Bricks seminar
-
ద్వైపాక్షిక సహకారానికి ఊతం!
-
ద్వైపాక్షిక సహకారానికి ఊతం!
భారత్, బ్రెజిల్‌ల నిర్ణయం బ్రెజిల్ ప్రెసిడెంట్, భారత్ పీఎంల తొలి భేటీ నరేంద్ర మోడీకి ఘన స్వాగతం బ్రసీలియా/ఫోర్టెలెజా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్, బ్రెజిల్ దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో సహకారాన్ని విసృ్తతం చేసుకోవాలని.. వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, రక్షణ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ల మధ్య బుధవారం తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. వీరి సమక్షంలో పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారం, దౌత్య వ్యవహారాల్లో సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటు.. ఈ మూడింటికి సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్ష భవనంలో భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ పర్యటన కోసమే ప్రత్యేకంగా రానప్పటికీ.. అధ్యక్ష భవనంలో మోడీకి పూర్తి సైనిక మర్యాదలతో స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి 70వ వార్షికోత్సవాలు జరిగే 2015 నాటికి భద్రతామండలిలో సంస్కరణలను వేగవంతం చేయాలని జీ 4 కూటమి నేతలుగా మోడీ, రౌసెఫ్‌లు డిమాండ్ చేశారు. జీ 20 సహా అన్ని అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సును, సాకర్ వరల్డ్ కప్ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించిన బ్రెజిల్‌ను ఈ సందర్భంగా మోడీ ప్రశంసించారు. ఆరో బ్రిక్స్ సదస్సు చరిత్రాత్మకమైనదని, దీన్ని దిల్మా రౌసెఫ్ అద్భుతంగా నిర్వహించారని మోడీ కొనియాడారు. స్నేహ బంధాన్ని పటిష్టం చేస్తాం అణు, రక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, రష్యా నిర్ణయించాయి. నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మంగళవారం రాత్రి 40 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యా, ఇండియా సంబంధాలను బలోపేతం చేసే చర్యలపై చర్చించామని, మా స్నేహాన్ని మరింత వృద్ధి చేసుకున్నామని భేటీ అనంతరం మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మన దేశానికి స్నేహితుడు ఎవరు అని భారత్‌లో చిన్న పిల్లాడిని అడిగినా.. రష్యా అని ఠక్కున చెబుతాడని, ఎందుకంటే పలు సంక్షోభాల్లో భారత్‌కు రష్యా బాసటగా నిలిచిందని మోడీ పేర్కొన్నారు. విద్యార్థులకు వీసాలు మరింత సులువుగా అందేలా చూడాలన్న మోడీ విజ్ఞప్తిపై పుతిన్ సానుకూలంగా స్పందించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అక్బరుద్దీన్ తెలిపారు. భారత పర్యటన సందర్భంగా కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని సందర్శించాలన్న మోడీ ఆహ్వానానికి పుతిన్ సానుకూలంగా స్పందించారన్నారు. కూడంకుళం ప్లాంట్‌లోని 1, 2 యూనిట్లు రష్యా సహకారంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తే దారుణాలే!
