Broadband Internet Services
-
గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..
గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను (ఐఎస్పీ) ప్రోత్సహించాలని, వారికి పన్ను మినహాయింపులు ఇవ్వాలని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) కోరింది. గతేడాదితో పోలిస్తే 20 శాతం గ్రామీణ వినియోగదారులను పెంచుకున్న కంపెనీలకు రివార్డులు ప్రకటించాలని తెలిపింది.ఈ సందర్భంగా బీఐఎఫ్ ఛైర్పర్సన్ అరుణా సౌందరరాజన్ మాట్లాడుతూ..‘దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.84 లక్షల కోట్లు) మార్కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 నాటికి జీడీపీలో 20 శాతం ఈ వ్యవస్థ తోడ్పటును అందించాలని నిర్ణయించారు. కాబట్టి ఈ వ్యవస్థ వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి వేగవంతమైన నెట్వర్క్ సౌకర్యాలు కల్పించాలి. ఈ రంగంలో దేశమంతటా స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలను విస్తరించాలి’ అన్నారు.ఇదీ చదవండి: ‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’‘ప్రస్తుతం దేశంలో డిజిటల్ వృద్ధికి సంబంధించి మొబైల్ వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది. 95.6% మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 4.3% మాత్రమే. వేగవంతమైన ఇంటర్నెట్కు, మొబైల్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థిర బ్రాడ్‌బ్యాండ్ అవసరం. కాబట్టి ఈ వ్యవస్థలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. గ్రామీణ చందాదారులలో గణనీయమైన వృద్ధిని సాధించే ఐఎస్పీలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలను ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ (పీఎం-వాణి) వంటి కార్యక్రమాలతో అనుసంధానించాలి. గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌కు కూడా ప్రభుత్వం సహకరించాలి’ అన్నారు. -
ఇండియాలో టార్గెట్ ఫిక్స్,స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ ప్రారంభం అప్పుడే
న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ లింక్ బ్రాండ్ బ్యాండ్ సేవలు త్వరలోనే మనదేశంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించే యోచనలో ఎలాన్ మస్క్ ఉన్నారని ఇండియా స్టార్‌లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో వీటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. భారత్‌లో ప్రీ–ఆర్డర్ల సంఖ్య 5,000 స్థాయిని దాటేసిందని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంపై తమ సంస్థ ఆసక్తిగా ఉందని భార్గవ వివరించారు. బీటా దశలో 50 నుంచి 150 మెగాబిట్ పర్ సెకన్ స్థాయిలో డేటా స్పీడ్ అందిస్తామని స్టార్‌లింక్ చెబుతోంది. ఈ కనెక్షన్ కోసం 99 డాలర్ల (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విభాగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్ నేరుగా పోటీపడనుంది. అంతర్జాతీయంగా స్టార్‌లింక్ కనెక్షన్లకు ప్రీ–ఆర్డర్లు 5,00,000 స్థాయిని దాటేసిందని భార్గవ చెప్పారు. దేశీయంగా రాబోయే నెలల్లో ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీకండక్టర్ల కొరత కారణంగా స్టార్‌లింక్ కిట్లను తయారు చేసే వేగం మందగించిందని ఆయన వివరించారు. చదవండి: ‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా ! -
ఇంటర్నెట్ స్పీడ్.. మినిమమ్ 2 ఎంబీపీఎస్!
TRAI Recommandations On Internet Speed: ఇంటర్నెట్ మినిమమ్ స్పీడ్ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లకు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది టెల్కామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్). ప్రస్తుతం ఉన్న మినిమ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు పెంచాలని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో ట్రాయ్ కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్ స్పీడ్ బేసిక్ అప్లికేషన్స్ కూడా తెరవడానికి సరిపోవని అభిప్రాయపడింది. మినిమమ్ డౌన్లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్(megabits per second) ఉండేటా చేసుకోవాలని సూచించింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల వేగాన్ని పెంచాలని, అందుకోసం మంత్లీ సబ్ సబ్ స్క్రిప్ట్షన్ ఫీజులో 50 శాతం రీయంబర్స్మెంట్ రూరల్ కనెక్షన్‌దారులకు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది ట్రాయ్. గతంలో 256 కేబీపీఎస్ స్పీడ్‌ను 2014లో 512 కేబీపీఎస్‌కు అప్‌గ్రేడ్ చేయించింది ట్రాయ్. ఇప్పుడు ఆ స్పీడ్‌ను నాలుగు రెట్లు పెంచాలని చెబుతోంది. అంతేకాదు ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ ఆధారంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను యూకే, యూరప్ తరహాలో కేటగిరీలుగా విభజించాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి దేశాల్లో బేసిక్ బ్రాడ్‌బ్యాండ్.. 2-50 ఎంబీపీఎస్ స్పీడ్, ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. 50-300 ఎంబీపీఎస్ స్పీడ్, సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. 300 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్‌తో కేటగిరీలుగా విభజించారు. ఈ సూచనలతో పాటు దేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను పెంచేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేంద్రానికి తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 9.1 శాతం ఇళ్లకు మాత్రమే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. చాలా మంది మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. కేబులింగ్ వ్యవస్థ ద్వారా లైన్ సర్వీసులను పొడిగించే ప్రయత్నం చేయాలని తెలిపింది. అలాగే రూ. 200 కంటే తక్కువ ఛార్జీల నెలవారీ ప్యాక్.. సగం రీయంబర్స్మెంట్ దిశగా ప్రణాళిక అమలు చేయాలని కేంద్రానికి తెలిపింది. ఈ-రూపీ ద్వారా ఆ డబ్బును కనెక్షన్‌దారుడికి జమ చేయాలని సూచించింది. అయితే ట్రాయ్ చేసిన ఈ సూచనల్ని సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా పాటించాలన్న రూల్ లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం పరిగణనలోకి తీసుకుని చట్టం చేయొచ్చు. చదవండి: 2022కల్లా ఏపీలో ప్రతి పల్లెకు బ్రాడ్‌బ్యాండ్ -
బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు బంద్
శ్రీనగర్: కశ్మీర్ లోయలో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా భారీగా హింస చెలరేగడం, 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎలాంటి కారణం చెప్పకుండా గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. వేర్పాటువాదులు ఎన్నికలకు ఆటంక కలిగిస్తారని భావించి.. శ్రీనగర ఉప ఎన్నికకు కొన్ని గంటల ముందు ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు ఆపివేశారు. ఎన్నికలు ముగిశాక మంగళవారం పునరుద్ధరించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించారు.