Brisbane city
-
ఆస్ట్రేలియాలో వరుసగా హిందూ టెంపుల్స్ ధ్వంసం.. వారి పనేనా?
ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బ్రిస్బేన్‌లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి జరిగింది. శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి సందర్భంగా ఆలయం గోడలు ధ్వంసమయ్యాయి. కాగా, తాజా ఘటనతో రెండు నెలల కాలంలో ఆస్ట్రేలియాలో నాలుగు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. వివరాల ప్రకారం.. దక్షిణ బ్రిస్బేన్‌లోని బుర్‌బ్యాంక్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో దాడికి పాల్పడ్డారు. కాగా, భక్తులు శనివారం ఉదయం గుడి వెళ్లడంతో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో, ఈ విషయాన్ని ఆలయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఖలిస్థాన్ అనుకూల వాదులే ఈ దాడికి దిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు కూడా బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిర్‌పై దాడి చేస్తామంటూ పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన ఖలిస్థాన్ తీవ్రవాదుల నుంచి వార్నింగ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సాతిందర్ శుక్లా ఈ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయ పూజారి, భక్తులు ఈ ఉదయం తనకు ఫోన్ చేసి ఆలయ ప్రహరీపై జరిగిన దాడి గురించి చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఆలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో హిందూ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సారా ఎల్ గేట్స్ స్పందించారు. అక్కడ నివసించే హిందువులను భయపెట్టేందుకు సిక్స్ ఫర్ జస్టిస్ చేస్తున్న పద్దతిలోనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీలైనంత తొందరగా ఈ దాడులకు కారణమైన వారిని పట్టుకోవాలన్నారు. -
అందరూ చూస్తుండగా అఘాయిత్యం
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని బిస్బేన్ నగరంలో పంజాబ్ కు చెందిన బస్సు డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే అతడిని సజీవ దహనం చేశాడో దుండగుడు. బిస్బేన్ సిటీ కౌన్సిల్ డ్రైవర్ గా పనిచేస్తున్న మాన్మీత్ ఆలిషెర్(29)పై దుండగుడు మండేస్వభావం ఉన్న ద్రవం పోశాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో కాలిన గాయాలతో బస్సులోనే మాన్మీత్ ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. భయాందోళనకు గురైన బస్సులోని ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా పారిపోయారని వెల్లడించారు. అయితే బస్సు మొత్తానికి మంటలు అంటుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ దాడికి సంబంధించి 48 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఇది జాత్యంహకార, తీవ్రవాద దాడి కాదని పోలీసులు స్పష్టం చేశారు. మంచి గాయకుడిగా కూడా ప్రసిద్ధుడైన మాన్మీత్ ఆలిషెర్ మరణం పట్ల ప్రవాస పంజాబీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
భారత సంతతి మహిళ దుర్మరణం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి మహిళ ఓ హోటల్ భవనంపై నుంచి పడి మృతి చెందింది. కేషియా హందా (31) అనే మహిళ ఇస్తాన్‌బుల్‌లో సెప్టెంబర్ 19న గ్రాండ్ హోటల్ డి లాండ్రెస్ హోటల్లో ఏర్పాటు చేసిన టెర్రస్ పార్టీలో పాల్గొంది. పార్టీలో భాగంగా రెండు భవనాలను కలుపుతూ తాత్కాలికంగా 10 మీటర్ల వంతెనను నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆమె వంతెన పైభాగంలో డాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారిపడిపోయినట్టు అక్కడి హుర్రియత్ డెయిలీ న్యూస్ వెల్లడించింది. ఆస్ట్రేలియా బ్రిస్బేన్ సిటీలో పనిచేస్తున్న హందా.. ప్రపంచంలో జరిగే పలు డాన్స్ పార్టీల్లో తరచూ పాల్గొనేదంటూ ఆమె స్నేహితులు తెలిపారు. కాగా, సెప్టెంబర్ 16న జరిగిన సాల్సా పార్టీలో పాల్గొన్న ఆమె ...ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి హోటల్‌ను తనిఖీ చేసినట్టు వారు పేర్కొన్నారు.