bribe accounts
-
లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ..
జగిత్యాల: మెట్పల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్ఐ తిరుపతితోపాటు అతడి సహాయకుడు ప్రవీణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటన వివరాలను ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ వీవీ.రమణమూర్తి వెల్లడించారు. మండలంలోని మేడిపల్లికి చెందిన బద్దం శంకర్‌కు గ్రామ శివారులోని సర్వే నంబర్ 797/ఉ/1లో తన భార్య లక్ష్మి పేరిట ఏడు గుంటల భూమి ఉంది. దీనిని నాలా కన్వర్షన్ కోసం గత నెల 22న స్లాట్ బుకింగ్ చేసుకున్నాడు. ఆర్ఐ తిరుపతిని కలువగా.. రూ.25వేల లంచం కావాలని, లేకుంటే పని కాదని తేల్చి చెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని, రూ.15వేలు ఇస్తానని శంకర్ వేడుకున్నాడు. దీనికి ఆర్ఐ అంగీకరించాడు. ఈ క్రమంలో శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్ఐని ఫోన్లో సంప్రదించగా.. తన సహాయకుడు ప్రవీణ్‌కు ఆ మొత్తాన్ని ఇవ్వాలని చెప్పాడు. దీంతో కార్యాలయానికి వెళ్లిన శంకర్ డబ్బులను ప్రవీణ్‌కు అందజేస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న అధికారులు ప్రవీణ్‌తోపాటు ఆర్ఐ తిరుపతిని పట్టుకున్నారు. పంచనామా నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. ఏసీబీ దాడి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోగా.. అక్కడ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. సమాచారం తెలపడానికి, ఫొటోలు తీసుకునేందుకూ అంగీకరించలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు అధికారులు కార్యాలయం బయటకు వచ్చి నామమాత్రంగా వివరాలు వెల్లడించి వెళ్లిపోయారు. -
లంచాల కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లు!
చైనాలో అధికారులు తెలివి మీరిపోయారు. లంచాలు తీసుకోడానికి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారు. అయితే అవినీతి నిర్మూలన చర్యలలో భాగంగా చైనా ప్రభుత్వం వాటన్నింటినీ మూసేసి, వేలాది మంది అధికారులను శిక్షించింది. ఆర్థికంగా చాలా బలోపేతమైన గువాంగ్ డాంగ్ రాష్ట్రంలో ఈ తరహా వ్యవహారం సాగింది. బహుమతుల రూపంలో గానీ, గిఫ్టు కార్డుల రూపంలో గానీ, మరే రూపంలోనైనా సరే లంచాలు తీసుకోవద్దని అధికారులకు ప్రొవిన్షియల్ డిసిప్లైన్ ఇన్స్పెక్షన్ కమిటీ తెలిపింది. అయితే చాలా మంది అధికారులు గిఫ్టుకార్డులు తీసుకోవచ్చని భావిస్తున్నారని, అలాగే లంచాల కోసం ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేవారని.. అలా తీసుకున్న మొత్తాలను ఇచ్చినవాళ్లకే తిరిగి ఇచ్చేయాలని అధికారులు చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఇలా లంచాల అకౌంట్ల మూసివేత కార్యక్రమం కొనసాగుతోంది. 2013 సంవత్సరం నుంచే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అప్పటినుంచి వేలాదిమంది లంచగొండి అధికారులను శిక్షించారు. ఒకవేళ తప్పనిసరిగా లంచం తీసుకోవాల్సి వచ్చినా, ఆ మొత్తాన్ని డిసిప్లైన్ ఇన్స్పెక్షన్ కమిటీకి తిరిగి ఇచ్చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కేంద్ర కమిటీ తెలిపింది.