బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు బంద్ | Broadband Internet Services Suspended In Kashmir | Sakshi
Sakshi News home page

బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు బంద్

Published Thu, Apr 13 2017 6:36 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు బంద్

బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు బంద్

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా భారీగా హింస చెలరేగడం, 38 పోలింగ్ స్టేషన్‌లలో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎలాంటి కారణం చెప్పకుండా గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు.

వేర్పాటువాదులు ఎన్నికలకు ఆటంక కలిగిస్తారని భావించి.. శ్రీనగర ఉప ఎన్నికకు కొన్ని గంటల ముందు ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు ఆపివేశారు. ఎన్నికలు ముగిశాక మంగళవారం పునరుద్ధరించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement