byreddy rajashekar reddy
-
ఎవడబ్బ సొమ్మని వందల కోట్ల ఖర్చు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో తన నివాసంలో బైరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని పేరుతో చంద్రబాబు రూ.లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. శంకుస్థాపన ఖర్చుపై న్యాయస్థానంలో పిల్ దాఖలు చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదన్నారు. సీమ వాసులకు చీకటి రోజు: అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం తేదీ 22న రాయలసీమ వాసులకు చీకటి దినమని బైరెడ్డి అన్నారు. సీమవాసులెవరూ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లరాదని, అలా వెళ్తేవారు రాయలసీమ ద్రోహులే అని చెప్పారు. తాను శంకుస్థాపనకు రానని, తనకు ఆహ్వానం పంపవద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. -
సాగర్‌ను సిద్దేశ్వరం దగ్గర కట్టి ఉంటే..
కర్నూలు సిటీ: పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. సాగర్‌ను సిద్దేశ్వరం దగ్గర కట్టి ఉంటే.. ఈ రోజు రాయలసీమ పచ్చటి పొలాలతో కళకళలాడేదన్నారు. మంగళవారం ఆయన కర్నూలులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల గురించి పట్టించుకోని బాబు.. రైతు యాత్రల పేరిట ఏసీ బస్సుల్లో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. బాబుకి రైతులంటే అలర్జీ అని, అన్నదాతల వాసనంటే గిట్టదన్నారు. ఈ నెల 23న జెడ్పీ సమావేశంలో శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టంపై తీర్మానం చేసేందుకు ప్రతి పక్షాలు పట్టుబడితే.. డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి వాకౌట్ చేసుకోండి అని చెప్పడం ఆ పార్టీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్ నిర్మించేటప్పుడు కూడా నాటి ప్రభుత్వ పెద్దలు సాగర్ నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఇచ్చిన మాటను ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. హంద్రీనీవా కాంట్రాక్టర్లందరూ బాబు చూట్టే ఉన్నారని, వారి అక్రమాల వల్లే కాలువకు గండ్లు పడుతున్నాయన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పరిధిలో రైతులకు తెలియకుండా రిలయన్స్‌కు 5,500 ఎకరాల భూములను కట్ట బెట్టారని, ఈ వ్యవహారంపై వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో రైతుల బతుకుదెరువు యాత్ర చేపడతానన్నారు. -
బైరెడ్డి అరెస్టుకు నిరసన
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. తంగడంచ పరిశ్రమల కోసం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా.. ఇవాళ తంగడంచ నుంచి కర్నూలు వరకూ పాదయాత్ర చేసేందుకు బైరెడ్డి సన్నాహాలు చేశారు. కాగా.. ఉద్రిక్తతలు తలెత్తకుండా.. పాదయాత్ర ప్రారంభానికి ముందే ఆయన్ని పోలీసులు గృహనిర్భంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. బెరైడ్డి అరెస్టును నిరసిస్తూ పలువురు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. 44వ జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు.