Brotherhood
-
Ambani Brothers: పెద్దోడు-చిన్నోడు.. భలే సందడి చేశారే!
ఆ అన్నదమ్ములు రెండు భిన్న ధృవాలు. ఆర్థిక వ్యవహారాలతో పుట్టిన మనస్పర్థలు వాళ్ల మధ్య దూరం పెంచాయి. చివరకు తండ్రి ఏర్పాటు చేసిన వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకుని.. ఎవరి దారిని వాళ్లు ఎంచుకున్నారు. వ్యాపారం వాళ్ల రక్తంలోనే ఉంది.. రాణిస్తారేమో అని అంతా అనుక్నున్నారు. ఒకరేమో అందనంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు పతనం చవిచూశారు. కానీ, విడిపోయినా.. ఆ అన్నదమ్ముల అనుబంధం ఏమాత్రం తగ్గలేదు. అందుకే వాళ్ల ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతూ.. ట్రెండింగ్‌లోకి వచ్చేశాయ్. 2002లో వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ మరణాంతరం అంబానీ సోదరుల మధ్య మనస్పర్థలు మొదలు అయ్యాయి. తల్లి కోకిలాబెన్ బిడ్డల మధ్య సయోధ్య కోసం ఎంతో ప్రయత్నించింది. చివరకు విడిపోయి.. వ్యాపారాలు పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు అంబానీ బద్రర్స్. ఆయిల్, పెట్రోకెమికల్స్ వ్యాపారాలను అన్న ముఖేష్ అంబానీ ఎంచుకుంటే.. పవర్, టెలికామ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను తమ్ముడు అనిల్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరిదీ ఎడమొహం పెడమొహం. కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ నవ్వులతో ఎదురుపడ్డా.. ఆప్యాయంగా పలకరించుకుందే లేదు. అయితే వ్యాపారంలో.. ముఖేష్ అంబానీ సంపద.. పెరుగుతూ పోతోంది. ఆసియాలోనే అపర కుబేరుడు అయ్యాడు ముఖేష్ అంబానీ. కానీ, అనిల్ అంబానీ సంపద మాత్రం దారుణంగా పడిపోయింది. అయితే ఒక ఘటన.. ఆ అన్నదమ్ముల మధ్య దూరాన్ని చెరిపేసింది. ఇద్దరినీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేలా చేసింది. 2019లో స్వీడిష్ టెలికాం కంపెనీ ఎరిక్సన్కు అనిల్ అంబానీ బకాయిలు పడ్డాడు. బకాయిలు క్లియర్ చేయకపోతే జైలు శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. ఆ కష్టకాలంలో తమ్ముడిని ఆదుకున్నాడు ముఖేష్ అంబానీ. కష్ట సమయాల్లో అండగా నిలిచినందుకు అన్నకు, వదినకు కృతజ్ఞతలు చెప్పాడు అనిల్ అంబానీ. అలాగని ఈ అన్నదమ్ముల అనుబంధం అక్కడితోనే ఆగిపోలేదు. ముఖేష్ ఇంట జరిగే వేడుకలకు దాదాపు క్రమం తప్పకుండా హాజరవుతూ వస్తున్నాడు అనిల్. తాజాగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ–నీతా చిన్న కొడుకు అనంత్‌కు కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం తాజాగా జరిగింది. జియో వరల్డ్ సెంటర్లోని గ్రాండ్ థియేటర్లో జరిగిన కార్యక్రమానికి అంబానీ, మర్చంట్ కుటుంబాలతో పాటు పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే ప్రత్యేక ఆకర్షణ నిలిచింది మాత్రం.. ఈ పెద్దోడు-చిన్నోడి అనుబంధమే!. అతిధులను ఆహ్వానిస్తూ.. ఇద్దరూ కలిసి భలే సందడి చేశారు. -
