Bride attempts suicide
-
నిజామాబాదు: నవీపేటలో పెళ్లింట విషాదం
-
పెళ్లైన నెల రోజులకే.. నవ వధువు ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా/ లావేరు: పెళ్లయిన నెల రోజులుకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంలో చోటుచేసుకుంది. వధువు సోదరుడు లంకలపల్లి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..లావేరు గ్రామానికి చెందిన లంకలపల్లి సూర్యనారాయణ, గోవిందమ్మ దంపతుల మూడో కుమార్తె రోహిణి(25)ని ఆమదాలవలస పట్టణంలోని పెంటయ్యకాలనీకు చెందిన యర్నాగుల వెంకటరావు, వెంకటరత్నం దంపతుల కుమారుడు మోహన్‌కుమార్‌తో ఈ ఏడాది ఆగస్టు 25న వివాహం చేశారు. మోహన్‌కుమార్ విశాఖపట్నం జిల్లా పరవాడలో ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో అపార్టుమెంటును అద్దెకు తీసుకొని నూతన దంపతులు ఉంటున్నారు. ఈ నెల 27న సాయంత్రం మోహన్‌కుమార్ డ్యూటీ నుంచి అపార్టుమెంటుకు తిరిగి రాగా భార్య రోహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని లావేరులోని అత్తమామాలుకు ఫోన్లో తెలియజేయడంతో వారు గురువారం రాత్రి అపార్టుమెంటుకు చేరుకుని బోరున విలపించారు. రోహిణి సోదరుడు, కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సమయంలోనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు తట్టుకోలేకే: రోహిణి కుటుంబ సభ్యులు భర్త మోహన్‌కుమార్ వేధింపులు తట్టుకోలేకే రోహిణి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు సూర్యనారాయణ, గోవిందమ్మ, సోదరుడు కృష్ణలు శుక్రవారం ‘సాక్షి’తో తెలిపారు. కట్నకానుకలు బాగానే ఇచ్చి పెళ్లి చేశామని, పెళ్లి సరదాలు తీరకముందే వేధింపులకు కుమార్తె బలైపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. తనతో చనువుగా ఉండటం లేదని కుమార్తె చెప్పినా..సర్దుకుంటారులే అని అనుకున్నామని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. దీనికంతటికీ కారణమైన మోహన్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం లావేరు తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పెళ్లిలో గొడవ.. తొలి రోజే వధువు ఆత్మహత్య
సాక్షి, నల్గొండ/పెద్దఅడిశర్లపల్లి : ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన నవ వధువు తనువు చాలించింది. పెళ్లి వేడుకలో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై పెళ్లి రోజు రాత్రి నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటన పీఏపల్లి మండలంలోని గుడిపల్లిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం గుడిపల్లికి చెందిన బూరుగు వెంకటయ్య, యశోద దంపతుల కుమార్తె కల్పన(23)కు చింతపల్లి మండలం గొడుగుండ్లకు చెందిన రాజుతో ఈ నెల 19న గొడుగుండ్లలో వివాహం జరిగింది. అయితే పెళ్లి రోజున కట్నకానుకల విషయం.. ఇరు కుటుంబీకుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ గొడవతో కల్పన మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే పెళ్లి జరిగిన రాత్రి గుడిపల్లిలోని ఇంట్లో నెయిల్ పాలిష్ తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఆస్పత్రికి తరలించగా శనివారం రాత్రి మృతి చెందింది. నవ వధువు మృతితో సందడిగా ఉండాల్సిన ఇంట్లో విషాదం నిండింది. బంధువుల రోదనలతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఇష్టంలేని పెళ్లి చేశారని వధువు ఆత్మహత్యాయత్నం
అనంతపురం: తల్లి దండ్రులు బలవంతంగా పెళ్లి చేయడంతో పీటలపైనే ఓ వధువు ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకం రేపింది. జిల్లాలోని హిందూపురంలో అరుణ అనే యువతికి గత కొన్ని రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. ఆ యువతికి కి పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని భావించింది. ఈ క్రమంలోనే వివాహ మూహూర్తం కూడా దగ్గర కొచ్చేసింది. ఇంట్లో వాళ్లతో విభేదించలేక తాళి కట్టించుకున్న అనంతరం ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.