Burqa ban
-
బుర్ఖా బంద్.. అతిక్రమిస్తే రూ.250 ఫైన్..!
పట్నా : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్నాలోని ఓ మహిళా కళాశాల నిర్వాకం చర్చనీయాంశమైంది. ముస్లిం విద్యార్థినిలు బుర్ఖా ధరించి కళాశాలకు రావొద్దని జేడీ మహిళా కాలేజీ హుకుం జారీ చేసింది. దాంతోపాటు తప్పని సరిగా డ్రెస్ కోడ్ పాటించాలని కాలేజీ యాజమాన్యం నోటీసులో పేర్కొంది. సోమవారం నుంచి శుక్రవారం డ్రెస్‌కోడ్ తప్పనిసరని.. నిబంధనలు అదిక్రమిస్తే రూ.250 పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేసింది. (చదవండి : బురఖా బ్యాన్పై వెనక్కి తగ్గిన సంజయ్) శనివారం ఒక్కరోజు డ్రెస్‌కోడ్ నుంచి మినహాయింపునిస్తున్నామని నిర్వాహకులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థినిలు ఈరోజు (శనివారం) నిరసనకు దిగారు. నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు కాలేజీ ప్రిన్సిపల్ శ్యామా రాయ్‌ని వివరణ కోరగా.. నోటీసులను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. -
బురఖా బ్యాన్పై వెనక్కి తగ్గిన సంజయ్
సాక్షి, ముంబై: బురఖా నిషేధంపై ఇటీవల సామ్నా సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు శివసేన ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ ఆదివారం ఉప సంహరించుకున్నారు. దీంతో గత వారం రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లు అయింది. గత నెలలో శ్రీలంకలో ఈస్టర్ వేడుకల సందర్బంగా వివిధ చర్చిల్లో వరుస పేలుళ్లు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత పేలుళ్లకు ఓ ఉగ్రవాద సంస్ధ బా«ధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. దీంతో దేశ ప్రజల భద్రత దృష్ట్య శ్రీలంకా ప్రభుత్వం ముస్లిం మహిళలు బుర్ఖా ధరంచడంపై నిషేధం విధించింది. చదవండి: (బురఖా బ్యాన్‌కు కేంద్ర మంత్రి నో..) ఇదే తరహాలో భారతదేశంలో కూడా బుర్ఖాలను నిషేధించాలని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయాలో సంజయ్ రావుత్ ఇటీవల వ్యాఖ్యలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. సర్వత్రా వ్యతిరేకత రావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కసాగింది. దీంతో పరిస్ధితులు అదుపుతప్పక ముందే సంజయ్ రావుత్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవ సంఘటనలపై విశ్లేషణలో ఒక భాగంగానే సంపాదకీయంలో పొందుపరిచామని స్పష్టం చేశారు. బుర్ఖా నిషేధించాలని శివసేన పార్టీగాని, ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేగాని డిమాండ్ చేయలేదని సంజయ్ వెల్లడించారు. -
బుర్ఖా నిషేధం.. చంపేస్తామని బెదిరింపులు
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎంఈఎస్ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు జారీచేసిన సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ హత్యా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎంఈఎస్ నిర్ణయం తీసుకుందని, దానిని వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌కాల్ ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన సూచనలు మేరకు డ్రస్‌కోడ్‌ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని, దానికి అనుగుణంగానే ఎంఈఎస్ విద్యాసంస్థల పరిధిలో బుర్ఖాని నిషేధించామని పోలీసులు వద్ద వాపోయారు. కాగా 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ ఫజల్ గఫూర్ దేశ వ్యాప్తంగా ఉన్న తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే దీనిపై కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యాసంస్థల్లో బుర్ఖాపై నిషేధం
