ఘోర రోడ్డుప్రమాదాలు, 14మంది దుర్మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14మంది దుర్మరణం చెందారు. బిజ్నూరు సమీపంలో 75వ నంబర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణ బస్సు అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా లహర్పూర్ సమీపంలో ఓ ట్రక్...కారును ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.