BRGF funds
-
Harish Rao: బీఆర్జీఎఫ్ నిధులివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి బీఆర్జీఎఫ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. జీఎస్టీ సమావేశంలో పాల్గొనడానికి లక్నో వెళ్లిన హరీశ్.. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులు సమావేశం విరామ సమయంలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తిచేశారు. మంత్రి సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేస్తామని హామీఇచ్చారు. కాగా, సమావేశంలో కేంద్ర రెవెన్యూశాఖ సంయుక్త కార్యదర్శి ఇచ్చిన సవివర ప్రజెంటేషన్‌లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గ్యాప్ స్వల్పమేనని పేర్కొన్నారు. పత్తిపైనున్న రివర్స్ చార్జి మెకానిజాన్ని రద్దు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీశ్ డిమాండ్ చేశారు. చదవండి: AP: ఏపీ హైకోర్టు కొత్త సీజేగా ప్రశాంత్‌కుమార్ మిశ్రా? -
అయ్యో గిట్లాయె..!
సాక్షి, వరంగల్ : పరిషత్‌ల్లో పైసలు లేక ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదవీ ప్రమాణస్వీకారం చేసి 45 రోజులవుతున్నా ఇంతవరకూ చిల్లగవ్వ కూడా రాకపోవడంతో ఏదైనా అభివృద్ధి పనులు చేపడుతామన్నా చేతిలో డబ్బులు లేకపోవడంతో గ్రామాల్లో పర్యటించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పరిషత్ పాలకవర్గాలకు నుంచి 45 రోజులు దాటింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిధులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎంపీటీసీ సభ్యులు అయోమయంలో ఉన్నారు. అయ్యో గిట్లాఝెను.. అని చర్చించుకుంటున్నారు. నిధులు కేటాయింపు లేక పాలకవర్గాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో 16 మండల పరిషత్‌లు ఉన్నాయి. 178 ఎంపీటీసీలు ఉన్నారు. ఇటీవల నూతన పురపాలక చట్టం ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఆదాయాలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నిధులు సమకూర్చే బాధ్యత ఉందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం కేటాయించే మొత్తానికి తాము సమానంగా ఇవ్వనున్నటుŠల్ వెల్లడించారు. పల్లె మునిసిపాలిటీలను పట్టించుకున్న మాధిరిగానే మండల జిల్లా పరిషత్‌లపై దృష్టి సారిస్తే వాటికి పూర్వవైభవం రానుంది. మూడేళ్లుగా అందని నిధులు గతంలో కేంద్రం బీఆర్జీఎఫ్ పేరిట ప్రత్యేక నిధులు కేటాయించేవారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణాళిక సంఘం స్థానంలో తీసుకొచ్చిన నీతి అయోగ్ చేసిన సిఫార్సులతో రద్దు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏడాదిలో రెండుసార్లు మంజూరవుతాయి. మండలాలకు బట్టి రూ 50 వేల నుంచి రూ 2 లక్షల మేర కేటాయిస్తారు. గత మూడేళ్లుగా జాడలేదు. మండల పరిషత్‌లకు కేటాయించే సీనరేజ్ చార్జీలు మొత్తాన్ని సంబంధిత శాఖ నేరుగా పంచాయతీలు కేటాయిస్తున్నాయి. దీంతో మొత్తం కేటాయింపులు లేకుండా పోయాయి. గతంలోఅరకొర నిధులే.. గతంలో వచ్చింది అరకొరే. గత ఐదేళ్లలో అరకొర నిధులు మంజూరయ్యాయి. మండలం జనాభా తలసరి ఆదాయాన్ని అనుసరించి మండల పరిషత్‌లకు ప్రభుత్వం నుంచి మూడు నెలలకు ఒకసారి ఏడాదిలో నాలుగు సార్లు నిధులు మంజూరవుతుంటాయి. గత మూడేళ్లుగా మండల పరిషత్‌లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ సారైనా నిధులు ఏమైనా కేటాయిస్తారోనని ఎంపీటీసీలు ఎదురుచూస్తున్నారు. నిలిచిన ఇంటర్నెట్ సేవలు జిల్లాలో మండల పరిషత్‌ల్లో డబ్బులు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కార్యాలయల్లో పేపర్, ప్రింటింగ్లు, ఇతర అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దామెర, నడికూడ రెండు కొత్తగా మండల పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. వాటి పరిస్థితి ఇంకా అద్వానంగా ఉంది. పరిషత్‌లకు నిధులు లేకపోవడంతో అధికారులు తమ దగ్గర డబ్బులు ప్రస్తుతానికి పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించిన తరువాత బిల్లులు పెట్టి తీసకుంటామని అంటున్నారు. భారం కూడా మోసేవరకు మోస్తాం తరువాత మా వల్ల కాదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బీఆర్జీఎఫ్ పనుల్లో పర్సంటేజీల పర్వం
ఖమ్మం కలెక్టరేట్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్జీఎఫ్)తో చేపట్టే పనుల్లో పర్సంటేజీల పర్వం కొనసాగుతోంది. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అవసరమైనవి కాకుండా తమకు పర్సంటేజీలు ఎక్కువగా వచ్చే పనులనే ప్రతిపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కు గాను విడుదల చేసిన ఈ నిధులలో 30 శాతం మేర ఇలాంటి పనులనే ప్రతిపాదించారని విమర్శలు వస్తున్నాయి. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఈ పనులపై ప్రతిపాదనలు చేసే అవకాశం లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్‌లు, మండలస్థాయి అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని సమాచారం. గ్రామసభల్లో తీర్మానాలు లేకుండానే అనేక పనులను ప్రతిపాదించినట్లు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాకు రూ.33.42 కోట్లు కేటాయించింది. ఇందులో మున్సిపాలిటీలకు రూ.7,02,74 వేలు, స్థానిక సంస్థలకు రూ.26,39,26 వేలుగా నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30 శాతం, జిల్లా పరిషత్‌కు 20 శాతం కేటాయించారు. ఈ నిధులను తాగునీరు, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, శానిటేషన్, పాఠశాల విద్య, వైద్య, ఆరోగ్య, విద్యుత్ తదితర అవసరాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిలో జిల్లా వ్యాప్తంగా 758 పంచాయతీలకు రూ.13 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.7 కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.5 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి, డీపీసీ (జిల్లా ప్రణాళికా సంఘం) ఆమోదానికి పంపించారు. గ్రామసభలు లేకుండానే తీర్మానాలు.. గ్రామాల్లో ఆయా అవసరాలను బట్టి ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేపట్టాల్సిన పనులపై గ్రామ సభలో తీర్మానం చేసి, ఆ ప్రతిపాదనలను ఎంపీడీవోలకు పంపాలనే నిబంధన ఉంది. వారు దాన్ని జిల్లా పరిషత్‌లకు అందజేస్తారు. అయితే కొన్నిచోట్ల గ్రామసభల తీర్మానం లేకుండానే సర్పంచ్ల సంతకాలతో పనులకు ప్రతిపాదనలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామసభల్లో తీర్మానం లేకపోవడంతో ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కావడం లేదని, నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. పర్సంటేజీలు ఉంటేనే పని... మరికొన్ని గ్రామాల్లో పనులకు సర్పంచ్‌లు ప్రతిపాదించినప్పటికీ మండల, జిల్లా పరిషత్ వాటాలో మండల పరిషత్ అధికారులే తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని పలువురు ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఒక్కో పనికి 10 నుంచి 20 శాతం వరకు ఒప్పందాలు కుదుర్చుకుని ప్రతిపాదనలు చేశారని విమర్శిస్తున్నారు. కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అత్యధిక పర్సంటేజీలు వచ్చే పనులకే ప్రతిపాదనలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా ప్రజాప్రతినిధుల్లో నిరుత్సాహం.. నూతనంగా ఎంపికైన ప్రజా ప్రతినిధుల్లో నిరుత్సాహం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడి నెలన్నర దాటినా జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. వారికి అధికారిక హోదా లేకపోవడంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతోంది. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసే వీలు లేదు. తాజాగా బీఆర్జీఎఫ్ నిధుల కేటాయింపులో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీల జోక్యం లేకపోవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. డీపీసీ జరిగేనా... డీపీసీ (జిల్లా ప్రణాళిక సంఘం) సమావేశంపై నీలినీడలు అలముకున్నాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో డీపీసీ సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీటీసీలు హాజరయ్యే అవకాశం లేదు. అయితే జిల్లాలోని శాసనసభ్యులు, ఎంపీలతో డీపీసీ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ప్రతిపాదనలు గ్రామాల్లో నోటీసు బోర్డులో ఉంచిన తర్వాతనే ప్రభుత్వ ఆమోదానికి పంపాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
