BSF jawan kill
-
జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారుఘటనా స్థలంలో స్థానికులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ పోలింగ్ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్ 25న జరగనుంది. -
అవసరమైతే అమిత్ షాతో మాట్లాడుతాం
కోల్‌కతా: బంగ్లాదేశ్ జలాల్లోకి అక్రమంగా వెళ్లినందుకు గురువారం అరెస్టయిన భారతీయ మత్స్యకారుడిని నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవల ఒక బీఎస్ఎఫ్ జవాన్‌ను ఓ బంగ్లాదేశీ సరిహద్దు భద్రతా బలగాలు తుపాకీతో కాల్చిచంపడం ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అవసరమైతే దీనిపై తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతానని వెల్లడించారు. ‘బలగాల మధ్య సమన్వయలోపం కారణంగానే సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ విజయ్ సింగ్ మరణానికి దారి తీశాయి’ అని అసదుజ్జమాన్ చెప్పారు. -
సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. భారత్ జవాన్ మృతి
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. పాక్ సైనికులు జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో బీఎస్ఎఫ్కు చెందిన పెట్రోల్ పార్టీపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సిఉంది.