సన్ ఫార్మా మందుల భారీ రీకాల్
ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కి అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. డిప్రెసివ్ డిజార్డర్ చికిత్స లో వాడే బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను భారీ ఎత్తునరీ కాల్ చేస్తోంది.
బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ 50 మి.గ్రా మాత్రలున్న 31, 762 సీసాలను ఉపసంహరించుకోనుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన తాజా ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. డిజల్యూషన్ స్పెసికేషన్స్ సమర్పించడంలో పెయిలైన కారణంగా అమెరికా దేశవ్యాప్తంగా ఈ రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇది క్లాస్ 3రీకాల్ అని నివేదించింది. వీటిని సన్ ఫార్మా కు చెందిన హలోల్ కర్మాగారంలో ఉత్పత్తి చేసినట్టు మాచారం.