bv sudhakar
-
దేశవ్యాప్తంగా ఐపీపీబీలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పోస్టల్ కార్యదర్శి బీవీ సుధాకర్ వెల్లడించారు. శుక్రవారం డాక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సెప్టెంబర్ నాటికి జిల్లాకు ఒకటి చొప్పున సుమారు 650 బ్యాంక్ శాఖలు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బ్యాంకులకు వాటి పరిధిలోని పోస్టాఫీసులను అనుసంధానించనున్నట్లు పేర్కొన్నా రు. కేంద్రం అమలు చేస్తున్న నగదు బదిలీ (డీబీటీ) పథకంలో ప్రభుత్వం, వినియోగదారుడికి మధ్య సేవలందించనుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే బ్యాంకు పాలనాయంత్రాంగం కోసం 3,500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టల్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ఇటీవల జాతీయ సర్వీస్ కాల్ సెంటర్‌ను ప్రారంభించామని, టోల్‌ఫ్రీ నంబర్ 1924కు ఫోన్ చేస్తే 24 గంటల్లోగా ఫిర్యాదులపై స్థితిగతులు అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామీణ డాక్ సేవలో ఖాళీగా ఉన్న సుమారు 55 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టల్ శాఖ సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించినట్లు సుధాకర్ వెల్లడించారు. పోస్టల్ భవనాలకు సోలార్ విద్యుత్ వినియోగిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 13,800 కోట్ల ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా నిర్ణయించా మన్నారు. సమావేశంలో ఏపీ సర్కిల్ సీజీఎం సంపత్, రాధిక చక్రవర్తి పాల్గొన్నారు. -
తక్కువ చార్జీలు.. మెరుగైన సేవలు
పోస్టల్ ట్రాన్స్‌పోర్టు సేవలు ప్రారంభం వస్తువులతో పాటు కూరగాయల రవాణా హైదరాబాద్: పోస్టల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా వస్తువులతో పాటు కూరగాయల రవాణాకూ వెసులుబాటు కల్పించామని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని జనరల్ పోస్టు కార్యాలయంలో పోస్టల్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ, ప్రైవేటు రవాణా సంస్థల కంటే తక్కువ చార్జీలతోపాటు డోర్ డెలివరీతో మెరుైగె న సేవలందిస్తామన్నారు. ప్రాథమికంగా ఈ సేవలను నాలుగు ప్రధాన రూట్లలో ప్రారంభిస్తున్నామని, డిమాండ్‌ను బట్టి త్వరలో గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పారు. రోజూ హైదరాబాద్ నుంచి మూడు రూట్లు, విజయవాడ నుంచి ఒక రూట్లో పోస్టల్ రవాణా సేవలు అందించేలా అప్ అండ్ డౌన్‌కు ప్రత్యేకంగా ఎనిమిది కార్గో వాహనాలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రూట్ మార్గమధ్యలో సైతం ట్రాన్స్‌పోర్టు గూడ్స్ సేకరణ, డెలివరీ సేవలు ఉంటాయని వివరించారు. వస్తువు బరువును బట్టి కిలోమీటరు చొప్పున చార్జీలు ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోస్టల్ శాఖను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సర్కిళ్లుగా విభజించేందుకు కేంద్రశాఖకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పోస్టల్ శాఖను విభజిస్తే తెలంగాణలో 7 వేల పోస్టాఫీసులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 9 వేల పోస్టాఫీసులు ఉంటాయన్నారు. రాష్ర్టంలో మరో 11 కొత్త పోస్టాఫీసులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. -
తపాలా సేవలకు ఎస్ఎంఎస్ అలర్టులు
జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు సభలో చీఫ్ పోస్ట్ మాస్టర్ వెల్లడి ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు హైదరాబాద్, న్యూస్‌లైన్: స్పీడ్‌పోస్టు, రిజిస్టర్‌పోస్టు, ఎంవో వినియోగదారులకు ఎస్ఎంఎస్ అలర్టు సేవలు ప్రవేశపెడుతున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ బీవీ సుధాకర్ వెల్లడించారు. ఇక్కడి అబిడ్స్‌లోని డాక్ సదన్‌లో జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ప్రవేశ పెడుతున్న తపాలా సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. స్పీడ్‌పోస్టు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విజయవాడ డివిజన్‌కు చెందిన డి.శ్రీనివాసరావు ప్రథమ, విశాఖపట్నం డివిజన్‌కు చెందిన వి.సుధాకర్‌బాబు ద్వితీయ, శ్రీకాకుళం డివిజన్‌కు చెందిన జి.యు.ఎస్.గుప్తా తృతీయ బహుమతులు అందుకున్నారు. సూపర్వైజర్ కేటగిరీలో హుజూర్నగర్ సబ్‌డివిజన్‌కు చెందిన వి.వెంకటేశ్వర్లు మొదటి గ్రేడ్ అవార్డును అందుకున్నారు. పోస్టుమ్యాన్ కేటగిరీలో శివరాంపేట్ డివిజన్‌కు చెందిన బి.రమణ మొదటి, చిత్తూరు డివిజన్లోని అంబరీష్ నాయుడు రెండో గ్రేడ్ అవార్డులను అందుకున్నారు. పోస్టులైఫ్ ఇన్యూరెన్స్(పీఎల్ఐ) బెస్టు ఫెర్ఫార్మర్ గా విశాఖపట్నం రీజయన్ నుంచి సి.హెచ్.వి.డి.కె.మూర్తి నాయుడు, బెస్టు ఫీల్డ్ ఆఫీసర్‌గా హైదరాబాద్ సౌత్ ఈస్టు డివిజన్ నుంచి జె.బాల్‌రెడ్డి, బెస్టు డిపార్టుమెంటల్ ఎంప్లాయిలుగా హైదరాబాద్ సౌత్డివిజన్ నుంచి కె.కిరియా, కర్నూలు డివిజన్ నుంచి బి.మహబూబ్‌బాషా, ఎస్.టిప్లా నాయక్, గుంటూరు డివిజన్ నుంచి బోయపాటి ప్రశాంతి, కాకినాడ డివిజన్ నుంచి జి.సుబ్బారావు, అనకాపల్లి నుంచి జి.జగదీష్‌లు అవార్డులు అందుకున్నారు. రూరల్ పోస్టులైఫ్ ఇన్స్యూరెన్స్‌లో బెస్టు డిపార్టుమెంటల్ ఎంప్లాయీలుగా భీమవరం నుంచి ఎస్ఎన్.సి.హెచ్.ఎస్.కె.వి.ఎస్.ఆర్. ఆచార్యులు, కె.ఎస్.బి.రామాచార్యులు, కర్నూలు రీజియన్ నుంచి ఎస్.నర్సింహులు అవార్డులు చేజిక్కించుకున్నారు. బెస్టు గ్రామీణ్ డాక్ సేవక్ కేటగిరీలో భీమవరం డివిజన్ నుంచి ఎం.విజయ్‌కుమార్, విజయవాడ డివిజన్ నుంచి ప్రసాద్, విజయవాడ రీజనల్ ఆఫీసర్ పుండరీకాక్షుడులు అవార్డులు అందుకోగా బెస్టు డెరైక్టు ఏజెంట్ కేటగిరిలో కర్నూలు రీజియన్ నుంచి జగదీశ్వరయ్య, పద్మజ, తెనాలి డివిజన్ నుంచి ఎ.సరిత అవార్డులు దక్కించుకున్నారు.