కునుకు లేకుంటే... ఖుషీ ఉండదు
పరిపరి శోధన
ఖుషీ ఖుషీగా... కులాసాగా, ఉల్లాసంగా ఉండలేకపోతున్నారా..? ఎదుటివారు నవ్వుతూ తుళ్లుతూ జోకులు వేస్తున్నా మనసారా నవ్వలేకపోతున్నారా..? అయితే, మీకు తగినంత నిద్ర లేదన్న మాట. తగినంత నిద్ర లేకపోతేనే మనుషుల్లో సెన్సాఫ్ హ్యూమర్ తగ్గిపోతుందని బ్రిటిష్ పరిశోధకులు చెబుతున్నారు.
బ్రిటన్‌లోని లీడ్స్ వర్సిటీ పరిశోధకులు నిద్రలేమితో బాధపడుతున్న వారిపై నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజుకు ఐదుగంటలు.. అంతకంటే తక్కువ నిద్రపోయేవారిలో హాస్యస్ఫూర్తి చచ్చిపోతుందని, ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించాలంటే రోజుకు కనీసం ఏడుగంటల నిద్ర అవసరమని ఈ పరిశోధకులు చెబుతున్నారు.