British researchers
-
సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి
కోవిడ్.. రెండేళ్లుగా ప్రజలను అల్లాడిచ్చిన ఈ మహమ్మారి ప్రస్తుతం పత్తాలేకుండా పోయింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓరియంట్ వేరియంట్లతో యావత్ ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న వైరస్ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. జనాలు కూడా కరోనాను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలేవి పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సాధారణంగా కోవిడ్ బారిన పడితే 10 లేదా 20 మహా అయితే నెలలో కోలుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి సంవత్సరానికి మించి మహమ్మారితో పోరాడుతూనే ఉన్నాడు. ఏకంగా 411 రోజులుగా అతన్ని కరోనా విడిచిపెట్టడం లేదు. దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్ నుంచి బయటపడ్డాడు. నిర్ధిష్ట వైరస్ జన్యు కోడ్‌ను విశ్లేషించి సరైన చికిత్సను అందిచడంతో కోలుకున్నాడని బ్రిటీష్ పరిశోదకులు తెలిపారు. గైస్ &సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, కింగ్స్ కాలేజ్ లండన్‌లోని పరిశోధకుల బృందం క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో 13 నెలలపాటు కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తికి చేసిన చికిత్స గురించి వివరించారు. చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు మూత్రపిండం మార్పిడి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి 2020 డిసెంబరులో కోవిడ్ సోకిందని.. ఈ ఏడాది జనవరి వరకు పాజిటివ్ గానే కొనసాగిందనిప పేర్కొన్నారు. దీర్ఘకాల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు నానోపోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీతో వేగవంతమైన జన్యు విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో రోగికి బీ.1 వేరియంట్ సోకినట్లు గుర్తించారు. కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా చికిత్స చేసినట్లు పరిశోధకులు తెలిపారు. సదరు వ్యక్తి కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లోనే కరోనాకు గురవ్వడంతో ఈ చికిత్స ద్వారా నయం చేశామని. ఇది ఓమిక్రాన్ వంటి వేరియంట్‌పై సమర్థంగా పనిచేయదని పేర్కొన్నారు. ఇలా మొత్తానికి కరోనా ఫస్ట్ వేవ్ నుంచి వైరస్‌తో పోరాడుతున్న రోగిని విజయవంతంగా దాని నుంచి విముక్తి కలిగించారు. సాధారణ వైరస్ కాదు అయితే అతనికి సోకింది పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇది నార్మల్ కోవిడ్ కంటే భిన్నమైంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది సోకిన వారు నెలలు ఒక్కోసారి సంవత్సరాలు కూడా కరోనా పాటిజివ్‌గా వస్తుందని సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టుకు చెందిన అంటువ్యాధుల ప్రత్యేక వైద్యుడు ల్యూక్ స్నెల్ తెలిపారు. అంటువ్యాధుల తీవ్ర ముప్పు వల్ల సగం మంది రోగుల్లో ఊపిరితిత్తుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
నవ్వుతో నాజూకు దేహం
పరిపరి శోధన నవ్వు నాలుగు విధాల చేటు అనే సామెతకు ఏనాడో కాలం చెల్లింది. నవ్వు నలభై విధాల గ్రేటని జనాలు తెలుసుకున్నారు. నవ్వు వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చని, శారీరకంగా చురుగ్గా ఉండొచ్చని కూడా పలు పరిశోధనలు తేల్చాయి. రోజులో ఎక్కువ సేపు నవ్వులు చిందిస్తూ ఉండటం వల్ల శరీరం నాజూకుతనాన్ని సంతరించుకుంటుందని ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు తేల్చారు. పెదవులు అరవిరిసేలా చిందించే చిరునవ్వుల కంటే, పగలబడి నవ్వే నవ్వుల వల్ల ముఖ కండరాలకు, పొట్ట కండరాలకు తగినంత వ్యాయామం లభించి, కేలరీలు కరుగుతాయని జీవశాస్త్రవేత్త కూడా అయిన బ్రిటిష్ హాస్యనటి డాక్టర్ హెలెన్ పిల్చర్ చెబుతున్నారు. -
కునుకు లేకుంటే... ఖుషీ ఉండదు
పరిపరి శోధన ఖుషీ ఖుషీగా... కులాసాగా, ఉల్లాసంగా ఉండలేకపోతున్నారా..? ఎదుటివారు నవ్వుతూ తుళ్లుతూ జోకులు వేస్తున్నా మనసారా నవ్వలేకపోతున్నారా..? అయితే, మీకు తగినంత నిద్ర లేదన్న మాట. తగినంత నిద్ర లేకపోతేనే మనుషుల్లో సెన్సాఫ్ హ్యూమర్ తగ్గిపోతుందని బ్రిటిష్ పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీడ్స్ వర్సిటీ పరిశోధకులు నిద్రలేమితో బాధపడుతున్న వారిపై నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజుకు ఐదుగంటలు.. అంతకంటే తక్కువ నిద్రపోయేవారిలో హాస్యస్ఫూర్తి చచ్చిపోతుందని, ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించాలంటే రోజుకు కనీసం ఏడుగంటల నిద్ర అవసరమని ఈ పరిశోధకులు చెబుతున్నారు. -
కాఫీతో తిక్క... దానికో లెక్క!
