
హైదరాబాద్: నగర శివారులోని సాగర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున సాగర్ రహదారి పై సాగర్ కాంప్లెక్స్ వద్ద బుధవారం చోటు చేసుకుంది.
శ్రీ దత్తా ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న భరత్(22), శివ(23) ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా.. శ్రీ ఇందు కళాశాలకు చెందిన బస్సు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందగా శివకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment