Burning effigies
-
సినీ నటుల దిష్టిబొమ్మల దహనం
రాయగడ జిల్లా : చిట్‌పండ్ అక్రమాల్లో పాలుపంచుకున్నారని ఆరోపిస్తూ ఒడియా సినీ నటులు పప్పు పంపం, సిద్ధాంత్ మహాపాత్రో, అనుభవ్, ఆకాశ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. శుక్రవారం రాయగడ జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కపిలాస్ జంక్షన్లో చిట్‌ఫండ్ అక్రమాల్లో భాగస్వాములైన సినీ నటుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ బీజేడీలో ఉంటూ ప్రజల డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నవీన్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. చిట్‌ఫండ్ , గనులు, ఖనిజం, పప్పుధాన్యాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, భూకబ్జాలకు బీజేడీ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేడీ అవినీతి అక్రమాలమయమైందన్నారు. పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నా మాతృభాష రాని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు ఎలా పాలన అందించగలరని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా సభాపతి, భాస్కర నాయక్, హోల్దార్ మిశ్రో, లక్ష్మీపట్నాయక్, శ్రీఫాల్‌జైన్, సుశాంత్ మహరాణా, కె.అశ్వని, తిలక్‌చౌదురి పాల్గొన్నారు. -
భగ్గుమన్న వామపక్షాలు, కాంగ్రెస్
పలుచోట్ల సీఎం, పీఎంల దిష్టిబొమ్మల దహనం కాకినాడ : ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని, ముఖ్యమంత్రుల తీరుపై కాంగ్రెస్, వామపక్షా లు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వారి దిష్టిబొమ్మలను దహ నం చేయడంతో పాటు పలుచోట్ల ధర్నాలు చేశారు. రాజమండ్రిలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పంతం నానాజీ ఆధ్వర్యంలో కల్పనా సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. గోకవరంలో డీసీసీ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు ఆ ధ్వర్యంలో ధర్నా చేశారు. అమలాపురంలో కాంగ్రెస్ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రంపచోడవరంలో కాంగ్రెస్ నేత కె.సుధాకరబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాకినాడలో కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పిఠాపురంలో సీపీఐ నే త కోరాకుల సింహాచలం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పెద్దాపురంలో సీపీఐ నేతలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రామచంద్రపురంలో సీపీఐ, సీపీఎం నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉండవల్లి గోపాలరా వు, ఎన్.రాము, శారదాదేవి, పి.జానకీరాం తది తరులు పాల్గొన్నారు. అమలాపురంలో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో గడియారస్తంభం సెంట ర్లో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజోలులో సీపీఐ నేత దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండపేటలో వామపక్షాల ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఇద్దరు ‘చంద్రుల’ దిష్టిబొమ్మలు దహనం
హైదరాబాద్: ఇద్దరు ‘చంద్రుల’దిష్టిబొమ్మల దహనం ఒకేసారి జరగడంతో బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీ కార్యకర్తలు ఏకకాలంలో పోటా పోటీగా ఈ కార్యక్రమం నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ తెలుగు మహిళలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి గంట తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మహిళా నాయకురాలు పి. విజయారెడ్డి కొద్దిసేపటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకుని అప్పుడే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న తెలుగు మహిళా నాయకురాలు శోభా హైమావతి తన అనుచరగణంతో కలసి నేరుగా ట్రస్ట్ భవన్ వద్దకు వచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్ మహిళలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. ఓ వైపు టీడీపీ, ఇంకోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఖబడ్దార్ అంటూ టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలపై చెప్పులు విసిరారు. కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పులు తగిలాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా పరిస్థితి కొద్దిసేపటి దాకా అదుపులోకి రాలేదు. అదే సమయంలో తెలుగు మహిళ లు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇంకోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీసు వలయాన్ని ఛేదించుకొని ట్రస్ట్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా గంట పాటు ఇక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. చివరకు పోలీసులు అప్రమత్తమై టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది. -
నిరసనల సెగ
►రుణమాఫీపై చంద్రబాబు ►తీరుపై నిప్పులు చెరిగిన అన్నదాతలు ►భీమవరంలో నమూనా ►ప్రజాకోర్టు.. గడ్డిబొమ్మకు ఉరి ►పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం ఏలూరు : రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే మాఫీ చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు జిల్లాలో మూడో రోజైన శనివారం కూడా పెద్దఎత్తున కొనసాగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు కదం తొక్కారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరసించారు. భీమవరం ప్రకా శం చౌక్‌లో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నమూనా ప్రజాకోర్టు నిర్వహిం చారు. న్యాయమూర్తిగా కామన నాగేశ్వరరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాయప్రోలు శ్రీనివాసమూర్తి వ్యవహరించగా, రైతుగా విజ్జురోతి రాఘవులు, డ్వాక్రా సభ్యురాలిగా పాలవెల్లి మంగ, చంద్రబాబు నాయుడిగా సునిల్‌కుమార్ వ్యవహరించగా.. వినూత్నంగా నమూ నా వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని బాధితులుగా వ్యవహరించిన వారు ఆవేదన చెందారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నమూనా ప్రజాకోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను ఉరి తీయూలని పేర్కొన్నారు. దీంతో దిష్టిబొమ్మను ఈడ్చుకెళ్లి.. చెట్టుకు వేలాడదీసి.. అనంతరం దహనం చేశారు. దీంతోపాటు నారావారి నరకాసురుడి’ బొమ్మను దహనం చేశారు. కొయ్యలగూడెంలో ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మండల వైఎస్సార్ సీపీ యూత్ కన్వీనర్ తోట జయబాబు ఆధ్వర్యంలో రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల న్నిటినీ రద్దు చేయూలని కోరుతూ కామవరపుకోట తహసిల్దార్‌కు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పిం చారు. కొవ్వూరులో పార్టీ నాయకుడు పరిమి హరిచరణ్ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి నిరసన తెలిపారు. మహిళలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ నాయకులు పోల్నాటి బాబ్జి, బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో రైతులు, నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మొగల్తూరు మండలం కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేపట్టారు. జీలుగుమిల్లి జగదాంబ సెంటర్లో నరకాసురవధ కార్యక్రమం నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాల రాజు మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయూలని డిమాండ్ చేశారు. లేదంటే వారి తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.