‘బృందావన్’పై కలెక్టర్‌కు ఫిర్యాదు
హన్మకొండ అర్బన్ : హన్మకొండ వడ్డేపల్లి సమీపంలో 270 ఫ్లాట్లతో నిర్మించిన బృందావన్ అపార్ట్మెంట్ కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆరోపించారు. రోడ్డును ఆక్రమించి అపార్ట్మెంట్ నిర్మించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఏర్పాటుచేయడంతో సమస్యలు ఎదురవుతునాయని పేర్కొన్నారు.
ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వడ్డేపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కరుణకు వినతిపత్రం అందజేశారు. అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ విషయంలో విచారణ జరిపి వడ్డేపల్లి ప్రజలు, వాహన దారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. అలాగే, ఇప్పటి వరకు ఆ ప్రదేశంలో జరిగిన ప్రమాదాలను వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కమిటీ ప్రతనిధులు జితేందర్‌రెడ్డి, బిక్షపతి, శ్రావణ్‌కుమార్, హరికృష్ణ తదితరులు ఉన్నారు.