బుక్కచెర్లలో ఇద్దరు దారుణ హత్య
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం బుక్కచెర్లలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి సమయంలో అనంతపురం నుంచి బుక్కచెర్లకు వస్తుండగా సదరు వ్యక్తులను ఆగంతకులు అడ్డగించి... హత్య చేశారు. స్థానికులు శుక్రవారం ఉదయం రెండు మృతదేహాలను గమనించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హతులు అశోక్‌రెడ్డి, జయచంద్రారెడ్డిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.