bussineess
-
వరుణ్ బెవరేజెస్ చేతికి బెవ్కో
న్యూఢిల్లీ: పానీయాల దిగ్గజం పెప్సీకో ఫ్రాంచైజీ సంస్థ వరుణ్ బెవరేజెస్.. దక్షిణాఫ్రికా కంపెనీ బెవరేజ్ కంపెనీ(బెవ్కో)తోపాటు అనుబంధ సంస్థలను కొనుగోలు చేయనుంది. దక్షిణాఫ్రికా, లెసోఠో, ఎస్వటీని ప్రాంతాలలో పెప్సీకో ఫ్రాంచైజీ హక్కులను బెవ్కో కలిగి ఉంది. 3 బిలియన్ రాండ్ల(జెడ్ఏఆర్) (రూ. 1,320 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వరుణ్ బెవరేజెస్ వెల్లడించింది. తద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించనుంది. నమీబియా, బోట్స్వానా పంపిణీ హక్కులతోపాటు.. అత్యంత కెఫైన్ కంటెంట్ డ్రింక్ రీఫ్రెష్, ఎనర్జీ డ్రింక్ రీబూస్ట్, కార్బొనేటెడ్ డ్రింక్ కూఈ, జైవ్, ఫిజ్జీ లెమనేడ్ బ్రాండ్లను బెవ్కో కలిగి ఉంది. 2024 జులై31లోగా నగదు ద్వారా లావాదేవీని పూర్తి చేసే వీలున్నట్లు వరుణ్ అంచనా వేస్తోంది. 5 తయారీ కేంద్రాలు 2023లో బెవ్కో రూ. 1,590 కోట్ల టర్నోవర్ సాధించినట్లు వరుణ్ తెలియజేసింది. జోహన్నెస్‌బర్గ్‌లో రెండు, దర్బన్, ఈస్ట్ లండన్, కేప్‌టౌన్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు తయారీ యూనిట్లను కలిగి ఉంది. నిమిషానికి 3,600 బాటిళ్ల(బీపీఎం) సామర్థ్యం సంస్థ సొంతం. బెవ్కో కొనుగోలు ద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించనున్నట్లు వరుణ్ వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా అతిపెద్ద పానీయాల మార్కెట్‌కాగా.. రానున్న నాలుగేళ్లలో అంటే 2027కల్లా వార్షిక సగటున 5.3 శాతం చొప్పున వృద్ధి చూపగలదని అంచనా. దేశీయంగా పెప్సీకో అమ్మకాల పరిమాణంలో వరుణ్ బెవరేజెస్ 90 శాతాన్ని ఆక్రమిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది(2022–23) రూ. 10,596 కోట్ల ఆదాయం సాధించింది. బెవ్కో కొనుగోలు వార్తలతో వరుణ్ బెవరేజెస్ షేరు ఎన్ఎస్ఈలో 3.7 శాతం జంప్‌చేసి రూ. 1,174 వద్ద ముగిసింది. -
మళ్లీ కొత్త రికార్డులు
ముంబై: ఎఫ్ఎంసీజీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీ లు ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 122 పాయింట్లు పెరిగి 71,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్లు బలపడి 21,453 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడి కి లోనయ్యాయి. అయితే వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే షేర్లు ఒక శాతం రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోవడంతో పాటు లాభాలు ఆర్జించగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగి 71,624 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 21,505 వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్టాలు నమోదు చేశాయి. మరో వైపు ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లో నయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.603 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గుచూపడంతో ఆసియా మార్కెట్లు ఒక శాతం లాభపడ్డాయి. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు యూరప్ మార్కెట్లు పరిమిత లాభాల్లో కదలాడాయి. ► ‘‘స్టాక్ మార్కెట్లో ఆశావాదం కొనసాగింది. స్థిరీకరణ దశలో భాగంగా సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఎర్ర సముద్రం నౌకా మార్గానికి రక్షణ కల్పిస్తామంటూ అమెరికా ప్రకటనతో క్రూడాయిల్ ధరల్లో స్థిరంగా నెలకొంది. వృద్ధి ఆధారిత స్టాకుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు వినిమయ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► పెట్రోలియం క్రూడ్, డిజిల్‌పై ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.50%, ఓఎన్జీసీ, హిందూస్తాన్ పెట్రోలియం, బీపీసీఎల్, ఐఓసీ, పెట్రోనెట్ షేర్లు ఒకటి నుంచి అరశాతం చొప్పున పెరిగాయి. ►భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటన(మంగళవారం)కు ముందు దేశీయ ఐటీ షేర్లలో అప్రమత్తత చోటు చేసుకొంది. కోఫోర్జ్ 3%, విప్రో 2%, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు ఒకశాతం పతనమయ్యాయి. ఎంఫసీస్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీఎం షేర్లు అరశాతం నష్టపోయాయి. ► షేర్ల విభజన రికార్డు తేది జనవరి 5 గా నిర్ణయించడంతో నెస్లే ఇండియా షేరు 4.50% లాభపడి రూ.25,485 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5.50% పెరిగి రూ.25,699 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
