buliding
-
తప్పించుకునే ప్రయత్నంలో అలా చేశాడు..అంతే చివరికి!!
ముంబై: పోలీసుల నంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆత్మహత్యలకు పాల్పడటం లేదా భవనాల మీద నుంచి దూకడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు మరికొంతమంది పోలీసులపైనే దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కానీ ఇక్కోడొక ముంబై వాసి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అసలు విషయంలోకెళ్లితే.. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరానికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్రలోని ముంబైలోని ఒక భవనంపై నుండి పడి మరణించాడు. అయితే ఆ వ్యక్తి ఢిల్లీ పోలీసుల బృందం నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు మృతుడు ముంబైలోని మలాడ్‌లోని ఎవర్‌షైన్ నగర్ నివాసి డేవి రాయ్‌గా గుర్తించారు. అయితే అతనిపై 2017లో ఢిల్లీలో డ్రగ్స్ కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు బృందం స్థానిక పోలీసులను సంప్రదించి రాయ్‌ను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలించే చర్యలు చేపట్టారు. అయితే ఈ బృందం రాయ్ రెసిడెన్షియల్ సొసైటీకి చేరుకుని అక్కడి సొసైటీ వాచ్‌మెన్‌తో కలిసి రాయ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తలుపు తట్టిన ఎటువంటి సమాధానం లేకుండా పోయింది. పైగా నిందుతుడు రాయ్ ఆసుపత్రిలో తాను చనిపోయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో తప్పుడు రిపోర్ట్‌ని కూడా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు రాయ్ తమ నుంచి తప్పించుకునే క్రమంలోనే భవనంపై నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమదవశాత్తు కిందపడి మృతి చెందాడని చెప్పారు. (చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!) -
ర్యాంకు రాలేదనే ప్రాణం తీసుకుంది
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం ఉదయం మయూరి కాంప్లెక్స్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కాచిగూడకు చెందిన యువతి(18)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. జెస్లీస్ భవనంలోని వెళ్లిన దృశ్యాలు, పై నుంచి దూకిన విజువల్స్ మీడియాకు చిక్కాయి. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. -
కూలిన నగరపంచాయతీ భవనం
హుజూరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వానలకు హుజూరాబాద్ నగరపంచాయతీ పాత కార్యాలయ భవనం ముందు వరండా పూర్తిగా కూలింది. గతంలోనే ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో నూతనంగా నిర్మించిన భవనంలో పాలకవర్గం, కొంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని విభాగాలు పాతభవనంలోనే కొనసాగుతున్నాయి. ఎక్కువగా మహిళా సంఘాల సభ్యులు ఈ వరండా కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇది మంగళవారం అర్ధరాత్రి కూలడంతో పెద్ద ప్రమాదం తప్పినటై ్లంది. ఈ భవనాన్ని 1926లో నిజాం ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు సిల్వర్‌జూబ్లీ క్లబ్‌గా కొనసాగింది. 1942 నుంచి 1963 వరకు మున్సిపాలిటీ కార్యాలయంగా ఉండేది. తరువాత 1964లో మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంగా మారింది. 2011లో హుజూరాబాద్ నగరపంచాయతీగా అవతరించిన తర్వాత కొత్త భవనాన్ని నిర్మించారు. పాత భవనంలో కొనసాగుతున్న విభాగాలను నూతన భవనంలోకి మార్చేందుకు చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ వెంటనే చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో సిబ్బందికి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.