పరిపరి శోధన కాఫీ అతిగా తాగితే మతిభ్రమిస్తుందట! అతిగా తాగేవాళ్లకు రకరకాల భ్రమలు ఏర్పడతాయని, ఇలాంటి వాళ్లకు చనిపోయిన సన్నిహితులను తిరిగి చూస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుందని బ్రిటిష్ పరిశోధకులు చెబుతున్నారు. మితిమీరి కాఫీతాగే అలవాటు ఉన్న రెండువందల మందిపై విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ సంగతిని కనుగొన్నామని బ్రిటన్‌లోని డర్హామ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఏడు కప్పులకు మించి కాఫీ తాగే వారిలో ఇలాంటి భ్రమలు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని అంటున్నారు. కెఫీన్ మోతాదు మించితే, శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని, దీనివల్ల ఇలాంటి భ్రమలు కలుగుతాయని వివరిస్తున్నారు. -
మంచి లక్ష్యంతో పనిచేయండి... ఆయుష్షు పెరుగుతుంది!
కొత్త పరిశోధన జీవితంలో ఒక మంచి లక్ష్యం ఏర్పరచుకుని, తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తూ ఉండేవారి జీవితకాలం పెరుగుతుంటుందనీ, వాళ్లు చాలా కాలం జీవిస్తారని బ్రిటన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. దాదాపు 65 ఏళ్ల వయసు పైబడిన 9,050 మందిని ఎంపిక చేసుకొని వాళ్లను వర్గాలుగా విభజించి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. దాదాపు ఎనిమిదిన్నర ఏళ్లపాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్న వారు సుదీర్ఘకాలం పాటు జీవిస్తున్నట్లు వెల్లడయ్యింది. మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్న వారిలోనూ మంచి ఆర్థిక సామాజిక స్థితి, చక్కటి శారీరక ఆరోగ్యం, డిప్రెషన్ లేకపోవడం, పొగతాగే అలవాటుకు, మద్యానికి దూరంగా ఉండటం వంటి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించివారిలో అకాల మృత్యువు బారిన పడే అవకాశాలు మిగతావారి కంటే 30 శాతం తక్కువని ఈ అధ్యయన కాలంలో తేలింది. ఈ విషయాలన్నీ ‘ద ల్యాన్సెట్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇదే తరహాలో నిర్వహించిన పరీక్షలో పై ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ఆనందాన్ని కూడా ఒక అంశంగా తీసుకున్నారు. ఇలా ఆనందంగా తమ లక్ష్యం కోసం పనిచేసే వారి జీవితకాలం కూడా పెరుగుతుందని ఈ అధ్యయనంలోనూ వెల్లడయ్యింది. వేరుగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను ‘ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ కూడా ధ్రువీకరించింది. ఇలా మంచి లక్ష్యలతో పనిచేసే ఈ వయోవృద్ధులకు పలుమార్లు నిర్వహించిన కొలెస్ట్రాల్, ప్రోస్టేట్ పరీక్ష, మహిళల్లో మామోగ్రామ్ వంటి పరీక్షల్లోనూ చాలా సందర్భాల్లో ఫలితాలు నార్మల్‌గానే వచ్చాయి. అంటే వీళ్లలో వ్యాధిని ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుందని తేలింది. -
మంద్రస్వరం మత్తెకెత్తిస్తోంది..!
