brutal murder woman
-
వివాహితను కర్కశంగా నరికి చంపిన ఆటో డ్రైవర్
పొందూరు: మండలంలోని తాడివలస సమీపంలో చిన్న బొడ్డేపల్లి గ్రామానికి చెందిన వివాహిత హత్య మంగళవారం సంచలనం రేపింది. వివాహితను హత్య చేసిన ఆటోడ్రైవర్ ఆమె మృతదేహాన్ని నేరు గా పొందూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..చిన్నబొడ్డేపల్లి గ్రామానికి చెందిన అచ్చయ్య, రాజులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అమలాపురపు రాజేశ్వరి భర్త గుప్తేశ్వరరావు మూడేళ్ల కింద ట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుమార్తెతో పాటు తల్లిదండ్రులను పోషిస్తున్నారు. రెండు నెలల కిందట బొడ్డేపల్లి రైల్వేట్రాక్ పనులకు వచ్చిన నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన ఆముజూరు గోపాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్రామంలోనే వారిద్దరూ తరచూ కలిసేవారు. మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి వెళ్లడానికి సిద్ధమైన రాజేశ్వరి గోపాల్‌కు ఫోన్ చేసింది. గోపాల్ ఆటోపై చిన్నబొడ్డేపల్లికి వచ్చాడు. ఆటోలో ఇద్దరూ వాల్తేరుకు బయ లుదేరారు. అయితే తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. గోపాల్ తనతో తెచ్చుకున్న చాకుతో రాజేశ్వరి మెడపై పలుమార్లు దాడిచేశాడు. దీంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన రాజేశ్వరిని గోపాల్ తన ఆటోలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. ఆమదాలవలస సీఐ దివాకర్‌యాదవ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు అచ్చయ్య, రాజు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశారు. హత్య చేసిన గోపాల్‌తో కలి సి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
ఏడాదిన్నరగా ప్లాస్టిక్ డ్రమ్ములోనే మృతదేహం
అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖపట్నం మధురవాడలోని వికలాంగుల కాలనీలో ప్లాస్టిక్ డ్రమ్ములో పుర్రె, అస్తిపంజరం బయటపడిన కేసులో చిక్కుముడి వీడింది. పోలీసుల విచారణలో మృతురాలు శ్రీకాకుళం జిల్లా మోదంటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మి(24)గా గుర్తించారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన దండు రిషివర్ధన్ అలియాస్ కొప్పిశెట్టి రిషివర్ధన్ అలియాస్ రిషిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలో వెల్డింగ్ దుకాణం నడుపుతున్న నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని తన వద్ద పనిచేస్తున్న రిషికి 2020 సెప్టెంబర్‌లో అద్దెకు ఇవ్వగా.. అతడు కొంతకాలంగా అద్దె చెల్లించడం లేదు. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లును మే 2021 నుంచి చెల్లించకపోవడం, బిల్లు ఎక్కువగా వస్తుండటంతో రమేష్ ఆ ఇంటిని చూసేందుకు ఈ నెల 4వ తేదీన వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండగా.. ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇంటి వెనుక తలుపు తీసి ఉండటంతో లోపలకు వెళ్లి చూడగా.. ఓ పక్కన ప్లాస్టిక్ డ్రమ్ము పీవీసీ టేప్‌తో సీల్ చేసి ఉండటం, దుర్వాసన రావటంతో పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి డ్రమ్ము తెరిచిచూడగా.. పుర్రె, అస్థి పంజరం, జుట్టు కనిపించాయి. వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ చున్నీ బిగించి.. డ్రమ్ములో దాచేశాడు నిందితుడు రిషివర్ధన్ తన భార్యతో కలిసి రమేష్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. భార్య గర్భవతి కావటంతో 2021 జనవరిలో తన అత్తగారి ఊరైన శ్రీకాకుళం బల్లిగూడకు కాన్పు నిమిత్తం పంపించాడు. ఆ తరువాత తరచూ భార్యను చూసేందుకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో 2021 మే 29న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం వేచి ఉండగా.. బమ్మిడి ధనలక్ష్మి (24) అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు కలసి ఆటోలో నాతవరం వరకు ప్రయాణించారు. అదే నెల 30న రిషికి ధనలక్ష్మి పలుమార్లు ఫోన్ చేసింది. తన భార్య ఇంటివద్ద లేదని రిషి చెప్పటంతో ధనలక్షి ఆ రోజు రాత్రి అతడి ఇంటికెళ్లింది. వేకువజామున 4.30 గంటల సమయంలో ధనలక్ష్మి రూ.2 వేలు కావాలని