22న స్పీకర్ అఖిలపక్ష భేటీ | Speaker of the all-party meeting on 22 | Sakshi
Sakshi News home page

22న స్పీకర్ అఖిలపక్ష భేటీ

Published Thu, Feb 19 2015 1:50 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM

Speaker of the all-party meeting on 22

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో  ఫిబ్రవరి 22న భేటీ కానున్నారని బుధవారం పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆమె వారికి విజ్ఞప్తి చేయనున్నారని తెలిపాయి.

ఈ సమావేశాల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(రెండో సవరణ) బిల్లు సహా పలు బిల్లులను  సభలో ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 27న ఎకనమిక్ సర్వే, 28న బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు. సమావేశాలు మే 8తో ముగుస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement