B.vinod kumar
-
నూతన లక్ష్యాలను పెట్టుకోండి: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులు, యువత కొత్త సంవత్సరంలో నూతన లక్ష్యాలను పెట్టుకోవాలని, ఆ లక్ష్యాలను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కష్టపడి పనిచేయాలని మంత్రి టి.హరీశ్‌రావు ఆకాంక్షించారు. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆయన రాష్ట్ర ప్రజలకు మంగళవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలి: వినోద్‌కుమార్ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు శాంతితో జీవించాలని, అన్ని విధాలా వారికి మంచి జరగాలని ఓ ప్రకటనలో ఆయ న ఆకాంక్షించారు. గతేడాది కొన్ని దుర్ఘటనలు జరిగినా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలి: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ అభిలషించారు. భారత్‌ను శక్తిమంతమైన దేశంగా రూపొందించడంలో ప్రజలంతా కృషి చేయాలని, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన కోరారు. ‘ఉల్లాసంగా జరుపుకోండి’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను ప్రమాద రహితంగా జరుపుకోవాలని, పౌరుల భద్రతకై ఉద్దేశించిన ట్రాఫిక్ తదితర నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. పోలీసులకు సహకరించి ఈ వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
కీలక శాఖల్లో అభివృద్ధి సంస్కరణలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కీలక శాఖల్లో అభివృద్ధి సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు అభివృద్ధి పథంలో అవసరమైన రోడ్‌మ్యాప్‌లు తయారు చేసి సంస్కరణల ఫలితాలు అధ్యయనం చేసేందుకు గాను సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (సీఈజీఐఎస్)తో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక బోర్డు వైస్‌చైర్మన్ బి.వినోద్ కుమార్ల సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో త్రైపాక్షిక ఒప్పందంపై ఆయా శాఖలు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆర్థిక, సామాజిక అభివృద్ధి, ప్రజాధన వ్యయంలో నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా చతుర్ముఖ వ్యూహం అవలంభించనున్నారు. పలు రంగాల్లో వస్తున్న ఫలితాలపై సమాచారాన్ని సేకరించడం, దాని ఆధారంగా పనితీరు మెరుగుపర్చుకోవడం, బడ్జెట్ రూపకల్పన, ప్రణాళికల అమలులో వ్యూహాత్మకంగా వ్యవహరించడం, కీలక శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చేలా రోడ్‌మ్యాప్‌లు తయారు చేసి ఆయా సంస్కరణల ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేయడంలో ఇరు పక్షాలు కలసి పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఈజీఐఎస్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్. కార్తీక్ మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) స్పందించింది. కారు గుర్తును పోలిన సింబల్స్ వల్ల చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని ఈసీకి కేసీఆర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ కారు గుర్తు బోల్డ్(గుర్తు రంగు కనిపించేలా మార్పు) చేయడంపై టీఆర్ఎస్ సూచనలను కోరింది. ఈ మేరకు మార్పు చేసిన కారు గుర్తు సింబల్‌ను ఎంపీ వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి సమర్పించారు. అనంతరం మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడారు. ఓటర్లు గందరగోళానికి గురయ్యారు: వినోద్ ఎన్నికల బ్యాలెట్లో కారు రంగు సరిగా లేకపోవడంతో వృద్ధులు, కంటి సమస్య ఉన్న వారు తమ పార్టీ గుర్తును పోల్చుకోవడంలో ఇబ్బందులు పడ్డారని వినోద్ వివరించారు. మరో పార్టీకి సంబంధించిన ట్రక్కు గుర్తు, కారు గుర్తును పోలి ఉండటం వల్ల చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని పేర్కొన్నారు. గుర్తు మాత్రమే కాకుండా పేర్లు కూడా ఒకేలా ఉండేలా ఆ పార్టీ ఓటర్లను గందర గోళానికి గురిచేసిందన్నారు. ఇలాంటి తప్పులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూడాలని కేసీఆర్ గతంలో ఎన్నికల సంఘాన్ని కోరారని గుర్తు చేశారు. -
రేవంత్ తొడగొట్టి... మీసాలు మెలేయడం...
కరీంనగర్: కొడంగల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో బి.వినోద్‌కుమార్ విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తొడగొట్టి ... మీసాలు మెలేయడం సాక్షులను బెదిరించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మాకు వ్యతిరేకంగా ఉంటే అంతుచూస్తామన్నట్లు రేవంత్ వ్యవహరించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా లేరని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు .... రేవంత్‌ను పావులా వాడుకున్నారని విమర్శించారు. ఈ నెల 21వ తేదీ లోపు హైకోర్టు విభజన లేకుంటే పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని ఎంపీ వినోద్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఆదర్శపాలన అందిస్తాం
కరీంనగర్, న్యూస్‌లైన్ : సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి ఆదర్శవంతమైన పాలన అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలోని ప్రతిమా మల్టిప్లెక్స్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి జిల్లా మొదటినుంచి వెన్నుదన్నుగా నిలిచిందని, ఇప్పుడు కూడా 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను అందించి అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింపజేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. మార్పు కోసం పోరాటం అనే లక్ష్యంతో అభివృద్ధి అనే ఉద్యమంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ , తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఎన్నికల హామీలైన నిరుపేదలకు ఇళ్లు, పింఛన్లు, లక్ష రూపాయల రుణమాఫీలను అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వం 20 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గన్నీ సంచులు, లారీలు ఏర్పాటు చేసి త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సివిల్ సప్లయ్స్ ఎండీతో మాట్లాడతామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రూ.350 కోట్ల నిధులతో తాగునీరు అందిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నాయకులు రవీందర్‌సింగ్, చల్లా హరిశంకర్, బోనాల శ్రీకాంత్, నేతికుంట యాదయ్య, పెద్దపల్లి రవీందర్, కఠారి రేవతిరావు, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, కట్ల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేల బృందం అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్ తదితరులు బుధవారం కలెక్టర్ వీరబ్రహ్మయ్యను కలిసి వినతిపత్రం అందించారు. కొనుగోళ్లు ఆలస్యమై కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. మిగతా ధాన్యాన్ని గోదాములకు తరలించి రైతులను ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు సన్మానం కలెక్టరేట్ : ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలను కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య సన్మానించారు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, పుట్ట మధుకర్ బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.