మోత్కూరు ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మోత్కూరు మండలం పాటిమట్లలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన పసునూరి సావి త్రమ్మ(46) ఒంటరిగా చిరుదుకాణం నడుపుకుంటూ జీవనం సాగి స్తోంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది.
దినపత్రికల కట్టలను చూసి..
సావిత్రమ్మ చిరుదుకాణంతో పాటు వివిధ దినపత్రికల ఏజెన్సీ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. బుధవారం పొద్దుపోయినా దినపత్రికల బండిల్స్ ఇంటి ఆ వరణలోనే ఉండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడ గా హత్యోదంతం విషయం వెలుగులోకి వచ్చింది.
ఒంటిమీది ఆభరణాలు మాయం
రక్తపు మడుగులో ఉన్న సావిత్రమ్మ మృతదేహాన్ని ఇరుగుపొరుగు వారు చూసి సమాచారం ఇవ్వడంతో గ్రా మస్తులంతా గుమిగూడారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ మె ఒంటిపై ఉన్న పుస్తెలతాడు, చెవి కమ్మలు కనిపిం చలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ప్లాస్టిక్ వైరు తో ఉరివేసి చంపి ఆభరణాలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. గొంతుకు ఉరివేయడంతో ముక్కులో నుంచి రక్తస్రావం అయినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
గ్రామస్తుల సమాచారం మేరకు రామన్నపేట ఇన్‌చార్జ్ సీఐ కె.శివరాంరెడ్డి తన సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతానికి గల కారణాలను స్థా నికులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీంతో ఘ టన స్థలంలో ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌తో తని ఖీలు నిర్వహించగా గ్రామమంతా తిరిగి చివరకు సావి త్రమ్మ ఇంటిముందుకు వచ్చి ఆగిపోయాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు పసునూరి రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పురేందర్‌బట్ తెలిపారు.
తెలిసిన వారి పనేనా..?
సావిత్రమ్మను తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిరిగా నివసిస్తున్న సావిత్రమ్మ దుకాణం, పేపర్ ఏజెన్సీ నిర్వహిస్తూ బాగానే కూడబెట్టిందని గ్రామంలో ప్రచారం ఉంది. గతంలోనూ ఆమె ఇంట్లోకి మూడు సార్లు దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సావిత్రమ్మ ఇంట్లో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించగా సావిత్రమ్మ గుర్తుపట్టి కేకలు వేసింది. ఈ విషయం పెద్ద మనుషులలో పంచాయితీ పెట్టగా ఆ వ్యక్తిని మందలించి వదిలేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆనేపథ్యంలోనే చోరీకి యత్నించడంతో సావిత్రమ్మ ప్రతిఘటించడంతోనే హత్య చేసి ఆభరణాలతో ఉడాయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
మహిళ దారుణ హత్య
Published Thu, May 12 2016 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement
Advertisement