Budda Raja shekar reddy
-
బుడ్డా గారి.. చెడ్డ మాటలు
-
ఓటుకు 5-10 వేలు.. టీడీపీ ఎరను తిప్పికొట్టిన వాలంటీర్..
-
ఏ ఒక్క హామీని నెరవేర్చని ఘనుడు ఆయన
సాక్షి, ఆత్మకూరు (కె) : నాలుగేళ్ల చంద్రబాబు పాలన వంచన మయమని వైఎస్సార్సీపీ నేత శిల్పాచక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట తప్పడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. నాలుగేళ్లలో అభివృద్ధి శూన్యమని, పాలన గాలికొదిలేసి ప్రజలను దోచుకోవడమే టీడీపీ సర్కార్ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ఘనుడని చంద్రబాబుపై వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. మోసానికి, వంచనకు మారుపేరు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. నాయీ బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వైఖరి సరికాదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నాయీ బ్రాహ్మణులను ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారికి పార్టీ అండగా ఉంటుందని చక్రపాణి రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు చారిత్రాత్మకమని, ఎంపీలు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు. 14 నెలల ముందు పదవులను తృణ ప్రాయంగా వదులుకున్న ఘనత తమ పార్టీ ఎంపీలదని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే కేంద్రం దిగొచ్చేదని, కానీ స్వప్రయోజనాలకోసం టీడీపీ ముందుకు రాలేదంటూ మండిపడ్డారు. శ్రీశైలం ఫిరాయింపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని శిల్పా ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలో కమిషన్లు ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ప్రజలకు అండగా ఈనెల 30న అనంతపురంలో టీడీపీ వంచనపై వైఎస్సార్సీపీ గర్జన నిర్వహించనున్నట్లు శిల్పా వెల్లడించారు. అదే తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో టీడీపీ సర్కార్ వంచనపై గర్జన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
పోలీసులూ.. తప్పుడు కేసులొద్దు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై కోర్టుల్లో కేసులు వేయనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఏ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉండదనే విషయాన్ని గ్రహించాలన్నారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి మద్దతిచ్చిన ఎంపీటీసీని కిడ్నాప్ చేయించానంటూ తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. స్వయంగా ఎంపీటీసీనే హైకోర్టుతో పాటు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఈ కేసును హైకోర్టు కొట్టివేసిందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని.. తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై తిరిగి కోర్టులో ఫిర్యాదు చేయనున్నట్టు వివరించారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి కేటాయించకుండా గ్రామాలను ఎలా దత్తత తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదాట్లో మునిగి.. ప్రజలను కూడా గోదాట్లో ముంచారన్నారు. గోదావరి పుష్కరాల్లో రూ.1800 కోట్లు ఖర్చు చేసి కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. మంత్రులను పట్టించుకోకుండా వన్ మ్యాన్ షో చేసినందుకే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించకుండా గాడిదలు కాయిస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కర బాధితులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. త్వరలో మండల, గ్రామ కమిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీతో పాటు అనుబంధ కమిటీలను కూడా ప్రకటించామని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. త్వరలో మండల, గ్రామస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. అదేవిధంగా అన్ని అనుబంధ కమిటీలను కూడా మండల, గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా పార్టీని మరింత పటిష్టం చేసి ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించారు. విలేకరుల సమావేశంలో పార్టీ సంయుక్త కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి భరత్‌కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెహమాన్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నారాయణమ్మ, మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టొద్దు
మెజార్టీ లేని చోట అభ్యర్థిని ప్రకటించడంలో ఆంతర్యమేంటి? సొంతింటి వ్యవహారంలా రాజధాని భూమిపూజ కార్యక్రమం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజం సాక్షి, కర్నూలు : నీతికి నిజాయితీకి మారుపేరు.. అంటూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెట్టరాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఎస్వీ రెజెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను దమాషా పద్ధతిలో నిర్వహించాలంటున్న చంద్రబాబు మెజార్టీ లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టడం వెనుక ఆంతర్యమేంటో స్పష్టం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంలేని చోట అభ్యర్థుల్ని నిలబెట్టడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అత్యధికంగా వైఎస్సార్సీపీ మద్ధతులో గెలిచిన వారేనని, వారిలో కొందర్ని ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్నారని విమర్శించారు. రాజధాని భూమిపూజకు శాసనసభ్యులకు సమాచారం ఇవ్వలేదని, రాజధాని అంటే ఆయన సొంతింటి వ్యవహారం కాదని ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మణిగాంధీ, మాజీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి డి. వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగం నేత రాజావిష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరే పార్టీకి ఓటేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు వైఎస్సార్సీపీకి రుణం తీ ర్చుకునే అవకాశం వచ్చిందని కర్నూలు ఎమ్మె ల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ తరపున గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థికి కాకుండా వేరొక పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి విషయంలో ప్రజాస్వామ్య బద్ధంగా జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించాకే అధినేత జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటేశ్వరరెడ్డిని ప్రకటించారని చెప్పారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఏకంగా రూ. 90 కోట్లు వెచ్చించడానికి సిద్ధపడిన టీడీపీ నాయకులు జిల్లాలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారోనన్న అనుమానాలున్నాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరుతామన్నారు. - ఎస్వీ మోహన్‌రెడ్డి -
సంక్షేమ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం
ఆత్మకూరు రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆ పార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శ్రీపతిరావుపేట గ్రామంలో వారు గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చే శారు. ఆ పథకాలు మళ్లీ అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాఆలని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తామని అన్నారు. వికలాంగులకు రూ.500ల నుంచి రూ.700ల వరకూ, వృద్ధులకు రూ.500లు పింఛన్లు ఇస్తామన్నారు. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్, టీడీపీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, ఆ పార్టీల నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ తిరుపమయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శివారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు జయకృష్ణ, మండల బీసీ సెల్ కన్వీనర్ గోకారి, నాయకులు నాగూర్‌ఖాన్, యుగంధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, జక్కామురళి, తిమ్మయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీపీ శ్రీపతిరావుపేటలో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీపీ మహేశ్వరయ్య ఆధ్వర్యంలో 600 మంది బుడ్డా సోదరుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరుపై విసుగు చెందానన్నారు. దివంగత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాయన్నారు. ఈ పథకాల అమలు జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమనే నమ్మకంతో బుడ్డా సోదరుల సమక్షంలో పార్టీలో చేరామన్నారు. ఇలా ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడుతుండడంతో ఆ పార్టీకి మండలంలో బలం తగ్గుతోంది. పార్టీలో చేరిన వారి రిటైర్డు ఎస్ఐ వెన్నా శేషిరెడ్డి, గ్రామ సర్పంచు మురహరి కళావతమ్మ, శంకర్, జె.పరమేశ్వరయ్య, ఉపసర్పంచు చిన్న సిద్దయ్య, రిటైర్డు ఫారెస్టర్ ముర్తుజా తదితరులున్నారు.