Buffollows
-
రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీ
ఉత్తర ప్రదేశ్లోని లఖ్నవూలో విచిత్రమైన ఘటన జరిగింది. ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకుని లబ్ది పొందాలని చూసింది మహిళ. కానీ ఆమె పథకం పారలేదు. గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అసలు స్టోరీ ఏంటంటే..దారిద్ర్య రేఖకు దిగవున ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వారికి ఆర్థికంగా ఊతమివ్వడంతోపాటు, సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు రూ.35 వేల ఆర్థిక సాయం,ఇతర బహుమతులను కూడా ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులతో హసన్పూర్లోని ఒక కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుక కళకళలాడుతోంది. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 300 మందికి పైగా వధూవరులు, వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఊహంచని పరిణామం ఎదురైంది.ఈ పథకాన్ని ఉపయోగించుకొని రూ. 35 కొట్టేయాలని చూసిన అస్మా , ఆమె సమీప బంధువు బావ జాబర్ అహ్మద్తో కలిసి ప్లాన్ చేసింది. బహుమతులలో భాగంగా వచ్చే డిన్నర్ సెట్, వధువు, వరుడి కోసం రెండు జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకుని, బహుమతిగా వచ్చిన నగదుతో రెండు గేదెలను కూడా కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటివారు అక్కడికి చేరుకుని చివరి నిమిషంలో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఈ దొంగ పెళ్లితో వచ్చిన డబ్బులు ద్వారా గేదెలు కొనుక్కోవాలని ప్లాన్ బెడిసి కొట్టింది.అస్మా ఇప్పటికే వివాహం కావడమే ఇందుకు కారణం మూడేళ్ల క్రితమే నూర్ మొహమ్మద్ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్యా ఉన్న గొడవల నేపథ్యంలో 6 నెలల నుండి అమ్మ గారి ఇంట్లోనే ఉంటోంది. వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకుండానే రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించడంతో విషయం తెలిసిన అత్తింటివాళ్లు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆస్మా మామగారు ఆస్మా వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వద్దకు వచ్చి అసలు విషయం అధికారులకు విన్నవించాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. చివరికి ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. దీంతో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసును పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు, అక్రమం, మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డు కున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది. -
గేదెల రుణం : బ్యాంకు సీనియర్ అధికారి అరెస్ట్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేసినందుకు గాను లక్ష రూపాయల లంచం లంచం డిమాండ్ చేశాడు. దీంతో వలపన్నిన సీబీఐ అధికారులు పీఎన్బీ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్, అతని సతీష్ సహచరుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానా, రేవారి జిల్లా కన్వాలి బ్రాంచ్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ అందించిన సమాచారం కుష్పురాలో డెయిరీ యూనిట్ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ .24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది. గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి దశగా రూ.7.92 లక్షలను బ్యాంకు మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు సుమేర్ సింగ్. ఈ మొత్తాన్ని మధ్యవర్తి (ప్రైవేట్ వ్యక్తి) కు అప్పగించాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు. దీంతో అతడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
గేదెలతో రాస్తారోకో
ఎంసెట్–2 రద్దు యోచనను విరమించుకోవాలని డిమాండ్ కాంగ్రెస్ నాయకుల వినూత్న నిరసన ములుగు : రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్–2 రద్దు యోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ములుగులో కాంగ్రెస్ నాయకులు సోమవారం గేదెల గుంపుతో వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంసెట్–2 లీకే జీతో ప్రభుత్వ అధికారులు, మంత్రులకు సంబంధం ఉందని ఆరోపించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, సంబంధిత శాఖల మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఉన్నత స్థాయి అధికారులను ఇప్పటి వరకు బర్తరఫ్ చేయకపోవడ సిగ్గుచేటని అన్నారు. కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేసిన అక్రమానికి మిగతా విద్యార్థులను బలి చేయడం దారుణమని అన్నారు. నిరసన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు బానోతు రవిచందర్, బాబీ, యూనస్, ఎస్.కే.ఉమర్, సర్పంచ్ జంజిరాల దేవయ్య పాల్గొన్నారు. -
దున్నలు దున్నేస్తాయని..
సాధారణంగా చెట్టెక్కే టాలెంట్ చిరుతపులికే సొంతం. కానీ ఇక్కడ సింహానికి ఆ టాలెంట్ను చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. దిగితే దున్నలు దున్నేస్తాయని భయం. కెన్యాలోని మాసాయి మరా జాతీయ పార్కులో ఈ మృగరాజు మాంచి ఆకలి మీద వేటకు బయల్దేరింది. దారిలో అడవి దున్నలు కనిపించాయి. దూడ వాటికి కాస్త దూరంగా ఉండటంతో దాన్ని లటుక్కున పట్టుకుని చటుక్కున పారిపోదామనుకుంది. కానీ సీన్ రివర్సైంది. అడవి దున్నలన్నీ సింహం వైపు దూసుకొచ్చాయి. సింహం దౌడ్ అంటూ పరుగు తీసింది. దున్నలు వదిలితేగా.. దీంతో చేసేది లేక.. చివరికి ఇలా చెట్టెక్కెంది. ఎంతైనా అది చిరుతపులి కాదు కదా.. దీంతో ఎక్కువసేపు ఉండలేక.. కిందకు దూకి.. కాళ్లకు పనిచెప్పింది. ఈ దృశ్యాలను చార్లెస్ కొమిన్ అనే మాజీ సైనికాధికారి తన కెమెరాలో బంధించారు.