న్యాస్టీ బ్రదర్హుడ్
‘బ్యాలెన్స్ షీట్ ట్యాలీ కావడం లేదు. ఎక్కడ ఎంట్రీ మిస్సయ్యిందో గమనించావా?’ ఆ అమ్మాయి తల వొంచుకుని నిలబడి ఉంది.‘ఓచర్స్ చెక్ చేశావా?’ అలాగే నిలుచుని ఉంది. ‘సేల్స్ ట్యాక్స్ రిటర్న్సూ?’ మళ్లీ అలాగే. స్ట్రేంజ్. ఏంటీ అమ్మాయి జవాబు చెప్పకుండా. ‘సరే వెళ్లు’ పంపించేసింది. ఇవాళ రోజు బాగా లేదు. చిరాగ్గా ఉంది. ఇవాళేనా? ఈ మధ్య అంతా చిరాగ్గా ఉంటోంది. కాసేపు మంచిమూడ్... అంతలోనే డల్‌నెస్... మళ్లీ మంచి మూడ్. భర్త కూడా గమనించి అదే కంప్లయింటు చేస్తున్నాడు. ‘ఇది నీ బాడీలో ఉండే హార్మోన్స్ చేసే మాయాజాలం’ అంటుంది డాక్టర్ ఫ్రెండ్‌ని కలిస్తే. ఏం హార్మోన్సో. అవేనా మాయాజాలం చేసేది. ఈ మొత్తం సొసైటీ మాయాజాలంలో ఉంది. మగ మాయాజాలంలో. ఆడిటర్‌గా ఆ ఊళ్లో ప్రాక్టీసు మొదలెట్టాలనుకున్నప్పుడు మొదట కుటుంబమే ఆశ్చర్యపోయింది. ‘ఈ రంగంలో నువ్వు రాణించలేవమ్మా. నా మాట విని ఎవరైనా సీనియర్ ఆడిటర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరు’ అన్నాడు తండ్రి– ఆడిటర్‌గా తన అనుభవం అంతా బేరీజు వేసి. సీఏ చేస్తానంటే ఆయన డిస్కరేజ్ చేశాడు. కాని తనే పట్టుబట్టి చదివింది. ‘ఏం ఎందుకు రాణించనూ?’ నిలదీసింది. ‘నీకే తెలుస్తుందిగా’ అన్నాడు. ఆరు నెలలు సంవత్సరానికంతా తెలిసొచ్చేసింది. ఫోన్ మోగింది. ‘ఏమ్మా... ఆడిటరమ్మా... మీరేదో ట్యాక్స్ తగ్గిస్తారనుకుని పెట్టుకుంటే ఇంతింత కట్టాలని నీ అసిస్టెంట్‌ను పంపావేంటి తల్లీ’... అవతల ఏదో కంపెనీ ఎం.డి అడుగుతున్నాడు. అతని టోన్‌లో అసంతృప్తి. నువ్వు ఆడదానివి... అయినా నిన్ను ఆడిటర్‌గా పెట్టుకున్నాను... నా అనుమానానికి తగినట్టే నీ ప్రతిభ అఘోరిస్తోంది అన్నట్టుగా ఉంది అతడి గొంతు. ‘ఆ పేపర్స్ అన్నీ పంపండి సార్. చెక్ చేసి చెప్తాను’ పెట్టేసింది. ఎక్కడుంది లోపం? తను చక్కగా ఆడిట్ చేయగలదు. ఫైనాన్షియల్ రిపోర్ట్ రాసిందంటే కనుక తిరుగుండదు. కేస్‌ను అద్భుతంగా డీల్ చేయగలదు. అకడమిక్స్‌లో గోల్డ్ మెడల్స్ వచ్చాయంటే ఊరికే రావుగా. ‘అవన్నీ ఎవరికి కావాలమ్మా’ అంటాడు తండ్రి. అవును. ఎవరికి కావాలి. ట్యాక్స్‌కు ఎలా మస్కా కొట్టాలి. నంబర్ టు ఖాతాలు ఎలా మెయింటెయిన్ చేయాలి. బ్లాక్‌ను ఎలా మేనేజ్ చేయాలి... ఇవి చెప్పాలి క్లయింట్స్‌కి. ఆడిటర్ అనే బాధ్యత పెద్దది. అది ఉన్నది సక్రమంగా పన్ను కట్టించడానికి. ఎగ్గొట్టించడానికి కాదు. ‘మేడమ్.. మీరిలా మాట్లాడితే క్లయింట్లెవరు వస్తారు’ అంటాడు మగ అసిస్టెంటు. చురుకైన కుర్రాడు. ఉన్న ఇద్దరు ఆడపిల్లల కంటే ఈ అసిస్టెంట్ అంటేనే క్లయింట్లకు చనువు. క్లయింట్లకేనా... ఐ.