Btec students
-
బీటెక్ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..
సాక్షి, సంగారెడ్డి: సరదాగా థార్ వాహనం తీసుకొని వెళ్లగా లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలో సోమవారం వేకువజాము చోటుచేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎస్ఐ అసిఫ్ అలీ కథనం ప్రకారం.. చందానగర్ వాసి షేక్ యాహియా అలియాస్ అంఫాల్ (20), బోడపాటి ప్రణీత్ (23), సామెల్, సంధ్యాయల సాయికార్తీక్ కలిసి వాహనంలో అటువైపు నుంచి కంకోల్కు వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వెహికల్ మద్దికుంట శివారు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సమీపంలోకి రాగానే ముందున్న లారీ ఎడమ నుంచి ఒక్కసారిగా కుడి వైపునకు దూసుకు వచ్చి ఢీకొంది. కాగా వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాహియా, ప్రణీత్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరికి సైతం తీవ్రగాయాలు కాగా హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు మృతులు, సామెల్.. బీబీఏ, సంధ్యాయల సాయి కార్తీక్ బీటెక్ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. ఇవి చదవండి: తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై.. -
రోడ్డు ప్రమాదం: ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆదిభట్లలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను వెనుక నుంచి వస్తున్న టిప్పర్ డీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది. -
సాగర్ హైవే పై ప్రమాదం: బీటెక్ విద్యార్థి మృతి
హైదరాబాద్: నగర శివారులోని సాగర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున సాగర్ రహదారి పై సాగర్ కాంప్లెక్స్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. శ్రీ దత్తా ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న భరత్(22), శివ(23) ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా.. శ్రీ ఇందు కళాశాలకు చెందిన బస్సు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందగా శివకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
హైదరాబాద్: బీటెక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని హయత్ నగర్ లో చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లోని అన్నమాచార్యఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నపోలీసులుకు సమాచారం అందింది. విద్యార్థులు నారాయణ కాలేజి పరీక్ష కేంద్రంలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. కానీ సోమవారం తమ ఇళ్లకు పరీక్ష పత్రాలను తీసుకెళ్లి ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు.. దాడి చేసి ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ పోలీసులకు విద్యార్థులను అప్పగించారు.