400 ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సోమవారం జరిగే నిమజ్జనం కోసం ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే వారికోసం స్పెషల్ సర్వీసులను నడపనున్న ట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. వివిధ రూట్లలో 400 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ బస్సులపై‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే బోర్డులను ఏర్పాటు చేస్తారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఈ సర్వీసులను తిప్పుతారు.
ప్రత్యేక బస్సులు తిరిగే రూట్లు..
దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, మిధాని, ఎల్బీనగర్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, కాచిగూడ నుంచి బషీర్‌బాగ్, సికింద్రాబాద్ నుంచి ఖైర తాబాద్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రిసాలాబజార్, మల్కాజిగిరి, జామై ఉస్మానియా, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, ఉప్పల్ నుంచి ఇందిరాపార్కు వరకు, ఉప్పల్ నుంచి లిబర్టీ టీటీడీ కళ్యాణ మండపం, టోలిచౌకి నుంచి లక్డీకాపూ ల్, బీహెచ్ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, పటాన్చెరు, లింగంపల్లి, బోరబండ, బాచుపల్లి, గాజుల రామారం తదితర ప్రాంతాల నుంచి లక్డీకాపూల్/ఖైరతాబాద్ వరకు 400 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి..
బస్సుల రాకపోకలను పలు ప్రాంతాలకు పరిమితం చేయనున్నారు. సోమవారం ఉదయం 8 నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
చార్మినార్ వైపు వెళ్లే బస్సులను అఫ్జల్‌గంజ్ వరకే పరిమితం చేస్తారు.
కూకట్పల్లి, జీడిమెట్ల, మియాపూర్, బీహెచ్ఈఎల్ రూట్ల నుంచి వచ్చే బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఖైరతాబాద్ వరకే పరి మితం చేస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అర్ధరాత్రి వరకు ఈ రూట్లలో బస్సులను షటిల్స్‌గా ఖైరతాబాద్ వరకు తిప్పుతారు.
మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి లక్డీకాపూల్ వరకు పరిమితం చేస్తారు.
దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, మిధాని ప్రాంతాల నుంచి నాంపల్లి మీదుగా వెళ్లే బస్సులను కోఠి ఉమెన్స్ కాలేజ్ వరకే నడుపుతారు.
బస్సుల సమాచారం..
కోఠి ఉమెన్స్ కాలేజ్
ఫోన్ : 9959226160
రెతిఫైల్ బస్‌స్టేషన్
ఫోన్ : 9959226154