టి ఆఫీసులోని ఆఫీసర్లకు కూడా ఆ కుర్రాడంటేనే మాలిమి. ‘నువ్వు రావయ్యా. అమ్మాయిలను ఎందుకు పంపుతావు’ అంటారు. అమ్మాయిలు కూడా ఈ రంగంలో రాణించాలని ఇద్దరు అసిస్టెంట్లను పెట్టుకున్నప్పుడు ‘మార్చి, ఏప్రిల్‌లలో రేయింబవళ్లు పని ఉంటుంది. వీళ్లు తట్టుకోగలరా? ఒక క్లయింట్ యాన్యువల్ ఆడిటింగ్ కోసం ఓవర్‌నైట్ స్టేకు పిలిస్తే ఈ అమ్మాయిలను పంపగలవా?’ అన్నాడు తండ్రి. పంపొచ్చు. ఎందుకు పంపకూడదు. కాని పంపే వాతావరణం మగవాళ్లు కల్పించారా? కణతల దగ్గర నొప్పి మొదలైంది. బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయితే తప్ప ఈ నొప్పి తగ్గదు. మగ అసిస్టెంట్ వచ్చాడు. ‘మేడమ్... ఒక మాట అంటే ఏమీ అనుకోరుగా’ ‘చెప్పు’ ‘ఐ.టి. ఆఫీసర్సు మీ నుంచి ఫార్మాలిటీస్ ఆశిస్తున్నారు మేడమ్’ ‘అంటే?’ ‘మగ ఆడిటర్స్ అయితే బయటే చాలా జరుగుతుంటాయి మేడమ్. ఐ.టి ఆఫీసర్సు వాళ్లు మార్నింగ్ వాకుల్లో కలుస్తుంటారు. క్లబ్బుల్లో కలుస్తుంటారు. లేదంటే పార్టీల్లో కలుస్తుంటారు. చాలా మాటలు నడుస్తుంటాయ్. ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. మీరు అలా కలవరుగా. అందుకే మన పనులకు ఆఫీసులో కొర్రీలు ఎదురవుతున్నాయ్’ అతడేం చెబుతున్నాడో అర్థమైంది. కట్టాల్సిన ట్యాక్స్ కన్నా ముందు, ఆడిట్ ఫీజు కన్నా ముందు అనఫీషియల్ ఆఫీస్ ఫీజు చెల్లించుకోవాలి. లేకుంటే అంతే. ‘మనల్ని కూడా అడగొచ్చుగా’ అంది. ‘ఆడవాళ్లను ఎలా అడగడమా అని మొహమాట పడుతున్నారు. అలాగని వదిలేయలేకపోతున్నారు. అందుకే మన పని సాగట్లేదు’ ఆడా. మగా. ఇద్దరికీ ఒక్క క్రోమోజోమే తేడా. చిన్న బ్యాలెన్స్ తేడా. అంతమాత్రానికే పురుష ప్రపంచం వేరు స్త్రీ ప్రపంచం వేరు అయిపోయింది. ఇంతలో పక్క క్యూబికల్లో నుంచి చిన్న అరుపు వినిపించింది. అసిస్టెంట్ అమ్మాయి దాదాపు స్పృహ తప్పి పడిపోయింది. ఇంకో అసిస్టెంట్ అమ్మాయి, మగ అసిస్టెంటు, తను కంగారు కంగారుగా అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఉదయం నుంచి ముభావంగా ఉన్నది ఇందుకేనా. ఆరోగ్యం సరిలేకనా? ‘తీవ్రంగా బ్లీడింగ్ అవుతోంది. డిస్ఫంక్షనల్ యుటినర్ బ్లీడింగ్. ఉదయం మొదలై ఉండాలి. ఇప్పటిదాకా హాస్పిటల్‌కి రాకుండా ఏం చేస్తున్నట్టు? నీలాంటి లేడీబాస్ ఉంటేనే చెప్పుకోలేకపోయిందే ఇక మగబాస్ అయితే చచ్చి ఊరుకునేది. ఏం తలరాతలో మనవి’ అంటూ డాక్టర్ ఫ్రెండ్ విసుక్కుంటూ ట్రీట్మెంట్ మొదలెట్టింది. అవును... ఈ తలరాతలు ఎవరు రాశారు? ఇలాంటి అవకతవకల బ్యాలెన్స్ షీట్ ఎవరు తయారు చేశారు. దీనిని సరిచేసేదెవరు? కథ ముగిసింది. చంద్రలత రాసిన ‘ఆవర్జా’ కథ ఇది. అంటే ‘లెడ్జర్’ అని అర్థం. లోకంలో మగవాళ్లు ఉండటం సమస్య కాదు. కాని వాళ్ల మధ్య ఒక బ్రదర్హుడ్ ఉండటం సమస్య. డాక్టర్లంతా ఒక గ్రూప్ అవుతారు. ఐఏఎస్‌లంతా ఒక గ్రూప్ అవుతారు. లాయర్లంతా ఒక గ్రూప్ అవుతారు. ఆడిటర్లు... జర్నలిస్టులు... ప్రొఫెసర్లు... పొలిటీషియన్లు... వీళ్ల మధ్య మతలబులు నడుస్తుంటాయి. ఆ మతలబులకు ఆడవాళ్లు అడ్డం. అందుకని వాళ్లను రానివ్వరు. పోనీ వాళ్ల దారిన వాళ్లను పోనివ్వరు. మగవాళ్లే ఇటుకలుగా మారి అన్ని చోట్లా ఆడవాళ్లకు ప్రవేశం లేకుండా గోడలు కట్టి ఉన్నారు. కాని ఆడవాళ్లు ఊరుకోరు. సంకల్పం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ అనే గునపాలతో ఆ గోడలను కూల్చి అవతల పారేస్తారు. తథ్యం. - చంద్రలత -