డిమాండ్ చేసింది. తన వద్ద 100 రూపాయలే ఉన్నాయని రిషి చెప్పగా.. అతడి భార్య దుస్తులు, టీవీ ఇమ్మని అడిగింది. అందుకు తిరస్కరించగా.. తాను అడిగినవి ఇవ్వకపోతే బయటకు వెళ్లి గొడవ చేస్తానని హెచ్చరించడంతో రిషి కోపంతో ఆమె మెడకు చున్నీ బిగించటంతో ప్రాణం విడిచింది. మృతదేహాన్ని బ్లాంకెట్ ప్లాస్టిక్ జిప్ కవర్లో ప్యాక్ చేసి.. ఇంట్లోని ప్లాస్టిక్ డ్రమ్‌లో దించి మూతను సెల్లో టేప్‌తో మూసివేశాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయి తన సెల్‌ఫోన్‌ను 13 రోజులు స్విచ్ఛాఫ్ చేసి ఉంచాడు. ఆ తరువాత ఇంటిని ఖాళీ చేసిన రిషి వెల్డింగ్ షాపులో పని కూడా మానేసి తన అత్తగారింటికి వెళ్లిపోయాడు. ఇలా దొరికాడు ఘటనా స్థలంలో మృతురాలు ధనలక్ష్మికి చెందిన బ్యాగ్ లభించగా.. అందులో రిషి ఫోన్ నంబర్ రాసి ఉన్న ఓ స్లిప్ దొరికింది. కాల్ లిస్ట్ ఆధారంగా ఘటన జరగడానికి ముందు మృతురాలి నంబర్ నుంచి అతడి నంబర్‌కు ఫోన్లు రావడాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి మృతురాలి వివరాలతోపాటు నిందితుడిని గుర్తించారు. ధనలక్ష్మికి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎవరూ లేకపోవటంతో ఆమె కనిపించడం లేదని ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా.. అతడు 6 నెలలుగా కొమ్మాదిలోని ఒక హాస్టల్లో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కేసు ఛేదించినట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. -
మహిళ దారుణ హత్య
మోత్కూరు ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మోత్కూరు మండలం పాటిమట్లలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన పసునూరి సావి త్రమ్మ(46) ఒంటరిగా చిరుదుకాణం నడుపుకుంటూ జీవనం సాగి స్తోంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. దినపత్రికల కట్టలను చూసి.. సావిత్రమ్మ చిరుదుకాణంతో పాటు వివిధ దినపత్రికల ఏజెన్సీ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. బుధవారం పొద్దుపోయినా దినపత్రికల బండిల్స్ ఇంటి ఆ వరణలోనే ఉండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడ గా హత్యోదంతం విషయం వెలుగులోకి వచ్చింది. ఒంటిమీది ఆభరణాలు మాయం రక్తపు మడుగులో ఉన్న సావిత్రమ్మ మృతదేహాన్ని ఇరుగుపొరుగు వారు చూసి సమాచారం ఇవ్వడంతో గ్రా మస్తులంతా గుమిగూడారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ మె ఒంటిపై ఉన్న పుస్తెలతాడు, చెవి కమ్మలు కనిపిం చలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ప్లాస్టిక్ వైరు తో ఉరివేసి చంపి ఆభరణాలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. గొంతుకు ఉరివేయడంతో ముక్కులో నుంచి రక్తస్రావం అయినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గ్రామస్తుల సమాచారం మేరకు రామన్నపేట ఇన్చార్జ్ సీఐ కె.శివరాంరెడ్డి తన సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతానికి గల కారణాలను స్థా నికులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీంతో ఘ టన స్థలంలో ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌తో తని ఖీలు నిర్వహించగా గ్రామమంతా తిరిగి చివరకు సావి త్రమ్మ ఇంటిముందుకు వచ్చి ఆగిపోయాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు పసునూరి రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పురేందర్బట్ తెలిపారు. తెలిసిన వారి పనేనా..? సావిత్రమ్మను తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిరిగా నివసిస్తున్న సావిత్రమ్మ దుకాణం, పేపర్ ఏజెన్సీ నిర్వహిస్తూ బాగానే కూడబెట్టిందని గ్రామంలో ప్రచారం ఉంది. గతంలోనూ ఆమె ఇంట్లోకి మూడు సార్లు దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సావిత్రమ్మ ఇంట్లో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించగా సావిత్రమ్మ గుర్తుపట్టి కేకలు వేసింది. ఈ విషయం పెద్ద మనుషులలో పంచాయితీ పెట్టగా ఆ వ్యక్తిని మందలించి వదిలేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆనేపథ్యంలోనే చోరీకి యత్నించడంతో సావిత్రమ్మ ప్రతిఘటించడంతోనే హత్య చేసి ఆభరణాలతో ఉడాయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి