో జగదీష్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించింది. దీంతో శుక్రవారం జగదీష్ అవయవాలను మణిపాల్ ఆస్పత్రి నుంచే పలువురికి అమర్చేందుకు తరలించారు. -
అమరజీవి విజయభాస్కర్
యువకుడి బ్రెయిన్ డెత్ అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు ఆరుమందికి కొత్తజీవితం నెల్లూరు రూరల్ : ఓ యువకుడు మరణించినా, అతడి అవయవాలతో ఆరుగురి జీవితాలకు వెలుగును ప్రసాదించిన సంఘటన నెల్లూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. నగరంలోని వెంకటేశ్వరపురంలో నివాసముంటున్న డక్కా విజయభాస్కర్(37) నాలుగు రోజుల క్రితం కళ్లు తిరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు పరీక్షలు చేసి మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. దీంతో అక్కడి నుంచి వారు సింహపురి ఆసుపత్రికి తీసుకెళ్లి సోమవారం ఆపరేషన్ చేయించారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడి డాక్టర్లు విజయభాస్కర్ బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బంధుమిత్రుల సలహా మేరకు పుట్టెడు బాధను గుండెల్లో దాచుకుని తన బిడ్డ అవయవాలను దానం చేసేందుకు తండ్రి రమణయ్య నిర్ణయించుకున్నాడు. వెంటనే బంధువుల సహకారంతో నారాయణ ఆస్పత్రికి తరలించాడు. తమ బిడ్డ మరణించినప్పటికీ మరో ఆరుమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరాడు. దీంతో నారాయణ ఆస్పత్రివారు జీవన్ దాన్ ట్రస్టును సంప్రదించి అవయవదానానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. వైజాగ్ కేర్ ఆస్పత్రికి లివర్, చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి గుండె, ఊపిరితిత్తులును ప్రత్యేక ఆంబులెన్స్‌లో తరలించారు. చెన్నై నుంచి వైజాగ్‌కు విమానంలో లివర్‌ను తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో చెన్నై వరకు ట్రాఫిక్ లేకుండా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. నేత్రాలను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రికి తరలించారు. -
విశాఖలో మరో అవయవదానం!
-
మా తమ్ముడు సజీవం
-
వెలుగులు నింపిన అవయవ దానం!
సాక్షి, విజయవాడ /మంగళగిరి/చెన్నై/హైదరాబాద్: బ్రెయిన్‌డెడ్ కు గురైన ఓ వ్యక్తి అవయవాలు నలుగురికి పునర్జన్మ ప్రసాదించాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, కళ్లు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆయన కుటుంబీకులు! హుటాహుటిన గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి ఊపిరితిత్తులు, గుండెను చెన్నైకి తరలించారు. హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి కాలేయాన్ని, గుంటూరులోని ఓ ఆసుపత్రికి కిడ్నీలను వేగంగా చేరవేశారు. తన తమ్ముడి అవయవాలను ఇతరులకు అమర్చి వారిలో అతన్ని చూడాలని ఓ అక్క పడిన తపనే అభాగ్యుల బతుకుల్లో వెలుగు నింపింది! విజయవాడలో ఈ నెల 3న సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తోట మణికంఠ(21) మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే మెట్రో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఇదే ఆసుపత్రిలో ఆయన అక్క తోట జ్యోతి నర్సుగా పనిచేస్తోంది. ైవె ద్యులు వెంటనే ఆపరేషన్ చేశారు. తలకు బలమైన గాయం అయినందున బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో జ్యోతి.. డాక్టర్ శ్రీనివాస్ ద్వారా హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజును సంప్రదించింది. జీవన్‌దాన్ పథకం ద్వారా తమ్ముడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనంతరం మణికంఠను మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి 25 మంది వైద్యుల బృందం శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4.35 గంటల వరకు ఆపరేషన్ చేశారు. శరీరం నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వేరు చేశారు. ఆసుపత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి అవయవాలను తరలించేందుకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న విజయవాడవాసులు రహదారికి ఇరువైపులు నిలుచొని అంబులెన్స్‌పై పూల వర్షం కురిపించారు. ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి ఉన్న 33.8 కి.మీ దూరాన్ని అంబులెన్స్ 27 నిమిషాల్లో చేరుకుంది. అక్కడ్నుంచి విమానంలో మణికంఠ గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని ఫోర్షియో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అమర్చేందుకు తరలించారు. మణికంఠ ఒక కిడ్నీని ఎన్నారై ఆసుపత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీని గుంటూరు సిటీ ఆసుపత్రిలో మరో రోగికి దానం చేశారు. కాలేయాన్ని హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి విజయవంతంగా అమర్చారు. ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యం జ్యోతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. వారిలో నా తమ్ముడు బతికుండాలనుకున్నా: జ్యోతి ‘‘నా తమ్ముడి అవయవాలు దానం చేయాలనుకున్నా. వెంటనే మా అమ్మకు చెప్పా. మెట్రో ఆస్పత్రి న్యూరో సర్జన్ శ్రీనివాసరావు సాయం తో జీవన్‌దాన్ గురించి తెలుసుకున్నా. అరగంటలో వైద్యులు ఆస్పత్రికి వచ్చారు. ఆపరేషన్ చేసి తమ్ముడి అవయవాలు తీశారు. నాలుగు సంవత్సరాల క్రితం మా నాన్న చనిపోయారు. అమ్మ రాధ కూలి పనులు చేస్తుంటుంది. అవయవాలు అమర్చిన వారిలో నా తమ్ముడు బతికుండాలన్నదే నా అభిలాష’’