నిలిచిన నిధులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో జరగకపోవడంతో జిల్లాకు రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు నిలిచాయి. జి ల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో ప్రత్యేక అధికారుల పాలన మూడేళ్లుగా కొనసాగుతోంది. దీంతో స్థానిక పాలన ప్రత్యేకాధికారులతో కొనసాగడం వల్ల అభివృద్ధి పడకేసింది. పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి పథకాలు నిలిచాయి. స్థానిక సంస్థలకు కేంద్రం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు బీఆర్జీఎఫ్ కింద జిల్లాలోని స్థానిక సంస్థలకు విడుదల చేసేది. ప్రత్యేకాధికారుల పాలన ఉండటంతో రావాల్సిన అభివృద్ధి నిధులు నిలిచాయి. 2006లో మండల, జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగగా, జూలై 2011నాటికి పదవీకాలం ముగిసింది. అయితే మహానేత వైఎస్సార్ మరణంతో రాష్ట్ర రాజకీయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.అయితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నికలు నిర్వహించని ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిలిచిన కేంద్రం నిధులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం ఏటా స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తోంది. దాదాపు మూడేళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.36.65 కోట్లు నిలిచాయి. ఈ నేపథ్యంలోనే పది నెలల క్రితం సుప్రీంకోర్టు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో 2013 ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మిగతా జెడ్పీ, మండల, మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా వేసింది. దీంతో 2011-12 ప్రథమార్థంలో పాలకవర్గాలు ఉన్నప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2012-13 సంవత్సరానికి పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపాలిటీలకు 1,986 పనుల కింద బీఆర్జీఎఫ్ నిధులు రూ.29.88 కోట్లు మంజూరు చేసింది. అదే ఏడాది ఆఖరులో మొదటి వాయిదాగా రూ.18.57 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.11.31 కోట్లు విడుదల చేయలేదు. 2013-14 సంవత్సరానికి పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపాలిటీలకు 1,852 పనులకు రూ.25.34 కోట్లు అక్టోబర్‌లో మంజూరు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ఇప్పటి వరకు ఈ నిధులు విడుదలకు నోచుకోలేదు. ఫలితంగా చేపట్టాల్సిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 2012-13కు రూ.11.31 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, 2013-14కు రూ. 25.34 కోట్లు కలిపి జిల్లాకు మొత్తం రూ.36.65 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నిధుల వినియోగం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్జీఎఫ్ నిధులు ప్రభుత్వం ఏటా విడుదల చేస్తోంది. ఎస్సీ, ఎ స్టీ జనాభా ప్రతిపాదన ఈ నిధులు విడుదల అవుతా యి. ఇందులో కేంద్రం వాటా 80 శాతం, రాష్ట్ర వాటా 20 శాతంగా ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించాలి. చెడిపోయిన పై ప్లైన్లను సరిచేయడం, రోడ్డు ఉండి కల్వర్టు లేనిచోట కల్వర్టుల నిర్మాణాలు చేపట్టడం, ట్రాన్స్పోర్ట్, తాగునీటి సౌకర్యాలకు, మార్కెట్ యార్డులకు, గ్రామాల్లో విద్యుదీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అంగన్వాడీ భవన నిర్మాణాలకు ఈ నిధులు వినియోగిస్తారు. నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి నిలిచింది.