మీ ఫోన్ లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
-
హైదరాబాద్ అంటే చాలా ఇష్టం
-
వారెవ్వా కియా! రికార్డు సృష్టించిన అనంత ప్లాంట్.. తక్కువ వ్యవధిలోనే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్ నుంచి 5 లక్షలకుపైగా యూనిట్లను భారత్‌తోపాటు విదేశాలకు సరఫరా చేసింది. దేశీయంగా 4 లక్షల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. లక్షలకుపైగా కార్లను 91 దేశాలకు ఎగుమతి చేసింది. 2019 సెపె్టంబర్లో అనంతపూర్ ప్లాంట్ నుంచి సెల్టోస్ కార్ల ఎగుమతి ప్రారంభమైంది. భారత్ నుంచి విదేశాలకు యుటిలిటీ వాహనాలను అధికంగా సరఫరా చేస్తున్న కంపెనీల్లో ఒకటైన కియా ఇండియా.. గతేడాది ఎగుమతుల్లో 25 శాతంపైగా వాటాను దక్కించుకుంది. ‘అయిదు లక్షల యూనిట్లు అనేది పెద్ద సంఖ్య. 29 నెలల్లోపే ఈ మైలురాయిని చేరుకున్నందుకు గర్విస్తున్నాం. భారత్‌లో మా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండీ అద్భుతమైన ఉత్పత్తులు, సేవల ద్వారా కస్టమర్లకు గొప్ప విలువను అందించడంపై దృష్టి సారించాం. నాలుగు లక్షల భారతీయ కుటుంబాలలో భాగమయ్యాం. వినియోగదార్లు మాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞతలు. కొత్త కారు కరెన్స్‌తో తదుపరి మైలురాళ్లను మరింత వేగంగా చేరుకోగలం. కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించడం ద్వారా దేశంలో వృద్ధి ప్రయాణంలో ఈ కారు మార్గనిర్దేశం చేస్తుంది’ అని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ ఈ సందర్భంగా తెలిపారు. -
5జీ ఎఫెక్ట్.. కొత్త ఫోన్లకు సూపర్ క్రేజ్
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు గ్రామీణ ప్రాంతాలు దన్నుగా నిలుస్తున్నాయి. దీనితో వచ్చే అయిదేళ్లలో స్మార్ట్ఫోన్ల యూజర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం దేశీయంగా 120 కోట్ల మొబైల్ యూజర్లు ఉండగా.. వీరిలో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ఫోన్లు తయారు చేసే రెండో దేశంగా నిలవనుంది. ఈ నేపథ్యంలోనే డెలాయిట్ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 1 బిలియన్ (100 కోట్లు) యూజర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది‘ అని 2022 గ్లోబల్ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా.. వినోదం, టెలికం) అంచనాల పేరిట రూపొందించిన నివేదికలో డెలాయిట్ తెలిపింది. దీని ప్రకారం 2021–26 మధ్య కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం వార్షిక వృద్ధి రేటు పట్టణ ప్రాంతాల్లో 2.5 శాతంగా ఉండనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 6 శాతం స్థాయిలో నమోదు కానుంది. ‘ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ స్మార్ట్ఫోన్లకు కూడా డిమాండ్ పెరగవచ్చు. ఫిన్‌టెక్, ఈ–హెల్త్, ఈ–లెరి్నంగ్ మొదలైన అవసరాల రీత్యా ఈ మేరకు డిమాండ్ నెలకొనవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. భారత్‌నెట్ ప్రోగ్రాం కింద 2025 నాటికల్లా అన్ని గ్రామాలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ప్రణాళిక కూడా గ్రామీణ మార్కెట్లో ఇంటర్నెట్ ఆధారిత డివైజ్‌ల డిమాండ్‌కు దోహదపడగలదని వివరించింది. కొత్త ఫోన్లకే మొగ్గు.. 2026 నాటికి పట్టణ ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనే వారి సంఖ్య 5 శాతానికే పరిమితం కావచ్చని 95 శాతం మంది తమ పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లను కొనుక్కునేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని డెలాయిట్ నివేదికలో తెలిపింది. 