bypoll schedule
-
Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ 94 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్బందర్ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్‌లోని భగవాన్‌గోలా, కర్ణాటకలోని షోరాపూర్ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. -
మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు కాకుండా జనవరిలో జరిగితే పార్టీకి మరింత ప్రయోజనమని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు ఈ అభిప్రాయంతో ఉన్నట్టు పార్టీవర్గాల సమాచారం. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తే ఫలితం ఉంటుందని, అక్కడి గెలుపు ఇక్కడ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని వీరు భావిస్తున్నట్లు పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. అదే సమయంలో జాతీయ నాయకత్వంలోని కొందరు నేతలు ఈ ఎన్నిక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తేనే మంచిదనే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీపరంగా చక్కదిద్దాల్సిన అంశాలు, ఈ ఎన్నిక ఆలస్యంగా జరగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి అధినాయకత్వానికి తెలియజేస్తే మంచిదనే ఆలోచనలో రాష్ట్ర నేతలు ఉన్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు వచ్చే ఫిబ్రవరి వరకు సమయముండటాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు. పరిస్థితులన్నీ చక్కదిద్దుకునేలా.. మునుగోడు ఉప ఎన్నిక పురస్కరించుకుని పార్టీపరంగా బీజేపీకున్న సమన్వయ లోపాలు, లోటుపాట్లు, ఇతర సమస్యలను అధిగమించేందుకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అవసరమైన కార్యాచరణను వెంటనే చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అదే సమయంలో పార్టీకి అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వివిధ వర్గాల మద్దతు కూడగట్టి కచ్చితంగా గెలిచేలా చేసేందుకు కూడా మరికొంత సమయం అవసరమని అంచనా వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారనున్న ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు అత్యంత ఆవశ్యకం కావడంతో అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాతే ఎన్నిక జరిగితే బావుంటుందనేది నేతల ఆలోచనగా ఉంది. ఇదీ చదవండి: కేడర్‌ను కదిలించేలా ‘భారత్ జోడో యాత్ర’.. టీపీసీసీ ముమ్మర కసరత్తు -
కర్ణాటకలో ఉప ఎన్నికల నగారా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు అదే నెల 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో సంజీవ్ కుమార్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు ఉపసంహరణ ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలతో సహా జిల్లాల్లో కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నియమావళి పోటీ చేసే అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. గత జూలైలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్‌కుమార్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. రాజరాజేశ్వరినగర, మస్కి నియోజకవర్గాలపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ ఎన్నికలు జరపడం లేదు. -
తమిళనాడులో ఉప ఎన్నికలకు షెడ్యూల్
చెన్నై: తమిళనాడులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో ఈసీ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో మరో స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాలన వ్యవహారాలను మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఎవరు ఖరారు చేస్తారన్నది తేలాల్సివుంది.