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించొద్దు.. పొదుపుగా ప్రకృతి వనరుల వినియోగం ఫోర్టాలెజా: ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘బ్రిక్స్’ దేశాలకు పిలుపునిచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం మోడీ ప్రసంగించారు. ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. అది మానవత్వానికి వ్యతిరేకమేనని నా ప్రగాఢ విశ్వాసం. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు’ అని తేల్చి చెప్పారు. ‘అఫ్ఘానిస్థాన్ నుంచి ఆఫ్రికా వరకు ఉన్న ప్రాంతమంతా సంక్షోభంలో, సంఘర్షణల్లో కొట్టుమిట్టాడుతోంది. ఆయా దేశాలు ముక్కలైపోతుంటే మనం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతే.. భవిష్యత్ పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని బ్రిక్స్ దేశాధినేతలను హెచ్చరించారు. ‘ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన దేశాల భవిష్యత్తునే కాదు.. మొత్తం ప్రపంచ భవిష్యత్తునే నిర్దేశిస్తాయి’ అని వ్యాఖ్యానించారు. సైబర్ స్పేస్‌ను సురక్షితంగా, అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బ్రిక్స్ దేశాలపై ఉందన్నారు. సరళీకృత, పారదర్శక అంతర్జాతీయ వాణిజ్య విధానాలను అవలంబించాల్సి ఉందని, అది ప్రపంచ ఆర్థికరంగ వృద్ధికి అత్యవసరమని మోడీ పేర్కొన్నారు. ఆహార భద్రత వంటి విషయాల్లో అన్ని వర్గాల ఆకాంక్షలను తీర్చేలా ఆర్థిక వృద్ధి ఉపయోగపడాలన్నారు. వసుధైక కుటుంబం..: ప్రపంచమంతా ఒకే కుటుంబమని నమ్మే ‘వసుధైక కుటుంబం’ భావన ఉద్భవించిన గడ్డ నుంచి తాను వచ్చానని మోడీ తెలిపారు. ప్రకృతిని నాశనం చేయడం నేరమని, అది ప్రసాదించే వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు. ‘మా ప్రగతికి ఆటంకం లేకుండా వనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటాం’ అని భారత ప్రణాళికను చెప్పారు. మౌలికవసతులు, చవకైన గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్య, స్వచ్ఛమైన శక్తి..వంటి రంగాల్లో తమ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలనుకుంటోందని మోడీ వెల్లడించారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం.. బ్రిక్స్ సదస్సుకు ముందు బ్రెజిల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన మోడీ.. ఎనభై నిమిషాలు పాటు చర్చలు జరిపారు. ఉద్రిక్తతలకు కారణమవుతున్న సరిహద్దు సమస్యకు పరిష్కారం కనుగొనాలని చైనాకు మోడీ నొక్కిచెప్పారు. ఈ సమస్యకు స్నేహపూర్వకంగా పరిష్కారం కనుగొన్నట్లయితే, ఇలాంటి వివాదాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. బోర్డర్ వద్ద ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరిగినా అది దౌత్య సంబంధాలపై ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోడీ స్పష్టం చేశారు. చరిత్రను గుర్తు చేసుకుంటూ... ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల కేంద్రంగా జిన్‌పింగ్, మోడీ చర్చలు నడిచాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అభివృద్ధిపై మోడీ దృష్టిని జిన్‌పింగ్ ప్రస్తుతించగా.. అదే సమయంలో చైనాలో తన పర్యటనల గురించి మోడీ గుర్తుచేసుకున్నారని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించడానికి జిన్‌పింగ్ అంగీకారం తెలిపారని చెప్పారు. అదే సమయంలో ఈ ఏడాది తాము ఆతిథ్యమిచ్చే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం (అపెక్) సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత ప్రధానిని చైనా ఆహ్వానించింది. ఇలాంటి ఆహ్వానం రావడం భారత్‌కు ఇదే తొలిసారి. అంతర్జాతీయ వేదికలపై ఆసియా దిగ్గజాలు ఇద్దరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. 21 దేశాలు పాల్గొనే ఆ సదస్సు నవంబర్‌లో జరుగుతుందని, అయితే ప్రధానికి ఆ సమయంలో వీలు పడుతుందో లేదో చూడాలని అక్బరుద్దీన్ చెప్పారు. అదే సమయంలో జి-20, సార్క్ సదస్సులు ఉన్నాయని, అయినా చైనా ఆహ్వానాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నామని తెలిపారు. -