2021లో ఇలా తమ పాత ఫోన్ల స్థానంలో ప్రీ–ఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనేవారు 25 శాతంగా ఉండగా.. కొత్త వాటిని ఎంచుకునే వారి సంఖ్య 75 శాతంగా నమోదైంది. ఫోన్ సగటు జీవితకాలం దాదాపు నాలుగేళ్లుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపించనుంది. 2026లో ఆయా ప్రాంతాల్లో రీప్లేస్మెంట్లకు సంబంధించి 80 శాతం వాటా కొత్త ఫోన్లది ఉండనుండగా.. మిగతా 20 శాతం వాటా సెకండ్ హ్యాండ్ ఫోన్లది ఉండనుంది. ఇక స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ ఫీచర్ ఫోన్ల స్థానంలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడం కూడా తగ్గనుంది. 2021లో ఫీచర్ ఫోన్ రీప్లేస్మెంట్ .. పట్టణ ప్రాంతాల్లో 7.2 కోట్లుగా ఉండగా 2026లో ఇది 6 కోట్లకు తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో 7.1 కోట్ల నుంచి 6 కోట్లకు దిగి రానుంది. 5జీతో పెరగనున్న డిమాండ్ .. డెలాయిట్ అధ్యయనం ప్రకారం భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ 6 శాతం మేర వార్షిక వృద్ధితో 2026 నాటికి 40 కోట్లకు చేరనుంది. 2021లో ఇది 30 కోట్లుగా ఉంది. 5జీ సర్వీసుల కారణంగా స్మార్ట్ఫోన్లకు ప్రధానంగా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం అమ్మకాలకు (సుమారు 31 కోట్ల యూనిట్లు) ఇదే ఊతంగా నిలవనుంది. హై–స్పీడ్ గేమింగ్, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడం వంటి వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడే 5జీ టెక్నాలజీ.. మిగతా మొబైల్ సాంకేతికలతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్ తెలిపింది. ఒక్కసారి 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తే .. 2026 నాటికి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మొత్తం మీద అదనంగా 13.5 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. ‘2022–26 మధ్య కాలంలో మొత్తం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనితో ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. అయిదేళ్ల వ్యవధిలో 84 కోట్ల పైచిలుకు 5జీ పరికరాలు అమ్ముడు కానున్నాయి‘ అని డెలాయిట్ వివరించింది. మరోవైపు, మీడియా విషయానికొస్తే.. కొరియన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ కంటెంట్‌కు భారత్‌లో ప్రాచుర్యం పెరుగుతోందని తెలిపింది. దీంతో పలు స్ట్రీమింగ్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది. తమ కస్టమర్లను కాపాడుకునే క్రమంలో స్ట్రీమింగ్ సర్వీసుల కంపెనీలు.. రేట్ల విషయంలో పోటీపడే అవకాశం ఉంటుందని తెలిపింది. తగ్గనున్న చిప్‌ల కొరత.. సెమీకండక్టర్ చిప్‌ల కొరతతో ప్రపంచవ్యాప్తంగా తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని డెలాయిట్ తెలిపింది. సమీప కాలంలో డిమాండ్ పెరిగే కొద్దీ సరఫరాపరమైన పరిమితులు కొనసాగవచ్చని.. 2023లో క్రమంగా పరిస్థితి మెరుగుపడవచ్చని పేర్కొంది. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ ప్రాంతీయంగా పటిష్టమైన హబ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ పీఎన్ సుదర్శన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం .. ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. -
ఆదర్శంగా నిలుస్తోన్న వృద్ధ దంపతులు
ఆడుతూపాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది.. ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది.. అంటూ పాత సినిమా పాటలా వారి జీవితం హాయిగా సాగిపోతోంది.. ఎనిమిది పదుల వయసులోనూ వారి దాంపత్యంలో కాసింత కూడా ఆప్యాయత, అనురాగాలు తగ్గలేదు.. అంతేకాదు ఇప్పటికీ తమ రెక్కల కష్టంపైనే జీవిస్తున్నారు. మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.. మొదట్లో సీజనల్ పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించారు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడికి వివాహం చేశారు. వారిపై ఆధారపడకూడదని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి : పాలకొల్లు వీవర్స్ కాలనీకి చెందిన బైరి ఆదినారాయణ అతని భార్య సీత మొదట్లో పట్టణంలో పలు కూడళ్లలో సీజనల్ పండ్ల వ్యాపారం చేసేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు. వీరిని పెద్ద చేసి వివాహాలు చేశారు. అంతేకాదు వీవర్స్‌కాలనీలో 50 గజాల స్థలం కొనుగోలు చేసి సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత మొక్క జొన్నపొత్తులు కాల్చి అమ్మడం వృత్తిగా చేసుకున్నారు. సీజనల్‌గా బత్తాకాయలు, సపోటా, రేగిపండ్లు, చిలగడదుంపడలను ఉడకపెట్టి విక్రయించడం, తేగలు అమ్మకాలు చేస్తూ జీవనం సాగించారు. ప్రస్తుతం వయోభారం మీదపడటంతో పొత్తులకే పరిమితం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి మొక్కజొన్న పొత్తులను తీసుకువచ్చి బొగ్గులపై కాల్చి అమ్మకాలు చేస్తూ రోజుకు రూ.400 వరకు సంపాదిస్తున్నారు. వృద్ధాప్యంలోనూ కుమార్తెలు, కుమారుడిపై ఆధారపడకుండా కాలు చేయి పనిచేసినంత వరకు కష్ట పడుతూ జీవనం సాగించాలని అనుకుంటున్నామని ఆ వృద్ధ దంపతులు చెప్పిన మాటలు పలువురికి ఆదర్శం. ఏ వృత్తిలోనైనా కష్టపడితే ఫలితం నాకు 20వ ఏటలో సీతతో వివాహమయ్యింది. అప్పట్నుంచీ సీజనల్ పండ్ల వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడిని. సీత ప్రతి విషయంలోనూ చేదోడువాదోడుగా ఉంది. ఎవరిపైనా ఆధారపడకుండా కాళ్లు చేతులు పనిచేసేంతవరకు కష్టపడి జీవించాలనేది మా ఇద్దరి ఆలోచన. – బైరి ఆదినారాయణ, మొక్కజొన్నపొత్తుల వ్యాపారి, పాలకొల్లు రెక్కాడితే కాని డొక్కాడదు నాకు ఆదినారాయణతో వివాహమైన తర్వాత మా ఇద్దరి మాట ఒకటే అనుకుని ఆయన పండ్ల వ్యాపారం చేస్తే నేను కూడా చేదోడువాదోడుగా ఉండేదాన్ని. పిల్లలకు వివాహాలు చేశాం. సొంతిల్లు కట్టుకున్నాం. ఇదంతా రెక్కల కష్టమే. నాకు 65 ఏళ్ల వయసు వచ్చింది. ప్రస్తుతం మొక్క జొన్నపొత్తులను అమ్ముకుంటూ ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నాం. –బర్రె సీత, పాలకొల్లు ఆదినారాయణ, సీత దంపతులు -
వృద్ధిబాటలో జీవిత బీమా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడేళ్ళ విరామం తర్వాత ఈ ఏడాది జీవిత బీమా పరిశ్రమలో వృద్ధి నమోదవుతుందని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏ) ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో జీవిత బీమా వ్యాపారంలో వృద్ధి కనిపించిందని, మలి రెండు త్రైమాసికాల్లో ఇదే విధమైన వృద్ధి నమోదవుతుందన్న విశ్వాసాన్ని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యక్తం చేశారు. ఐఆర్డీఏ అనుబంధ సంస్థ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీ) కొత్త కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జీవిత బీమాలో పది శాతం లోపు, సాధారణ బీమాలో 16 నుంచి 17 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తం మీద జీవిత, సాధారణ బీమా వ్యాపార పరిమాణం రూ. 4 లక్షల కోట్లు దాటుతుందన్నారు. గతంలో కొత్త పథకాలను ఆమోదించడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టేదని, ఐఐబీ సమాచారం అందుబాటులోకి వస్తే ఈ సమయం మరింత తగ్గుతుందన్నారు. ఇతర దేశాలకు అనుగుణంగానే దేశంలో జీవిత బీమా సాంద్రత ఉన్నప్పటికీ ఇంకా వ్యాపారం విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. జీవిత బీమా సమాచారం కూడా సేకరిస్తాం ప్రస్తుతం వాహన, ఆరోగ్య బీమాలతో పాటు ఇతర సాధారణ బీమా పథకాల సమాచారాన్ని సేకరిస్తున్నామని, త్వరలోనే జీవిత బీమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐఐబీ సీఈవో ఆర్.రాఘవన్ తెలిపారు. పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ సమాచారంతో బీమా కంపెనీలు, ఐఆర్డీఏ కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్‌లో వీసేవాను ప్రవేశపెట్టామని, అలాగే హాస్పిటల్స్ అన్నింటికి ఏకీకృత సంఖ్యను ఇస్తూ పెలైట్ ప్రాజెక్టును మొదలు పెట్టినట్లు రాఘవన్ తెలిపారు.