ఇష్టంలేని పెళ్లి చేశారని వధువు ఆత్మహత్యాయత్నం | Bride sets herself ablaze to avoid marriage | Sakshi
Sakshi News home page

ఇష్టంలేని పెళ్లి చేశారని వధువు ఆత్మహత్యాయత్నం

Published Fri, Nov 15 2013 6:20 PM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

Bride sets herself ablaze to avoid marriage

అనంతపురం: తల్లి దండ్రులు బలవంతంగా పెళ్లి చేయడంతో పీటలపైనే ఓ వధువు ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకం రేపింది. జిల్లాలోని హిందూపురంలో అరుణ అనే యువతికి గత కొన్ని రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. ఆ యువతికి కి పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని భావించింది. ఈ క్రమంలోనే వివాహ మూహూర్తం కూడా దగ్గర కొచ్చేసింది.

 

ఇంట్లో వాళ్లతో విభేదించలేక  తాళి కట్టించుకున్న అనంతరం ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది.  ప్రస్తుతం ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement