British Model Kidnap
-
డ్రగ్స్ ఇచ్చి.. సూట్‌కేస్‌లో కుక్కి.. సెక్స్ బానిసగా..!
గత ఏడాది వేసవిలో కిడ్నాప్‌కు గురైన బ్రిటిష్ మోడల్ ఎంతో శారీరక, మానసిక హింసను అనుభవించిందని ఇటలీ పోలీసులు తెలిపారు. ఇటలీలో కిడ్నాపైన క్లోహి అయిలింగ్‌కు డ్రగ్స్ ఇచ్చి.. ఓ సూట్‌కేస్‌లో కుక్కి.. అత్యంత కిరాతకంగా ఆమెను బట్వాడా చేశారని, ఆన్లైన్లో ఆమెను సెక్స్ బానిసగా అమ్మేయాలని ప్రయత్నించారని వెల్లడించారు. 20 ఏళ్ల క్లోహి అపహరణ కేసులో ప్రధాన నిందితుడైన లుకాస్ పవాల్ హెర్బాను పోలీసులు విచారించగా.. పలు దారుణమైన విషయాలు వెలుగుచూశాయి. ఇంగ్లండ్‌లో తాత్కాలికంగా నివసిస్తున్న హెర్బా (30 ఏళ్లు).. మిలాన్‌లో బూటకపు ఫొటోషూట్ ఆశజూపి.. అయిలింగ్‌కు వలవేశాడు. లండన్ నుంచి ఆమెను ఇటలీకి రప్పించి కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్లోని డార్క్ వెబ్‌లో తనను సెక్స్ బానిసగా అమ్మేయాలని కిడ్నాపర్లు ప్రయత్నించారని, మూడు లక్షల డాలర్లకు తనను అమ్మేందుకు బేరం పెట్టారని బాధితురాలు అయిలింగ్ పోలీసులకు వెల్లడించింది. కిడ్నాప్ చేసిన తర్వాత తనకు డ్రగ్స్ ఇచ్చి.. నోటికి గుడ్డ కట్టి.. కాళ్లుచేతులు కట్టేసి.. ఓ బ్యాగులో కుక్కేసి.. కారు డిక్కీలో వేసుకొని టురిన్ శివార్లలో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌కు తరలించారని, అక్కడ కుర్చీకి కాళ్లు చేతులు కట్టేసి.. బంధించారని, ఆ కుర్చీకి అతుక్కొని తాను రోజులు గడిపానని, నిద్రపోయానని ఆమె పోలీసులకు వివరించారు. అయిలింగ్ రెండేళ్ల బాబుకు తల్లి అని తెలియడంతో కిడ్నాపర్లు ఆమెను గత ఏడాది జూలైలో విడిచిపెట్టారు. మిలాన్‌లోని బ్రిటిష్ కాన్సులేట్‌లో ఆమెను విడిచారు. ఆ వెంటనే ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెర్బాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో డార్క్ వెబ్‌లో వేలం వేసేందుకు సాగుతున్న విచ్చలవిడి మానవ అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. -
మోడల్‌ను కిడ్నాప్ చేసి..
మిలాన్: ఫొటో షూట్ కోసం వచ్చిన బ్రిటీష్ మోడల్‌ను కిడ్నాప్ చేసి ఆన్లైన్లో వేలానికి పెట్టిన వ్యక్తిని ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాణిజ్య ప్రకటనలో నటించేందుకు 20 ఏళ్ల మోడల్ మిలాన్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. లుకాజ్ హెర్బా అనే వ్యక్తితో పాటు మరొకడు కలిసి ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమెను నగ్నంగా ఫొటోలు తీశారు. తర్వాత ఆమె కాళ్లుచేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి సూట్‌కేసులో కుక్కేశారు. దీన్ని కారు డిక్కీలో వేసుకుని మిలాన్‌కు 120 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇంటికి తరలించారు. ఆరు రోజుల పాటు ఆమెను అక్కడ బంధించారు. ఈలోగా బాధితురాలి ఫొటోలను లుకాజ్ సీక్రెట్ వెబ్సైట్లో పోస్ట్ చేసి ఆమెను వేలానికి పెట్టాడు. కనీస ధర 353,000 డాలర్లుగా బిట్‌కాయిన్ రూపంలో నిర్ణయించాడు. మరోవైపు వేలం ఆపాలంటే 300,000 డాలర్లు ఇవ్వాలని బాధితురాలిని పంపించిన మోడలింగ్ ఏజెన్సీని డిమాండ్ చేశాడు. అయితే బాధితురాలికి రెండేళ్ల బిడ్డ ఉందని తెలుసుకుని కిడ్నాపర్లు ఆమెను విడిచిపెట్టారు. తల్లులను కిడ్నాప్ చేయడం తమ నిబంధనలకు విరుద్ధరమని చెప్పి ఆమెను వదిలేశారు. తమ గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను పంపేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిలాన్ పోలీసులు లుకాజ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో చాలా మందిని అతడు కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. బాలికలను కిడ్నాప్ చేసి ఆన్లైన్లో విక్రయించే 'బ్లాక్ డెత్ గ్రూపు'లో అతడు సభ్యుడని భావిస్తున్నారు.