పవర్ఫుల్ వాయిస్‌తో డైలాగ్‌లు చెప్పే హీరోల కన్నా.. కాస్తంత మంద్ర స్వరంతో డైలాగులు చెప్పే హీరోలే అమ్మాయిల మనసుపై చాలా త్వరగా మత్తు చల్లగలరు అని అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. అబ్బాయిల వాయిస్- అమ్మాయిల మనసు అనే అంశంపై వారు జరిపిన పరిశోధన ఫలితంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాలేజ్ లోనైనా, సినిమా హీరోల విషయంలోనైనా అమ్మాయిల ఛాయిస్ మంద్రస్వర మాంత్రికులకేనన్నారు. కాలేజ్‌లో తమతో మాట్లేడే అబ్బాయిల విషయంలో కంచుకంఠాల కంటే.. కాస్తంత మొహమాటంతో, కొంచెం సంకోచంతో.. నెమ్మదిగా మాట్లాడే అబ్బాయిలనే అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారట. అబ్బాయితో మాట్లాడేటప్పుడు అమ్మాయిలు అతడి వాయిస్‌ను బాగా పరిశీలిస్తారట. 87 శాతం మహిళల్లో ఈ లక్షణం ఉంటుందట. తమతో మాట్లాడే వాడి వాయిస్ బాగా నచ్చితే అతడితో సంభాషణను కొనసాగించడానికి ప్రాధాన్యతనిస్తారట. బ్రిటన్‌లోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ వారు ఈ విషయం గురించి విశ్లేషించారు. ‘‘ మనిషి వాయిస్ తను మాట్లాడుతున్న వక్తిని బట్టిగాక.. ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్‌తో, ఇంట్లో వాళ్లతో, బయటి వాళ్లతో, పరిచయం ఉన్న వాళ్లతో, లేని వాళ్లతో.. ఇలా రిలేషన్ బట్టి మనిషి వాయిస్‌ను మారుస్తాడు. ఇష్టమైన వాళ్లు ఫోన్ చేస్తే ఆ కాల్ రిసీవ్ చేసుకొని ‘హలో..’ అనడంతోనే ఆ వ్యక్తికి మీద ప్రేమాభిమానాల స్థాయి తెలిసిపోతుంది వ్యక్తమవుతాయి. ఈ విషయాన్ని మహిళలు మరీ సీరియస్‌గా తీసుకొంటారు. తొలి పరిచయంలోనే అబ్బయి గొంతులోని సౌమ్యతను పరిశీలిస్తారు..’’ అని అభిప్రాయపడ్డారు పరిశీలకులు. కొంతమంది సినిమా నటుల, సెలబ్రిటీల వాయిస్ విషయంలో కూడా మహిళల అభిప్రాయాలను తీసుకొన్నారు. వారిలో గంభీరంగా, గట్టిగా పదాలను వదిలే వారికన్నా.. కోపాన్ని కూడా చాలా సౌమ్యమైన వాయిస్‌తో చెప్పే వాళ్లే తమకు ఎంతో ఇష్టమని అభిప్రాయాలు వ్యక్త పరిచారు మహిళా మణులు. 87 శాతం మహిళలు ఇలాంటి అభిప్రాయాన్నే చెప్పారని అంటే.. మగాడి వాయిస్ విషయంలో ఆడవాళ్లో అభిప్రాయంలో చాలా సామ్యత ఉందను కోవాలి. ఇక తమ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా వివరించారు కొంతమంది మహిళ లు. రొమాంటిక్ మూడ్‌లో తమ మగవాళ్లు ఆటోమెటిక్‌గా వాయిస్‌లో పిచ్ తగ్గిస్తారని వారు చెప్పారు. అయితే ఈ విషయంలో కూడా కొంతమంది మహిళలు తమ వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే.. తమ పనిలో బిజీగా ఉన్న తమ పార్టనర్ గట్టిగా మాట్లాడతాడని.. ఆ పలకరింపే తమను నీరు గార్చేస్తుందని వారు చెప్పారు. వీరందరి అభ్రిపాయాలను బట్టి.. అమ్మాయిలు మంద్రస్వరాన్నే కోరుకొంటున్నారని స్పష్టంగా చెప్పవచ్చు అని అంటున్నారు పరిశోధకులు. మరి ఇకేంటి.. అబ్బాయిలు.. ఇష్టమైన అమ్మాయితో మాట్లాడేప్పుడు కాస్తంత స్వరం తగ్గించండి!