హైకోర్టు న్యాయమూర్తులకు సత్కారం
అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోనసీమకు చెందిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులను ఆదివారం ఘనంగా సత్కరించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బులుసు శివశంకరరావు, జస్టిస్ నక్కా బాలయోగి, తమిళనాడు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధర్మారావును న్యాయవాదులు సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. అమలాపురం బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి హైకోర్టు నుంచి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.