ఫారో మార్కు ప్రజాస్వామ్యం
ఈజిప్ట్ సైనిక నియంత అల్ సిసీ అధ్యక్ష ఎన్నికల్లో నిలవబోతున్నారు. ప్రత్యర్థులే లేని ఆ ఎన్నికల్లో ఆయన గెలుపు తథ్యం. ప్రజాస్వామ్య పరివర్తనకు నాంది పలుకుతానంటున్న సిసీ భావప్రకటనా స్వేచ్ఛపై పంజా విసిరారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య తేడా ఎంత? దుస్తులు మార్చుకున్నంత. ఈజిప్టు ‘దుస్తులు’ మార్చుకోబోతోంది. సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ అబ్దెల్ అల్ ఫతా అల్ సిసీ ఏప్రిల్‌లో పౌర దుస్తులు ధరించడంతో ఈజిప్టు ప్రజాస్వామ్య దేశంగా మారిపోతుంది. సంశయజీవులు మయన్మార్ నిన్నగాక మొన్న దుస్తులు మార్చి ప్రజాస్వామ్య పరివర్తనను సాధించిన వైనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే సరి. నాటకీయత లేని రాజకీయాలు రక్తి కట్టవు. ‘అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ప్రజాభీష్టాన్ని తిరస్కరించజాలను’ అని సిసీ బుధవారం కువైట్ పత్రిక ‘అల్ సియాసా’తో అన్నారు. అలా అయన అన్నా, దాని అర్థం ఆ పత్రిక ప్రచారం చేసినట్టు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పినట్టు కాదని ఆయన ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనరని చెప్పలేదు. ఏప్రిల్ మధ్యలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల్లో సిసీ పోటీ చేయాలని అత్యున్నత సైనిక మండలి గత నెల 27న తీర్మానించింది. దాన్ని ఆయన శిరసావహించక తప్పదు. మండలి అధిపతి ఆయనే. రాజకీయ ప్రవేశానికి మొదటి అర్హత... అన్నది అనలేదంటూ పాత్రికేయులను అబ ద్దాలకోర్లుగా రుజువు చేయడం. సిసీ ఆ అర్హతను సాధించారు. గత నెల 19న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో సిసీ మార్కు రాజ్యాంగం 98.1 శాతం ఓట్లతో ఆమోదం పొందింది. మూడు కోట్లకు పైబడిన ఓటర్లలో 38.6 శాతమే ఓటింగ్‌లో పాల్గొన్నారనేది, 60 శాతం ఓటర్లయిన 18-40ల మధ్య వయస్కులు పోలింగ్ బూత్‌ల మొహం చూడలేదనేది వాస్తవమే. అంత మాత్రాన అది ‘ప్రజామోదం’ కాకపోదు. ఆ రాజ్యాంగం ప్రకారం సిసీ సైనిక మండలి అధ్యక్ష పదవిని, రక్షణమంత్రి పదవిని వదులుకోకుండానే సింహాసనం ఎక్కేయవచ్చు. ప్రజాస్వామ్యం దుస్తులు మార్చడం అయిన చోట ఎన్నికలు తప్పనిసరి తద్ధినం కాక మరేమవుతాయి? ఇదంతా ఒక ప్రహసనమని నిషిద్ధ ‘ఉగ్రవాద సంస్థ’ ముస్లిం బ్రదర్ హుడ్ హేళన చేసినంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాకుండా పోదు. బ్రదర్హుడ్ నేత, మాజీ అధ్యక్షుడు, తాజా ‘ఉగ్రవాది’ మొహ్మద్ ముర్సీ 2012లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 33 శాతం ఓటర్లే పాల్గొన్నారు. వారిలో 64 శాతం మాత్రమే ఆయన రాజ్యాంగానికి అవునన్నారు! అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటి వాడు విప్లవం మొదట్లోనే హోస్నీ ముబారక్ పాలనను ‘అరబ్బు తరహా ప్రజాస్వామ్యం’గా అభివర్ణించారు. సరిగ్గా మూడేళ్లకు ఈజిప్ట్ అక్కడికే చేరిందంటే అది ఆయన చాణక్యమే. నాటి విప్లవంలో ప్రజాస్వామ్య యువత, వామపక్ష ట్రేడ్యూనియన్లతో భుజం కలిపి సాగిన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను వారి నుంచి వేరు చేసినది అమెరికాయే. అధికారం ఆశజూపి లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య పక్షాలన్నీ బహిష్కరించిన పార్లమెంటు ఎన్నికల్లో ముర్సీ పాల్గొనేలా చేశారు. సైనిక మండలికి అధికారాలను కట్టబెట్టి అమెరికా నాడు మొహ్మద్ హుస్సేన్ తంత్వానీకి పగ్గాలను అప్పగించింది. నామమాత్రపు అధికారాలే ఉన్న ముర్సీ తంత్వానీని తొలగించి, ఏరికోరి (2012) సిసీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఓటర్లలో మూడింట ఒక వంతు మద్దతే ఉన్న బ్రదర్‌హుడ్‌కు రాజకీయ గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించారు. సిసీనే నమ్ముకున్నారు. ‘బ్రదర్హుడ్ ఫీల్డ్ మార్షల్’ సిసీ... ముర్సీనే కటకటాల పాలుచేసి, బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 20 వేల మందిని నిర్బంధించారు. అమెరికా మిత్రభేదం ఫలించింది. ఇతర పక్షాలేవీ మాట్లాడలేదు. పైగా నాడు సిసీని ‘హీరో’గా భావించాయి. నాటి లౌకికవాద హీరో ఇప్పుడు ‘ఉగ్రవాద వ్యతిరేక హీరో’గా రూపాంతరం చెందారు. అల్ సియాసాతో మాట్లాడుతూ ఆయన... గల్ఫ్ సహకార మండలి ఉగ్రవాదాన్ని (బ్లాక్ టై) నిర్మూలించడానికి సహకరించాలని కోరారు. ఆయన అడగకుండానే సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల కోట్ల నిధులను కుమ్మరించాయి. ‘ఉగ్రవాదం’పై పోరుకు ముందు షరతు ఎప్పుడూ ‘పంచమాంగ దళమే’... అంటే పత్రికలే. సిసీ అధికారంలోకి వచ్చినవెంటనే తమకు తామే కళ్లూ, చెవులు, నోళ్లు మూసేసుకోవడం స్థానిక పత్రికలు అలవరుచుకున్నాయి. ‘అల్‌జజీరా’కు ఆ ఇంగితం లేకపోయింది. ఫలితం అనుభవిస్తోంది. నలుగురు విదేశీయులు సహా 20 మంది పాత్రికేయులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘అన్సర్ అల్ మక్దిన్’ అనే అల్‌కాయిదా అనుబంధ సంస్థ గత పదిహేను రోజుల్లోనే కైరోలో కారుబాంబు పేలుడుకు, సినాయ్‌లో ఒక సైనిక హెలికాప్టర్ కూల్చివేతకు, ఒక పోలీస్ జనరల్ హత్యకు పాల్పడింది. ఆ సంస్థకు సౌదీ మద్దతున్నది కాబట్టి అది ఉగ్రవాద సంస్థ కాదు, దానిది ఉగ్రవాదం కాదు. అభినవ ఫారో ప్రజాస్వామ్యంతో పీనుగుల పిరమిడ్లను నిర్మించనున్నారు. - పి. గౌతమ్