The budget session of Parliament
-
22న స్పీకర్ అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఫిబ్రవరి 22న భేటీ కానున్నారని బుధవారం పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆమె వారికి విజ్ఞప్తి చేయనున్నారని తెలిపాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(రెండో సవరణ) బిల్లు సహా పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 27న ఎకనమిక్ సర్వే, 28న బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు. సమావేశాలు మే 8తో ముగుస్తాయి. -
ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్
వచ్చే నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం తొలి రెండు రోజుల్లో రాష్ర్టపతి ప్రసంగం, చర్చ, ధన్యవాద తీర్మానం 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే నివేదిక సమర్పణ న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. 28న సాధారణ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారమైనప్పటికీ పార్లమెంట్ ప్రత్యేకంగా భేటీకానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారు. అంతకుముందు రోజు, అంటే ఫిబ్రవరి 27న ఆర్థిక సర్వే నివేదికను, 26న రైల్వే బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెడుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఇక్కడ సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ షెడ్యూల్‌ను రాష్ర్టపతి ఆమోదం కోసం సిఫారసు చేసింది. సాధారణంగా ఫిబ్రవరి ఆఖరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. చివరి రోజు శనివారం అవుతున్నందున అదే రోజున బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, గతంలో కూడా దీన్ని పాటించారని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జరగనున్న తొలి పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. అనంతరం దీనిపై చర్చ, ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో వీటిని చేపడతారు. ఈ తొలి విడ త బడ్జెట్ సమావేశాలు మార్చి 20 వరకు కొనసాగుతాయి. నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్ 20 నుంచి రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఈ విరామ సమయంలో వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్లను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. వాటికి నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి. మే 8తో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం ప్రయత్నించనుంది. బొగ్గు-గనులు, ఖనిజాలు, ఇ-రిక్షాలు, పౌరస్మృతి చట్ట సవరణ, భూసేకరణ, బీమా రంగంలో విదేశీ నిధులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం తెచ్చేందుకు సర్కారుపై తీవ్ర ఒత్తిడి ఉంది. కాగా, హడావుడిగా ఆర్డినెన్స్‌లు తేవడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ల వివరాలను పార్లమెంట్లో వెల్లడిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తొలి విడతలో 26 రోజులపాటు, మలివిడతలో 19 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం 66 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
27 రోజులు.. 13 బిల్లులు
ఉభయ సభలు నిరవధిక వాయిదా సమావేశాలను విజయవంతంగా ముగించిన మోడీ సర్కారు న్యూఢిల్లీ: దాదాపు నెల రోజుల పాటు కొనసాగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం ఉభయసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలిసారిగా బడ్జెట్ సమావేశాలను ఎదుర్కొన్న ప్రధాని నరేంద్రమోడీ సర్కారు సభలకు అంతరాయం కలగకుండా, స్వల్ప వాయిదాలతో విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలో మారిన రాజకీయ వాతావరణాన్ని ఇవి ప్రతిబింబించాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు 167 గంటల పాటు కొనసాగగా గతేడాది యూపీఏ సర్కారు హయాంలో 19 గంటల 36 నిమిషాలే నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌తోపాటు రైల్వే బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ఆమోదించారు. జాతీయ జ్యుడీషియల్ కమిషన్ నియామక బిల్లు, సెబి తదితర బిల్లులను ఆమోదించారు. ట్రాయ్ మాజీ చీఫ్ నృపేంద్ర మిశ్రాను ప్రధాని ముఖ్య కార్యదర్శిగా నియమించటంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను ఈ సమావేశాల్లోనే అధిగమించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీ బడ్జెట్‌ను కూడా పార్లమెంట్ ఆమోదించింది.బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో 13 బిల్లులు ఆమోదం పొందాయి.లోక్‌సభ సమావేశాలు 167 గంటలపాటు, రాజ్యసభ సమావేశాలు 142 గంటలపాటు జరిగాయి. పార్లమెంట్ 27 రోజుల పాటు సమావేశమైంది.లోక్‌సభ సమావేశాలకు 14 గంటల పాటు అంతరాయం కలిగినా 28 గంటల 10 నిమిషాల పాటు అదనంగా చర్చించటం ద్వారా నష్టాన్ని పూరించింది.వాయిదాలు, అంతరాయాలతో రాజ్యసభ 34 గంటల కాలాన్ని కోల్పోయినా అదనంగా 38 గంటల పాటు పనిచేసింది.