buttaya gudem
-
చాక్లెట్ అనుకుని ఎలుకల మందు తిని..
సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి): బుట్టాయగూడెం మండలం రాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పట్టెం గౌతమి కుమారుడు అభిచరణ్‌తేజ ఆదివారం రాత్రి చాక్లెట్ అనుకుని ఎలుకలమందు తినుకుంటూ వచ్చి గ్రామంలోని మరో ఇద్దరు బాలలు కట్టం సంతోష్, మడకం రాహుల్‌లకు ఇచ్చాడు. వారు కూడా చాక్లెట్‌గానే భావించి తిన్నారు. తిన్న కొద్దిసేపటికి వాంతులు కావడంతో ముగ్గురూ అపస్మారక స్థితికి వెళ్లారు. బాలలను గమనించిన వారి కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్యం కోసం బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అభిచరణ్ తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ అభిచరణ్‌తేజ (5) మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు బాలలు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. అభిచరణ్‌తేజ మృతిపై అనుమానాలు అభిచరణ్‌తేజ మృతిపై అతని తాత, నాన్నమ్మలు, తండ్రి కుమార్ రాజాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ మృతిపై తల్లిపైనే తమకు అనుమానం ఉందని ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గౌతమి, కుమార్ రాజాలు మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారని వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ కోర్టులో కూడా ఉన్నట్లు వారు చెబుతున్నారు. మృతిపై పోలీసులకు తాత కృష్ణ, నాన్నమ్మ రామలక్ష్మిలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా ఫిర్యాదు అందుకున్న స్థానిక ఎస్సై కె.నాగరాజు రాయిగూడెం గ్రామానికి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో గౌతమి ఇంట్లో మంచం కింద ఉన్న ఎలుకల మందు ప్యాకెట్‌ను పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం ఎస్సై ఏలూరు వెళ్లి అభిచరణ్‌తేజ మృతికి సంబంధించి పోస్టుమార్టం అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలుకల మందు తినడం వల్ల అభిచరణ్‌తేజ మృతి చెందినట్లు భావిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు
రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు బుట్టాయగూడెం: జిల్లాలోని బుట్టాయగూడెం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం, గోపాలపురం బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. బుట్టాయగూడెంలోని వసతి గృహంలో రికార్డులు, స్టాకు నిల్వలు, ఖర్చుల వివరాలను పరిశీలించారు. వసతి గృహంలో బిల్డింగ్ సక్రమంగా లేదని, స్టాకులో వ్యత్యాసాలు ఉన్నాయని తమ పరిశీలనలో తేలిందని ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. విద్యార్థులు కూడా హాజరులో ఉన్నదాని కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. రాష్ట్ర అవినీతి శాఖాధికారి ఆర్కే ఠాకూర్ ఆదేశాల మేరకు వసతి గృహాల్లో తనిఖీలు చేశామన్నారు. అక్రమాలు అరికట్టేలా వసతి గృహాలకు సరఫరా చేసే వస్తువులపై తప్పనిసరిగా సీలు ఉండాలని ఉన్నతాధికారులకు సూచన చేశామని చెప్పారు. ఏసీబీ సీఐ జె.విల్సన్, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. గోపాలపురం హాస్టల్లో అవకతవకలు గోపాలపురం: గోపాలపురం పెద్దగూడెంలోని బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ బి.గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్లో పలు అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య 117 మందికిగాను కేవలం 19 మంది మాత్రమే ఉన్నారని, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం లేదని, మెనూ పాటించడం లేదని తమ పరిశీలనలో తెలిసిందన్నారు. ఉదయం 6 గంటలకు వార్డెన్, వంట మనిషి, అటెండర్లు రావాల్సి ఉండగా ఎవరూ లేనట్టు గుర్తించామన్నారు. వీరికి బదులుగా ఒక ప్రైవేట్ మహిళను ఏర్పాటుచేసుకుని హాస్టల్ నిర్వహిస్తున్నారని చెప్పారు. 98 మంది విద్యార్థులకు అందాల్సిన ఆహారం వార్డెన్ స్వాహా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వార్డెన్ డి.నేతాజీ నుంచి వివరాలు సేకరించి రికార్డులు పరిశీలించామన్నారు. అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు డీఎస్పీ చెప్పారు. సీఐ కె.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎం.నాగు, ఎం.శ్రీనివాస్, పీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. -
విజయ బ్యాంక్‌లో 43 లక్షలు మాయం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం విజయ బ్యాంకులో గోల్మాల్ జరిగింది. నకిలీ పాస్ పుస్తకాల సృష్టించి రూ.43 లక్షలు మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్డీవో, తహసీల్దార్, వీఆర్వో సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంక్ అధికారులను బురిడీ కొట్టించారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.