పాక్ దుస్సాహసం
శ్రీనగర్: పాకిస్థాన్ సైన్యం మరోదుస్సాహసానికి ఒడిగట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కి సరిహద్దు వెంబడి ఉన్న ఆరు ఔట్ పోస్టులపై మోర్టార్ షెల్స్, తుపాకి గుండ్ల వర్షం కురిపించింది. దీనికి బీఎస్ఎఫ్ కూడా ధీటుగా జవాబు చెప్పింది.
కాగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నోవ్గావ్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతిచెందాడు.మరణించిన జవాన్ అభిజీత్ నంద్యా 119వ బెటాలియన్ కు చెందినవాడని ఉన్నతాధికారులు చెప్పారు.