వెల్లింగ్టన్: న్యూజిలాండ్కు చెందిన భారత సంతతి మహిళ ఓ హోటల్ భవనంపై నుంచి పడి మృతి చెందింది. కేషియా హందా (31) అనే మహిళ ఇస్తాన్బుల్లో సెప్టెంబర్ 19న గ్రాండ్ హోటల్ డి లాండ్రెస్ హోటల్లో ఏర్పాటు చేసిన టెర్రస్ పార్టీలో పాల్గొంది. పార్టీలో భాగంగా రెండు భవనాలను కలుపుతూ తాత్కాలికంగా 10 మీటర్ల వంతెనను నిర్మించారు.
ఈ నేపథ్యంలో ఆమె వంతెన పైభాగంలో డాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారిపడిపోయినట్టు అక్కడి హుర్రియత్ డెయిలీ న్యూస్ వెల్లడించింది. ఆస్ట్రేలియా బ్రిస్బేన్ సిటీలో పనిచేస్తున్న హందా.. ప్రపంచంలో జరిగే పలు డాన్స్ పార్టీల్లో తరచూ పాల్గొనేదంటూ ఆమె స్నేహితులు తెలిపారు. కాగా, సెప్టెంబర్ 16న జరిగిన సాల్సా పార్టీలో పాల్గొన్న ఆమె ...ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి హోటల్ను తనిఖీ చేసినట్టు వారు పేర్కొన్నారు.
భారత సంతతి మహిళ దుర్మరణం
Published Mon, Sep 28 2015 3:04 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM
Advertisement
Advertisement