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు. ఇస్లాం మతాన్ని పాటించడంలో తప్పులేదని కానీ, మద్యప్రాచ్యంలోని ఇస్లాం పద్దతులను సాటించడం సరికాదని ఫజల్ గఫూర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ ముధుక్కోయ థంగల్ మాట్లాడుతూ మత పరమైన అంశాలను ఎంఈఎస్ నిర్ణయించలేదన్నారు. బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఎస్ తీసుకున్న నిర్ణయం సరి కాదన్నారు. బుర్ఖాను ధరించడం ఇస్లాం సాంప్రదాయంలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ఎవరి మత సాంప్రదాయాన్ని వారు పాటించే హక్కు అందరికీ ఉందని.. నిబంధనలపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జఫ్రీ కోరారు. అయితే జఫ్రీ వ్యాఖ్యలపై స్పంధించిన ఎంఈఎస్ కేవలం కళాశాల ఆవరణంలోనే ఈ ఆదేశాలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో వారి ఇష్టమని వివరించారు. -
‘బుర్ఖా వేసుకున్న వారంతా ఉగ్రవాదులు కారు’
న్యూఢిల్లీ : శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలతో సహా ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ఉపయోగించే దుస్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మన దేశంలో కూడా బుర్ఖా ధరించి బయటకు రావడాన్ని నిషేధించాలంటూ శివసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయం గురించి ప్రచురించింది. అంతేకాక ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే సర్జికల్ దాడులు చేసిన దానికన్నా ఎక్కువ ధైర్యం కావాలంది. లంకలో బుర్ఖాలపై నిషేధం విధించారు.. మరి అయోధ్యలో ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు మోదీ అంటూ ప్రశ్నించింది. అయితే శివసేన డిమాండ్‌ను పలువురు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. సేన డిమాండ్‌పై స్పదించిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహ్మ రావు.. భారతదేశంలో ఇలాంటి నిషేధం అవసరం లేదని స్పష్టం చేశారు. మరో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే మాట్లాడుతూ.. ‘బుర్ఖా ధరించే ముస్లిం మహిళలంతా ఉగ్రవాదులు కారు. ఇది వారి సంప్రదాయం. దాన్ని గౌరవించాలి. భారతదేశంలో బుర్ఖాలపై నిషేధం అనవసరం’ అన్నారు. అయితే సాధ్వి ప్రజ్ఞా సింగ్ మాత్రం సేన డిమాండ్‌ను సమర్థించారు. కొన్ని నిర్ణయాలను దేశ రక్షణ కోసం తీసుకుంటాము. ఇలాంటి వాటిని అందరు తప్పక పాటించాలన్నారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాసిమ్ రిజ్వీ కూడా ఈ డిమాండ్‌ను వ్యతిరేకించారు. ‘ఇది ముస్లిం మహిళలకు సంబంధించిన నిర్ణయం. బుర్ఖా ధరించాలా వద్దా అనేది వారి ఇష్టం. అంతేతప్ప దేశ వ్యాప్తంగా బుర్ఖాను నిషేధించడం అనేది బాధ్యతారహితమైనదే కాక రాజ్యంగ విరుద్ధమైన డిమాండ్’ అంటూ మండిపడ్డారు. -
మేనిఫెస్టోలో సంచలన అంశం.. వింత వివరణ
లండన్: బ్రిటన్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు బరిలోకి దిగిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఒక కొత్త హామీని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే ముస్లిం మహిళలకు మరింత స్వేచ్ఛను ఇస్తామని, వారు ముసుగు ధరించడాన్ని రద్దు చేస్తామని తెలిపింది. ఇందుకు కారణంగా మాత్రం ఎవరూ ఊహించని విషయాన్ని తెలిపింది. ముసుగు వల్ల ముస్లిం మహిళలకు డీ విటమిన్ అందడం లేదని అందుకే దానిని రద్దు చేస్తామని తెలిపింది. ‘బురఖా ధరించడం వల్ల గుర్తింపును దాచినట్లవుతుంది. కమ్యునికేషన్‌కు ఇబ్బందవుతుంది. ఉద్యోగ అవకాశాలు తక్కువవుతాయి. గృహహింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అంతేకాకుండా శరీరానికి ఎంతో ముఖ్యమైన డీ విటమిన్ అందకుండా పోతుంది’ అంటూ పలు కారణాలు వివరిస్తూ మేనిఫెస్టోలో ముసుగు రద్దు అంశాన్ని యూకేఐపీ చేర్చింది. -
కర్నాటక కాలేజిలో బుర్ఖా వివాదం