ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
ఏలూరు అర్బన్ : నగరంలోని ఒక ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.ఆరు లక్షల విలువైన బంగారు నగలు, నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హరిశ్రీ వెంకటరామ్మూర్తి అనే ప్రయివేటు ఉద్యోగి స్థానిక ఆర్ఎంఎస్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో కింది భాగంలో నివసిస్తుండగా, పై అంతస్తులో భాగంలో మామగారి కుటుంబం ఉంటోంది. మామగారి ఆరోగ్యం బాగోలేకపోవడంతో శుక్రవారం రాత్రి పై అంతస్తుకు తాళం వేసి కింద పోర్ష¯Œæలో నిద్రించారు. తెల్లవారి పైకి వెళ్లే సరికి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో దాచుకున్న సుమారు 26 కాసుల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు అపహరణకు గురయ్యాయని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, వన్‌టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, త్రీటౌన్ ఎస్సై ఎం.సాగర్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు పై భాగం వెనుక తలుపుల తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.