ఆర్థిక స్థిరత్వానికి ప్రయత్నిస్తాం
-
ప్రపంచ శాంతిపై బ్రిక్స్‌లో చర్చిస్తాం
ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు చొరవ ఆర్థిక స్థిరత్వానికి ప్రయత్నిస్తాం బ్రెజిల్ వెళ్తూ బెర్లిన్‌లో బస చేసిన ప్రధాని న్యూఢిల్లీ/బెర్లిన్: బ్రెజిల్లో రెండు రోజుల పాటు జరిగే ఐదు దేశాల బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బయల్దేరి వెళ్లారు. మార్గ మధ్యంలో రాత్రి బస కోసం జర్మనీ రాజధాని బెర్లిన్ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి భారత దౌత్యాధికారి విజయ్ గోఖలేతో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆయన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు చేస్తారని భావించినా.. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు ఫైనల్‌కు చేరడంతో ఆ మ్యాచ్ చూడడానికి మెర్కెల్ బ్రెజిల్ వెళ్లడంతో అది వాయిదా పడింది. దీంతో బెర్లిన్‌లో విశ్రాంతి తీసుకుని బయలుదేరతారు. అంతకుముందు ఢిల్లీలో బయలుదేరే సమయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రాంతీయ సంక్షోభాలు, భద్రతకు సంబంధించిన ప్రమాదాలపై బ్రిక్స్ సదస్సులో భారత్ చర్చిస్తుందని వెల్లడించారు. అభివృద్ధి బ్యాంకు, వంద కోట్ల డాలర్లతో ఆగంతుక నిధి ఏర్పాటుపై బ్రిక్స్ చొరవ తీసుకునేలా భారత్ ప్రయత్నిస్తుందని మోడీ తెలిపారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, మానవ సంక్షోభాలు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఈ సదస్సు జరుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోందని, చాలా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడమేగాక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని మోడీ పేర్కొన్నారు. సదస్సు మంచి అవకాశం..ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి, ప్రాంతీయ సంక్షోభాలు, భద్రత ప్రమాదాలను రూపుమాపడానికి బ్రిక్స్ దేశాలు అందించగలిగే తోడ్పాటుపై చర్చించేందుకు సదస్సును ఒక మంచి అవకాశంగా భావిస్తామని ప్రధాని ఉద్ఘాటించారు. అంతేగాక బ్రిక్స్ అంతర్గత దేశాల ఆర్థిక సహకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నిలకడతో కూడిన పురోగమనం సాధించడానికి సామూహిక ప్రయత్నాలు చేస్తామన్నారు. బ్రిక్స్ ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వానికి ఆలంబనగా నిలిచే అభివృద్ధి బ్యాంకు, ఆగంతుక నిధి ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రపంచ శాంతి, నిలకడ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి భారత్ అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని ప్రధాని తెలిపారు. బ్రెజిల్ సమావేశం బ్రిక్స్ రెండో దశకు దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళ, బుధవారాల్లో బ్రెజిల్‌లోని ఫోర్టెలెజాలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) దేశాల ఆరో సదస్సు జరగబోయే విషయం తెలిసిందే. ప్రధాని వెంట బ్రెజిల్ చేరే బృందంలో కేంద్ర సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, ఎన్ఎస్ఏ ఏకే దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్, ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఉన్నారు. ఆర్జెంటీనాతో రష్యా అణు ఒప్పందం.. బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి బయలుదేరిన రష్యా ప్రధాని వ్లాదిమర్ పుతిన్ తొలుత అర్జెంటీనా చేరుకున్నారు. అక్కడ ఆదేశ అధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్‌తో సమావేశంలో అణు ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. తమ దేశంలోని అట్చా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కొన్ని యూనిట్ల నిర్మాణానికి రష్యా ఆటమిక్ కార్పొరేషన్ సహకరిస్తుందని తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ.. తమకు అర్జెంటీనా వ్యూహాత్మక మిత్రుడని, ఫెర్నాండెజ్‌తో తాను తరచూ సంప్రదిస్తూనే ఉంటానని చెప్పారు. లంచ్ తర్వాత పుతిన్ బ్రెజిల్ బయలుదేరి వెళతారు.