brothers killed
-
కూలీలపై ఘాతుకం
రెక్కలు ముక్కలు చేసుకున్నాడు.. అన్నపానీయాలు మాని ఒళ్లు కూడా హూనం చేసుకున్నాడు.. నిద్రాహారాలు మాని యజమాని చెప్పిన పనులన్నీ చేశాడు.. జబ్బు చేయడంతో ట్రాక్టర్ తోలడానికి వెళ్లలేకపోయాడు.. డబ్బులిస్తే జబ్బు నయం చేసుకుంటానని యజమానిని అభ్యర్థించాడు.. తన పని కాలేదని అతనుకోపం పెంచుకున్నాడు.. డబ్బులడుగుతావా..? అంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు.. అంతటితో ఆగక బైక్‌పైవెళ్తున్న అన్నదమ్ములను అతి కిరాతకంగా ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దాష్టీకంమదనపల్లె మండలంలో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యేనవాజ్బాషా పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మదనపల్లె టౌన్ : కూలి డబ్బు ఇవ్వాలని అడిగితే కనికరించకపోగా కూలీలను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్‌తో గుద్ది చంపేసిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. ఈ ఘటనతో బిడ్డల రెక్కల కష్టంతో బతుకుతున్న రెండు పేద కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ విషాదకర సంఘటనపై రూరల్ ఎస్ఐ దిలీప్ కుమార్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం మొలకలదిన్నెకు చెందిన దంపతులు గంగులప్ప, పార్వతమ్మలది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు హరికుమార్(32) బసినికొండ చంద్రానాయక్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో పాటు భార్య రెడ్డెమ్మ పిల్లలు స్వర్ణలత(9), సుదర్శన్(5), యశ్వంత్ సాయి(3)లను పోషించుకుంటున్నాడు. పక్కనే నివాసం ఉంటున్న హరికుమార్ పినతండ్రి గంగులప్ప రెండో కుమారుడు నాగభూషణం(18)ది కూడా నిరుపేద కుటుంబం. ఇతన్ని కూడా హరికుమార్ తనవెంట కూలి పనులకు చంద్రానాయక్ వద్దకే తీసుకుపోయేవాడు. అయితే రెండు వారాలక్రితం మరో బండికి వెళ్లిన హరికుమార్, నాగభూషణంలకు ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ డబ్బులు ఇవ్వకుండా మొండిచేయి చూపాడు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్సల నిమిత్తం డబ్బు అవసరమై, అన్నదమ్ములు ట్రాక్టర్ యజమాని వద్దకు వెళ్లిడబ్బులు అడిగారు. అతడు ఇవ్వకపోగా, కూలీలపైనే గొడవకు దిగాడు. తాను డబ్బులిచ్చేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని హెచ్చరించి పంపేశాడు. చేసేదిలేక వారు ఎస్టేటుకు చేరుకుని చంద్రానాయక్ ట్రాక్టర్లో ఇసుకను మదనపల్లెకు తరలిస్తుండగా నిలదీశారు. దీంతో ఆగ్రహించిన చంద్రానాయక్ ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరినీ వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌తో ఢీకొన్నాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కుటుంబ పోషణకు ఆధారంగా ఉన్న బిడ్డల మృతితో మొలకలదిన్నెలో రెండు పేద కుటుంబాల్లో విషాదం అలుముకుంది. అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబాలు వీధినపడ్డాయి. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ ట్రాక్టర్ యజమాని దాష్టీకంతో ప్రాణాలు కోల్పోయిన కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే నవాజ్ బాషా పరామర్శించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలోని కూలీల మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. సంఘటనకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
నడిరోడ్డుపై అన్నదమ్ముల కాల్చివేత
లక్నో : తమతో గొడవకు దిగారన్న కోపంతో! కక్ష్య గట్టిన కొంతమంది ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు. రోడ్డుపై వెళుతున్న కారును ఆపుచేసి అందులో ఉన్న అన్నదమ్ములను విచక్షణా రహితంగా కొట్టి తుపాకులతో కాల్చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్నోకు చెందిన ఇమ్రాన్ అలి, అర్మాన్ అలి అన్నదమ్ములు. వీరిద్దరూ క్యాబ్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వీరికి అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులతో గొడవ జరిగింది. ఆ తర్వాత ఆరుగురు.. ఇమ్రాన్, అర్మాన్‌ల ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి క్యాబ్‌లో వస్తున్న వీరిని నడిరోడ్డుపై అడ్డగించిన దుండగులు విచక్షణా రహితంగా కొట్టి నాటు తుపాకులతో కాల్చి చంపారు. గొడవ జరుగుతున్న సమయంలో కారులో ఉన్న ఇమ్రాన్, అర్మాన్‌ల మిత్రుడు నిశాంత్ అక్కడి నుంచి పారిపోయి వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యతో సంబంధం ఉన్న ‘‘చోటు’’ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. -
గొంతుకోసి.. గుండెల్లో పొడిచి..
నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. పాత కక్షలతో అన్నదమ్ములైన ఇద్దరు యువకులను నడిరోడ్డుపై తల్వార్లతో దాడి చేసి దారుణంగా హత్య చేయడంతో కలకలం రేగింది. హమాల్వాడీకి చెందిన అన్నదమ్ములైన బద్రి పవన్ కల్యాణ్ యాదవ్ అలియాస్ బబ్లూ (30), నర్సింగ్ యాదవ్ అలియాస్ కన్నా (28 )లను మరో ఇద్దరు యువకులు దారుణంగా కత్తితో పొడిచి చంపారు. నగరంలోని మూడో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ యాదవ్ ఛాతీపై దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. పవన్ గొంతులో పొడవడంతో ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అతన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ప్రేమ్‌కుమార్ సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా అతనిపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రేమ్‌కుమార్‌కు తలకు గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకుని సమీపంలోని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు సమాచారాన్ని అందజేశాడు. ఈ దారుణానికి పాల్పడింది హమాల్వాడీకి చెందిన తల్వార్ సాయి, రంజిత్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తల్వార్‌సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాత కక్షలే కారణం పాత కక్షలతో ఈ యువకులిద్దరూ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా గొడవలు జరిగాయి. గతంలో ఓ పుట్టినరోజు వేడుకలో, మరోమారు క్రికెట్ బెట్టింగ్ విషయంలో గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ రెండు గ్యాంగ్‌లు ఇప్పటికే పలుమార్లు గొడవలు పడి పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడినట్టు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ కక్షలు ఏకంగా ఇద్దరు యువకుల ప్రాణాల మీదికి తెచ్చినట్లయింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వాహనం ఢీకొని అన్నదమ్ములు మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి జాతీయ రహదారిపై మంగళవారం బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.